ఈ సృష్ఠిలోని అన్ని వస్తువులు ఒక్క వస్తువునునుండి వచ్చినవే.ఎక్కడ నుండి వచ్చింధి అక్కడికే వెళ్ళాలన్నధి స్రుష్ఠి ధర్మం. స్రుష్ఠి ఆధిలో జరిగిన మహాప్రేలుడు, ప్రళయంతో విడి పోయిన వస్తువులు మళ్ళి కలవాలనుకోవడంలో వింత లేదు . మన శరీరాలు సైతం అదే ఆది వస్తువుతో రూపు దిద్దుకున్నది.
మనం ఆడ,మగ అందరం కలవాలనుకుంటాం. అది సెక్స్ లో ముగుస్తుంది. సెక్స్ తో విలీనం సాధ్య్ మా అంటే కాదు. శరీరాలు ఎక్కువ సేపు కలిసి ఉండ లేవ్.శరీరాలు కలిసినా శరీరాలకు అతీతంగా మనలో ఉన్న మరేదో కలవడం లేదు.
శరీరానికి అతీతంగా మనలో ఉన్న మరేదో ఇతరుల్లో ఉన్న మరి దేని తోనో కలిసి పోవాలని ఉవ్విళ్ళూరుతుంది. ఆ విలీనానికి శారీరికంగా ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నానికి తొలి మెట్టే ప్రేమ.
ప్రాథమికంగా మన శరీరాలు కేవలం పరికరాలు వంటివే. ఇంతకీ ఆ విలీనానికి తపించడంలో మాత్రం బుర్రకన్నా శరీరానికే స్ఫురణ ,ప్రేరణ ఎక్కువ. ఇందుకు కారణం ఈ శరీరం భువి పై ఆధారపడి బ్రతుకుతుండడమే.
ఏకమై ఉన్న మాట వాస్తవం. మళ్ళి ఏకం కావాలనుకోవడం వాస్తవం. కాని అందుకు శారీరికంగా ప్రయత్నించటమే పెద్ద పొరబాటైంది. పైగా ఆ విలీనానికి ఈ శరీరాలు అడ్డనుకోవడం(అంతర్లీనంగా/సబ్ కాన్షియస్ మైండ్లో) మరి పెద్ద పొరబాటై కొంప ముంచింది. ఆ గొప్ప విలీనానికి ఈ శరీరమడ్డనుకున్న మానవులు రెండే కార్యక్రమాలకు పరిమితమయ్యే. ఒకటి చంపడం,లేదా చంప బడడం.
ఈ రెండుకార్యకరమాలు డబ్బు,పదవి,సెక్స్ లో పాక్షికంగానైనా నెరవేరుతుంది కాబట్టే మానవులకు ఇవంటే వల్లమాలిన ప్రేమ.
మరి మహా ప్రేలుడు ద్వారా విడిపోయిన మనం మళ్ళి ఏకం కాగలమా? వెయిట్ అండ్ సీ


0 comments:
Post a Comment