క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Sunday, 27 February 2011

ఎన్.టి.ఆర్ వై.ఎస్. చేసిన తప్పిదాలు


ఎన్.టి.ఆర్ వై.ఎస్.ల బొమ్మలు పెట్టుకుని ఏమిటిది అని వారి అభిమానులు నొచ్చుకోకుంటే కొన్ని సత్యాలు చెప్పగలను. ఎన్.టి.ఆర్ భాటలో సాగే వారు ఎవరూ లేదుకాబట్టి ఆయన గారి తప్పిదాలు ఒకట్రెండు చెప్పి వై.ఎస్ పథంలో సాగే జగన్ కు కనువిప్పుకావాలి కాబట్టి వై.ఎస్. తప్పిదాలను ఎకరవు పెడతా.

ఎన్.టి.ఆర్:
ఆయనతో వ్యక్తిగత సంభంధాలు లేనప్పటికి ఆయన తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన తీరును పట్టి ఆయన గురించిన నా అంచనా. మొండి గటం -అమాయకుడు - కుళ్ళు కుతంత్రాలు తెలీని వాడు -ఎదుటి వారు చేసినా పసి కట్టలేని వాడు.

ఈయన చేసిన తప్పిదమేమంటే ఒక్క మద్యపాన నిషేదం - ఒక్క రెండు రూపాయలకే కిలో భియ్యం పథకం అమలు చేస్తే చాలనుకోవడం. (అప్పట్లో రాష్థ్ర్ర ఆర్థిక స్థితికి దీనికంటే ఎవరూ పొడవలేరనుకొండి) .నిషేదం దెబ్బకి లిక్కర్ లాబి బాబును పావుగా వాడుకుని ఆ మహామనిషిని దిక్కు లేని చావుకు గురిచేసాయి. నిషేదం ఏ మెరకు అమలయిందో దేవునికే ఎరుక. మన ప్రభుత్వ యంత్రాంగం ఎంత గొప్పగా పని చెయ్యగలదో వ్యక్తిగతంగానే నాకు సవా లక్షా చేదు అనుభవాలున్నవి. ఈ యంత్రాంగాన్ని ప్రక్షాళన చెయ్యక ఆ రాముడే దిగి వచ్చినా పొడవ కలిగేది ఏదీ లేదు. ఈ దిక్కుమాలిన యంత్రాంగాన్ని పెట్టుకుని మద్యపాన నిషేదం అమలు దాదాపుగా అసాధ్యం. ఎక్సైజు పన్ను రాబడికే బొక్క తప్ప పొరుగు రాష్ఠ్ర్రపు మద్యం, అక్రమ మద్యం ఏరులై పారి ఉంటుంది.

నేనింతగా నొచ్చుకుంటున్నా ఎన్.టి.ఆర్ హయాంలో అమలైన స్త్ర్రీలకు ఆస్తి హక్కు, మహిళా వర్సిటి, మండలాల వ్యవస్థ, తి.తి.దే లో సంస్కరణలు,ప్రైవేటు ఇంజినీరింగ్,మెడికల్ కళాశాలలకు అనుమతి నిరాకరణ వంటివి తక్కువైనవేమి కావు. అప్పట్లో చాదస్తం అనుకున్నారేమో గాని ఇప్పుడు భాగానే అర్థమై ఉంటుంది ఆయన ఎంత దీర్ఘాలోచన చేసారో. తొలి సారి సి.ఎం అయ్యి బాస్కర్ రావు దెబ్బకి మళ్ళీ ఎన్నికలకు పోయాక (అనుకుంటా) ఎన్.జి.ఓలతో యవ్వారం వచ్చింది. అప్పుడు ఎన్.టి.ఆర్ గైకొన్న కఠిన వైఖరిని కిరణ్ వంటి వారు కలలో కూడ కనీశం ఉహించుకోవడం కూడ కల్లే. కాని ఇది ఎన్.టి.ఆర్ పరిపాలనకు -పథకాల అమలుకు -అభివృద్దికి పెద్ద ఆటంకమై ఉన్న మాట వాస్తవం.

ఇక వై.ఎస్.ఆర్ కథకొస్తే..

ఉచిత విద్యుత్ అమలు చేసారు.ఇది ఓకే.అయితే ఇది తాత్కాలిక పరిష్కారమే.అయినా "విశ్వసనీయత" నేపథ్యంలో ఇది అవసరమే.కాదనను. దీనికి తోడు జలయజ్నం చేపట్టారు. ఇది శాస్వత పరిష్కారం. కాదనను.కాని ఉచిత విద్యుత్ ఏ ఉద్దేశంతోనైతే అమలు చేయబడిందో జలయజ్నానిదీ అదే ఉద్దేశం. దీంతో డబుల్ అకౌంట్ అయి కూర్చుంది.

ఎన్.టి.ఆర్ ప్రభుత్వోధ్యుగులతో కయ్యానికి దిగి కార్యం చెడిపితే వై.ఎస్. వారి పై మితిమీరిన విశ్వాసం ఉంచి /పొగడ్తల్లో ముంచి కార్యం చెడుపుకున్నారు. క్లాస్ వస్తుందనుకున్న ఎన్నికల్లో జస్ట్ పాస్ మాత్రమే మిగిలింది. తన తప్పు తెలుసుకుని రచ్చబండ కార్యక్రమం మొదలు పెట్టాలకున్నా కాలం కలిసి రాక అర్దాంత్రంగా పోయారు.

జలయజ్నం చేపట్టక పోయినా రైతులుగాని ,ప్రజలు కాని పెద్దగా పట్టించుకునేవారు కాదేమో. ఓకె. మొండి అమలు చేసి తీరాలన్న సంకల్పం ఉన్నా దానిని లోపాయకారిగా ప్రభుత్వ బడ్జెట్ పై భారం పడనీయకనే కూడ అమలు చేసి ఉండొచ్చు.గ్లోబల్ టెండర్లు పిలిచి BOT (Build -Operate -Transfer) పద్దతిలో బహుళ జాతి కంపెనీలచే నిర్మింప చేసి ఉండొచ్చు.

ఇక సంక్షేమ పథకాల కథకొస్తే అర్హులను గుర్తించడం - లబ్దిదారులను ఎంపిక చెయ్యడం -వారికి లబ్దీ చేకూర్చడంలో తుప్పు పట్టిన యంత్రాంగాన్నే వాడాల్సి వచ్చింది. దాంతోనే జస్ట్ పాస్ కావల్సి వచ్చింది. దీనిని ముందుగా పసిగట్టి
స.పథకాల అమలు కోసం ఒక కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి జిల్లా స్థాయి ఉన్నతాధికారి పర్యవేక్షణలో అది పని చేసేట్లు చేసి ఉంటే ఈ వైఫ్లయం తప్పేది. దీని కోసం కొత్త మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసి ఉన్నా ఈ తిప్పలు తప్పేవి.

ఆరోగ్య శ్రీ అంటారా? నిదులు చాల్లేదుగాని సాగు నీటి సమస్యకు చేసినట్టే తాత్కాలిక పరిష్క్తారంగా ఆరోగ్య శ్రీ ,శాస్వత పరిష్క్రారంగా ప్రభుత్వ ఆసుపత్రుల మెరుగుకు ప్రణాళిక సిద్దం చేసి ఉండేవాడు.రోగాలు వచ్చాక చికిత్స కోసం లక్షలు పెట్టడం మానవత్వమే అయినా సతరు రోగాలకు గల కారణాలను రూపు మాపే పనిని పనిలో పనిగా చేపట్టి ఉండవలసింది. ఉ: దగ్గర భంధుత్వంలో వివాహాలు -పారిశుద్యం -రక్షిత మంచి నీరు

ఫీజు రీ ఎంబర్స్ మెంట్ విషయంలో జరిగిన పొరభాటు ఏమంటే పేదవాడు చదువుకోవలసిందే.కాని ఎటువంటి చదువు? అతనిని స్వంత కాళ్ళ పై నిలపెట్ట కలిగే చదువులు చదవాలి. అదీ ఇక్కడే అతనికి ఉధ్యోగవకాశం కల్పించే విద్య అయ్యుండాలి.

చదువా పనికి మాలిన చదువు. పొరభాటుగా చదివి భాగుపడినా విదేశాలకు తుర్రుమంటారు. ఈ నేపథ్యంలో ఫీజు రీ ఎంబర్స్ మెంట్ క్రిమినల్ వేస్ట్.

దీనిని కేవలం స్వదేశీ పున: నిర్మాణానికి , స్వదేశి ఉత్పాదకతకు పనికొచ్చే విద్యలకు మాత్రం వర్తింప చేసి ఉండాల్సింది. తిరుమలలో ఉచిత లడ్డులా కాక కాసింత ప్రాక్టికాలిటితో అమలు చేసి ఉండొచ్చు.

ఉదాహరణకు:
లబ్ది దారులు అద్యయనం చేయవలసిన విద్యలను నిర్దేశించడం
నేచర్ క్యూర్ - హెర్బల్ క్యూర్ -హోమియో - సాంప్రదాయేతర విద్యుత్ -మైక్రో ఇర్రిగేషన్ - అగ్రికల్చర్

అలాగే పేద కుటుంభంలో పుట్టి, స్వంత ఇల్లు లేని , తల్లి తండ్రుల్లేని అనాధ అయిన ఎస్.టిలకు తొలి ప్రాధన్యం - తండ్రిని కోల్పోయిన వారికి సెకండ్ ప్రిఫెరెన్స్, ఇలా ప్రియారిటి ఇవ్వాల్సింది. నిభంధనలు లేకపోవడం చేత ఇది అపాత్ర దానం అయ్యింది. నిజంగానే అవసరం ఉన్నవారికి సైతమ్ అందే అవకాశం లేక పోయింది.

ఇప్పటికి ఇది చాలు. ఇంకో సందర్భంలో కొనసాగిస్తా..

గమనిక: స్వంత సైట్ ఏర్పాటు కారణంగా దాని రెపుటేషన్ పెంచాలన్న ఉత్సుకతతో తెలుగులో వ్రాయడం తగ్గించేసాను.సారి ఏమనుకోకండి. వీలున్నప్పుడు ఈ నా సైటును తిలకించండి. (తెలుగు కంటెంట్స్ కూడ పెట్టాలని ఉద్దేశించి -ప్రరంభం కూడ చేసానండి.

http://www.anubavajothidam.com

1 comment:

  1. sir... aarogyasree, jalayagnaannni tappu pattakandi.... lopaalu leni pani antoo undadu... chetakaani congress govt jalayagnam coplete cheyalakpotondi kaani...ysr undi unte polavaram, pranahita chevella projects katti haritandhrapradesh ante ento niroopinchevaadu...

    ReplyDelete