క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Sunday, 1 May 2011

త్వరలో మరో ప్రపంచ యుద్దం?

ఈ టపా  జ్యోతిష్య రీత్యా వ్రాయనడింది కాదు. జరుగుతున్న కొన్ని సంఘఠనలు -వాటి నేపథ్యాలను అనుసరించి ఈ టపా వ్రాస్తున్నాను.

ఇటీవల భారత దేశంలోని అమెరికా ధూత రాజినామా చేసారు. ఏవొ విమానాల కొనుగోలు కాంట్రాక్టును భారత్ రద్దు చేసిందన్న విషయాన్ని తెర పైకితెస్తున్నాయి మీడియాలు.

కాని ఈ రాజినామా వెనుక పెద్ద కథే ఉంది.  అమెరికా స్వయంగా బాధిత దేశం కావడంతో తీవ్రవాదం పై ఎంత "పక్కాగా"ఉందో అందరికి తెలిసిందే. పాక్ గూడచారి సంస్థ ఐ.ఎస్.ఐ కి -లష్కరే తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలకి తేడా ఏమీ లేదు అన్నది అమెరికా భావం.

ముంబై తాజ్ హోటల్ సంఘఠన అనంతరం భారత్ పాక్ తో చర్చలు -చకోడీలు వంటివాటికి వీట్కోలు చెప్పి చాలా కాలమైంది.

ఇదిలా ఉంటే మన దేశం తరపున కొందరు పెద్ద మనుషులు పాక్ దేశపు పెద్ద మనుషులతొ చర్చలు జరిపినట్టు సమాచారం. పైగా ఆ చర్చల్లో ఐ.ఎస్.ఐ తరపు ప్రతినిది కూడ పాల్గొన్నట్టు కొన్ని మీడియాల్లో గుప్పుమంది. ఈ చర్చల ఫలితంగానే పాక్ ప్రెసిడెంట్ మన దేశమొచ్చి క్రికెట్ మ్యేచ్ తిలకించి వెళ్ళారని సతరు మీడియాలు బల్ల గుద్ది చెబుతున్నాయి.

వన్ ప్లస్ వన్ అని లెక్క కడితే ..అమెరికా ప్రపంచ దేశాల్లో దౌత్య కార్యాలయాలు ఏర్పాటు చేసేది - ధూతలను నియమింప చేసేది ధత్య కార్య కలాపాలు సాగించడానికి కాదు. నిజానికి అవి గూడచారి సంస్థలే. సతరు ధూతలు కూద గూడచారులే.

తామున్న దేశంలో అమెరికా "సిద్దాంతాలకు" వ్యతిరేకంగా జరిగే పరిణామాలను ముందుగా పసికట్టి వైట్ హౌజ్ కి తెలపడమే వారి విధి. కాని ప్రస్తుతం వారి ధూత కాస్త నిద్రపోయిన తరుణంలో మనవారు లోకల్ కాంప్లికేషన్స్ నుండి ( స్కేమ్స్) మీడియా దృష్థి మళ్ళించటానికి చేసిన అతి చేష్ఠతో చిర్రెత్తి ధూతను రాజినామా చేయించి ఉండవచ్చన్నది నా ఊహ.

ఇది ఇలా ఉంటే శ్రీలంక అధ్యక్షునిపై యుద్ద నేరాల ఉచ్చు భిగుసుకుంటుంది. కాంగ్రెస్ పార్టితో పొత్తు కారణంగ లంక తమిళుల పై చూసి చూడనట్టున్న కరుణానిధికి లంక తమిళుల పై ప్రేమ కొత్తగా కట్టలు తెంచుకుంటూంది. కరుణకు రాజకీయం చేసుకునే అవకాశమే లేకుండా చెయ్యాలన్న ఉద్దేశంతో జయలలిత రాజపక్షేను అరెస్ట్ చెయ్యాలన్న రేంజిలో ప్రకటనలు గుప్పిస్తూంది.

ఈ వత్తిడితో కేంద్రం "ఏమన్నా" చేసి తీరాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. కాని చైనా హోం మంత్రి మాత్రం "శ్రీలంక విషయంలో ప్రపంచ దేశాలు జోక్యం చేసుకొన రాదని సూచించి ఉండటం గమనార్హం.

అటు అమెరికాని కాదని -ఇటు చైనాని కాదని కేంద్రం ఏమీ పొడవక పోవచ్చు. కాని లోకల్ తలనెప్పులనుండి తప్పించుకోవడానికి గిలానిని క్రికెట్ మ్యేచ్ కి ఆహ్వాణించినట్టు రాజపక్షే పై కాలు దువ్వితే మాత్రం అది చిలికి చిలికి మూడో ప్రపంచ యుద్దానికి దారి తీయడం ఖాయం

1 comment:

  1. astrological combinations that supports ur views are-frm may-3rd bth mars/saturn in 6-8 positions

    ReplyDelete