అన్ని ఉంది అల్లుడి నోట శని ఉందన్నట్టుగా పిసిసిగా పదవీ స్వీకారం చేసిన లగ్నానికి రెండున శని ఉన్నాడు. ఈయన సింహ లగ్నానికి రోగాధిపతి కూడాను. తద్వార తన మాటలతోనే వొరోధాలను కొని తెచ్చుకుంటారు. పైగా శనితొ వ్యయాధిపతి అయిన చంద్రుడు కలిసాడు.దింతో బొత్సా మాటలు నిరుపయోగమవుతాయి. మాటలతోనే సంభంధాలు బెడిసి కొడతాయి.
శని చంద్రుల కలయక బెదిరింపులకు ఉసికొలుపుతాయి. అది కాస్త ఓవరైతే చాప్టర్ ఓవర్. నాలుగున రాహు ఉన్నాడు. రాహు అంటే కుట్రలు - మైనారిటీలు. బొత్సా అమాయకంగా ఒక కుట్రకు బలై పార్టీలోని మైనారిటీలకు దూరమయ్యే అవకాశం కూడ ఉంది.
భాగ్యమున ఉన్న గురు -కుజ కలయక అదిష్ఠానంతో సత్సంభంధాలు ఇస్తుంది. కాదనను. కాని గురువుకు అష్ఠమాధిపత్యం కూడ ఉంది కాబట్టి అదిష్ఠానంలో ఎవరైతే బొత్సాను ప్రమోట్ చేసారో వారే రివర్స్ అవ్వడం కూడ జరుగవచ్చు.
పదిన రవి బుధులు ఓకే. కాని అక్కడ శుక్ర కేతువుల కలయక కూడ ఉంది.దీంతో ఒక స్త్ర్రీవలన చిక్కుల్లో పడొచ్చు. కేతు అకారణమైన అపోహలు, త్రిప్పుట,అలసటలను ఇవ్వొచ్చు.
6 సం-3 నెలల 27 రోజుల దాక కుజ దశ జరుగుతుంది. కుజుడు భాగ్యమున స్వక్షేత్రమున ఉన్నందున ఈ పీరియడ్ అనుకూలించాలి. కాదను. కాని భాగ్యం ( 9) దూర ప్రయాణాలను కూడ సూచిస్తుంది. కావున రోడ్డు ప్రమాదం జరుగ వచ్చు. భాగ్యమన్నది అస్తులను కూడ సూచిస్తుంది. కాబట్టి ఆస్తి పై వివాదం తలెత్తొచ్చు. లేదా ఆస్తులు కరిగి పోవచ్చు.
21/Mar/2012 దాక కుజ దశలో రాహు భుక్తి జరుగుతుంది. కాబట్టి కుట్రలను ఎదుర్కోవడానికే -కొన్ని సార్లు బలి కావడానికే ఈ కాలం పరిమితమయ్యే అవకాశం ఉంది. ఈ లోపే పదవీచ్యుతులైతే చెప్పలేం గాని 21/Mar/2012 తరువాతైతే బెటర్ గానే ఉంటుంది.
ఈ పోస్టు కామెడియా, సీరియస్సా?
ReplyDelete