క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday 7 April 2012

తిరుపతి బై పోలుతో " గల్లా " గల్లా పెట్టె ఖాళి

చిరంజీవి ఎంతటి అసమర్థుడో ఏమాత్రం తెలియని ఆ రోజుల్లోనే కరుణాకర్ రెడ్డి చిరంజీవి టైట్ ఫైట్ ఇవ్వగలిగాడు.

మరి ఈ రోజు చిరంజీవి హీరో కాదని పెద్ద జీరో అని తెలిసిపోయి - స్థానికేతర ప్రముఖుడ్ని ఎన్నుకోవడంలో ఉన్న ప్రమాదం ఏమిటో తెలిసొచ్చాక తిరుపతి జనం చిరంజీవినే కాదు అతన్ని పార్టిలో చేర్చుకున్న కాంగ్రెసును సైతం చీదరించుకునే పరిస్థితి ఉంది.

ఆ రోజు ఉన్న కాంగ్రెస్ వేరు. ఈ రోజున్న కాంగ్రెస్ వేరు. కాంగ్రెస్ పార్టి ఒక పెద్ద ఉసిరికాయల బస్తా. దానిని వై.ఎస్ అన్న తాడు భిగించి ఉండటంతోనే ఆ టైట్ ఫైట్ సాధ్యమైంది.

ఈ రోజు వై.ఎస్.లేరు. అతని అభివృద్ది,సంక్షేమ పథకాలన్ని హుష్ కాకీ అయిపోయాయి. పైగా అతని పైనే బురద చల్లుడు కార్యక్రమం - ఆపై వై.ఎస్.కు అసలు సిసలైన వారసులం మేమేనన్న సోది ఒకటి.

రోశయ్య సి.ఎం గా ఉన్న రోజుల్లోనైతే ఏదో పెద్దాయన అనే కనీశ గౌరమన్నా ఉండేది. మరి నేటి సి.ఎం కిరణ్ చిల్లర మల్లర చేష్ఠలు వై.ఎస్. అభిమానులనే కాదు ,కాంగ్రెస్ వారిని సైతం చిర్రెత్తిస్తున్నాయి. ( వైఎస్ కు తనే సలహాలిచ్చేవాడ్ని - జగన్ సి.బి.ఐ కేసు నన్ను చూడమన్నారు వగైరా టంబాలు)

పెద్దరికం లేకున్నా కనీశం పది మందిని కలుపుకు పోయే తత్వం లేదు ( ఇతని ఫేమస్ డవులాగు "ఐ నో"

ఆ రోజు పి.సి.సిగా ఉన్న డి.ఎస్ కు స్వంత పలుకు బడి లేకున్నా కనీశం వై.ఎస్. దూకుడుకి అడ్డు పడకుండా నెట్టుకొచ్చే వాడు.

ఈ రోజు బొత్సా దూకుడు నెగటివ్ అయ్యే ప్రమాదం ఉన్న మాట అటుంచితే కిరణ్ బొత్సా ఎక్కడ తనను ఓవర్ టేక్ చేస్తాడేమోనని వనికి చస్తున్న పరిస్థితి.

ఆ రోజు అదిష్ఠానం ఒక్క వై.ఎస్. పై విశ్వాసం ఉంచి పక్కకు తప్పుకుంది.ఇప్పుడేమో ఇక్కడి వారి పై నమ్మకం లేక "పెత్తనం చెలాయించాలని" చూస్తూంది.

ఇక దిల్లీ అదిష్ఠానం అంటారా ఆనాడున్న యుపిఏ సర్కార్ వేరు ( పుష్కల మెజారిటి ) ఈరోజున్న సర్కారు వేరు.

యుపిఏలోని పార్టీలన్ని సోనియా పై పెత్తనం చెలాయించాలని చూసే రోజులొచ్చాయి. ఈ పరిస్థితిలో ఒక్క తిరుపతే కాదు ఏ నియోజక వర్గంలోనైనా సరే త్వరిత గతిన నిర్ణయాలు తీసుకునే అవకాశం - ఒక్క చేతితో పోరాడే ఆత్మ విశ్వాసం - భాధ్యత వహించే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు.

గెలుపోటముల భాధ్యతను జిల్లా ఎం.ఎల్.ఏలు సైతం వహించాలట. కాంగ్రెస్ పార్టి పరిస్థితి ఇలా ఏడుస్తుంటే మంత్రి వర్యులు గల్లా అరుణ కుమారి ఏమో తన బిడ్డ రాజకీయ అరంగేట్రం కొరకు ఉవ్విళ్ళీరుతుంది.

వారు చెప్పే మరో మాట నవ్వు తెప్ప్సిస్తూంది. వారి సంస్థల్లో పని చేసే ఉధ్యోగులు ఏడు వేల మంది ఉన్నారట.వారి కుటుంభ సభ్యులు , వారి భంధువులంతా గల్లా పుత్ర రత్నానికే ఓటేస్తారట.

అమర రాజా బ్యేటరీస్ లో పని చేసిన ఒక మిత్రుడు చెప్పిన విషయాలు నాకు ఇంకా గుర్తున్నాయి. యాజమాణ్య వేదింపులతో ఆ ఏడు వేలమంది మరో నలుగురికి చెప్పి వ్యతిరేకంగా ఓటెయ్యిస్తే చాలు కొంప కొల్లేరే.

ఇదీ కాక కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఉందట. అవీ తన సుపుతృనికే వస్తాయని కలకంటూంది మంత్రి. అయ్యో పాపం.

ఈ రోజు వై.ఎస్ లేని కాంగ్రెస్ పరిస్థితి వెంకటేశ్వర స్వామి లేని తిరుపతిలా ఏడుస్తూంది. ఇక ఓటు ఎక్కడ? బ్యాంకు ఎక్కడ.

ఒకటి మాత్రం ఖాయం పొరభాటునో గ్రహపాటునో గల్లా పుత్ర రత్నానికి కాంగ్రెస్ సీటు వచ్చి పోటి చేస్తే మాత్రం వారి భూ ఆక్రమణలు,కార్మిక వ్యతిరేక కార్యకలాపాలకు జనం సరైన భుద్ది చెబుతారు. గల్లా గల్లా పెట్టెకు చిల్లు మాత్రం గ్యారంటి

ఆ రోజు రాష్ఠ్ర్రంలోని యావత్తు నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. తిరుపతి పై ఇంకాస్త దృష్థి పెట్టే వీలు వై.ఎస్. కు లేక పోయే.

మరి ఈ రోజు జగన్ దృష్ఠి పెట్టవలసింది కేవలం 17 ఎం.ఎల్.ఏ మరియు 1 ఎం.పి నియోజకవర్గాల పైనే.

0 comments:

Post a Comment