క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Tuesday 10 April 2012

ఉప పోరులో కాంగ్రెస్ పని గో..విందా ..ఎందుకంటే !



1.రాష్ఠ్ర్ర కాంగ్రెస్ భాధ్యతలు రాహుల్ కి అప్పగిస్తారట - యువరాజుగారి లెగ్ ఎటువంటిదో వేరే చెప్పక్కర్లేదు.

2.జగన్ అవినీతి పరుడంటే సరిపోదు-వై.ఎస్ పై కూడ బురద చల్లాలని ప్రతిపాదించడం -దీనిని అమలు చేసినా చేయకున్నా కాస్తో కూస్తో కకృత్తి పడి కాంగ్రెసులో కొనసాగుతున్న వై.ఎస్.అభిమానుల్లో ఆలోచన మొదలై పోయింది. వీరు తమ వంతు కర్తవ్యాన్ని ఖచ్చితంగా నిర్వహిస్తారు.

3.వై.ఎస్ పై వీరు/ తేదేపా చేస్తున్న ఆరోపణ ఒక్కటే ప్రభుత్వ భూములను స్వల్ప దరకు కట్ట పెట్టారన్నది. ఆ రోజు చంద్రబాబు విదేశీ సంస్థలకు భూములను ఉచితంగా కట్ట పెట్టగా లేనిది వై.ఎస్. స్వదేశీ సంస్థలకు - మరీ మన రాష్ఠ్ర్రంలోని సంస్థలకు విక్రయిస్తే తప్పేమిటని ఓటర్లు ప్రశ్నిస్తారు.

4.ఇక వై.ఎస్ ప్రభుత్వం ద్వారా లబ్ది పొందినవారు జగన్ సంస్థల్లో పెట్టుపడి పెట్టారు అంటూ గొతు చించుకుంటున్నారు. జగన్ కంపెనీలు పెట్టుబడిగా స్వీకరించిన ప్రతి పైసా చెక్ -డిడిలుగానే స్వీకరించబడ్డాయి. వాటిని ఇచ్చినవారు/ పంపినవారు ( పెట్టుబడి పెట్టినవారు) ఎటువంటి వారో ఎందుకు పెట్టుబడి పెడుతున్నారో జగన్ తెలుసుకోవలసిన అవసరం లేదు. ఒకవేళ మార్గర్శి చిట్ ఫండ్ వారిలా ఉధ్యోగస్తుల పేరిట బోగస్ డిడిలు తీసి ఉంటే భయపడాలి కాని.. ఈ వాదన తుస్సుమంటుంది.

5.ఎన్.టి.ఆర్ అనంతరం ప్రజలనుండి ఏకంగా పూజలందుకుంటున్న ఏకైక నాయకుడు వై.ఎస్.ఆర్. వీరు మోపే నీలాపనిందలు పేద ప్రజలకు అనవసరం.వారి గుండెల్లో కొలువున్న వై.ఎస్ యశో రూపం చెక్కు చెదరకుండా ఉంది.

6.పొరభాటుగా కాంగ్రెస్ వారు వై.ఎస్ పథకాలను కొనసాగిస్తూ -వాటికి మరింత పదును పెట్టి -ఖచ్చితంగా అమలయ్యేలా చేసి -ఇంకా ఇంకా ప్రజా రంజక పథకాలను తెచ్చి ఉంటే వై.ఎస్ ఇమేజ్ మరీ ఇంతగా పెరిగేది కాదు.వై.ఎస్ కు నేడున్న ఇమేజ్ కి పరోక్షంగా రోశయ్య/కిరణ్ కుమార్ రెడ్డీలు కూడ ఒక కారణమే.

7.జగన్ కోట్లు కుమ్మరించాడని తూలలాడుతున్నారు. లక్షల్లో వ్యాపారం చేసుకునే వారు సైతం జరిగే అన్యాయాలకు -అక్రమాలకు స్పందించకుండా మనకెందుకులే అని ఎవరి బతుకు వారు బతుకుతుంటే జగన్ దాదాపు ఆత్మాహుతి దళంలా కాంగ్రెసుతో డీ అంటే డీ అంటూ కలపడడం చూసి - తమతో అనునిత్యం మమేకమయ్యే జగన్ ఒరవడి చూసి కాంగ్రెస్ -తేదేపా ఆరోపణలన్ని అవాస్తవమని నిర్ధారించుకుంటున్నారు.

8.వై.ఎస్.మరణానంతరం మాయమాటలు చెప్పి డెప్యూటి సి.ఎం వంటి అలంకార ప్రాయ పదవినిచ్చి జగన్ను భుట్టలో వేసుకుని సమయం చూసి రోడ్డున పడేసి ఉంటే బెంబేలెత్తి పోయేవాడేమో? కాని వై.ఎస్. పయణించిన హెలికాప్టరును వెతికే క్రమంలోనే ప్రభుత్వం/ పార్టి పెద్దలు /డిల్లీ పెద్దల చిత్త శుద్ది ఎటువంటిదో జగన్ కు అర్థమై పోయింది. ఆ క్షణం నుండే జగన్ "మోల్డ్" అవ్వ్వడం ప్రారంభించేరు. ఒక జీవిత కాలానికి సరిపడే "గుణ పాఠాన్ని" అందరు కలిసి జగన్ కు భోధించేసేరు.
నేడున్న జగన్ నాటి ఎన్.టి.ఆర్ కన్నా మొన్నటి వై.ఎస్.ఆర్ కన్నా మొండిగా -జగ మొండిగా తయారైపోయేరు (కాంగ్రెస్ వారి పుణ్యమా అని) ఇక జగన్ను ఎదుర్కోవాలంటే ఒక ఎన్.టి.ఆరో - ఒక వై.ఎస్సారో బతికి రావల్సిందే

9.వై.ఎస్ మరణానంతర పరిణామాలన్ని కాంగ్రెస్ పార్టిని ప్రజలు చీదరించుకునేలా చేసేసాయి.
ప్రజలనుండి హా హా కారాలు మొదలై పోయాయి.ఈ దుస్థితినుండి తమను గట్టెక్కించే సత్తా గల ఏకైక నాయకుడు జగనేనని ప్రజలు విశ్వసిస్తున్నారు. (రేపు జగన్ సి.ఎం అయ్యాక -ఏమి చెయ్యలేకుంటే ఈ విశ్వాసం విరిగిపోవచ్చు అది వేరే కథ) .

10.అన్నింటికన్నా అటు కాంగ్రెస్ -ఇటు తె.దే.పా జగన్ను టార్గెట్ చేసుకోవడం - ఓటమి భయంతో రోజుకో వ్యూహం రచించడం చూస్తుంటే వీరే జగన్ను గెలిపించేస్తారనిపిస్తూంది.

అందుకే గంటా పదంగా చెబుతున్నా ఉప పోరులో కాంగ్రెస్ పని గో..విందా గోవిందా..

0 comments:

Post a Comment