క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Wednesday 18 April 2012

జగన్ పై వీరికి ఎందుకింత కక్ష?



తమిళ బ్లాగ్లోకంలో సీరియళ్ళు వ్రాసి సంచలనం సృష్ఠించిన నేను తెలుగులో మొదలు పెట్టిన మొదటి సీరియల్ ఇది. జగన్ ఫేస్ బుక్కులో ప్రవేశించాక టాప్ ఫ్యాన్స్ లిస్టులో నేను 44 వ ఫ్యాన్ గా నిలిచిన శుభసందర్భంలో ఈ సీరియల్ మొదలు పెట్టాను.



ఖబడ్దార్:

బ్లాగ్లోకంలోని వై.ఎస్.ఆర్, వై.ఎస్ జగన్ అభిమానులు ఇప్పటికే జగన్ అఫిషియల్ ఫేస్ బుక్లోకి దుకేసుంటారు. పొరభాటుగా ఇంకా దూకని వారు ఇక్కడ నొక్కి దూకెయ్యండి.

ఈ రోజు జగ్న్ పై కక్ష పెంచుకున్న వారిలో అగ్రజుడు రామోజి మరియు ఈనాడు గురించి విశ్లేషిస్తాను.

నేను యాంటి కాంగ్రెస్ వాదినని అఫిడవిట్లోనే పేర్కొన్న రామోజి రావు నేడు కాంగ్రెస్ భజన చేస్తున్నారంటే అందుకు ఏకైక కారణం జగన్ పై కక్ష. మరి జగన్ పై రామోజికి ఎందుకింత కక్ష?

తొలూత కుల పిచ్చితో ఎన్.టి.ఆర్ని ప్రమోట్ చేసిన రామోజి ఆయనచే లబ్ది పొందాలని చూడడం .మొండి ఘటమైన ఎన్.టి.ఆర్ అందుకు నిరాకరించడం. ఎన్నికలయ్యాక ఎన్.టి.ఆర్ని ఆడి పోసుకోవడం రామోజికి పరిపాటి.

కాని ఎన్.టి.ఆర్ రాజకీయ ప్రవేశం - ఘన విజయంతో ప్రజల్లో ఏర్పడ్డ రాజకీయ చైతన్యంతో పత్రికలు చదివే అలవాటు గణనీయంగా పెరిగింది. దీంతో ఈనాడు ఏక చత్రాథిపత్యంతో వెలిగి పోయింది. ఇలా ఎన్.టి.ఆర్ ఈనాడు అభివృద్దికి పరోక్షంగా తోట్పడ్డారు.

రామోజి ఎన్ని వ్యాపారాలు చేసినా వాటన్నింటికి పునాది ఈనాడే. ఈనాడుకు పోటి ఉండ కూడదన్నది ఆయిన ప్రప్రథమ ద్యేయం. పోటీ అంటూ వస్తే ఎంతటి నీచానికైనా దిగ జారుతారు. పోటి పత్రికను భుగ్గిపాలు చేస్తారు.

ఉదయం దినపత్రిక పతనం రామోజి ఘనకార్యాల్లో ఒకటే. ఒక దశలో ఆంథ్రజ్యోతి మూతపడటానికి సైతం రామోజి కుట్రలే కారణం.

ఆంథ్రజ్యోతి పున: ప్రారంభం తరువాత వైర్యం పెంచుకుని "విలువలకే" కట్టు బడ్డ ఈనాడు ఈరోజు ఆంథ్రజ్యోతితో జతకట్టి "విలువలను" తుంగలో తొక్కి యుగళగీతం పాడుతున్నారంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. వారికిది జీవన్మరణ సమస్యగా మారింది.

మద్య కాలంలో "వార్త" దిన పత్రిక ఎందుకు పుట్టిందో కూడ చెప్పగలను. (కాని వార్త అంతగా రాణించకపోవడం తో రామోజి శాంతించేసారు కాబట్టి ఇంకో సందర్భంలో ఈ సంగతి చెబుతాను)

1994 ఎన్నికల్లో ఎన్.టి.ఆర్ విజయానంతరం ఎన్.టి.ఆర్ ద్వారా లబ్ది పొంద చూసి అది కుదరక పోవడంతో లక్ష్మి పార్వతిని సాకుగా చూపి చంద్రబాబుకు వంత పాడి ఎన్.టి.ఆర్ని హత్య చేసిన ఘనత రామోజిదే.

తాను ఆడిందే ఆట పాడిందే పాట అంటూ రాజ్యమేలిన రామోజికి వై.ఎస్ చెక్ పెట్టారు. ఆ రోజు ఉండవల్లి ఎక్కు పెట్టిన భాణం రామోజి కంటిలో నలుసైతే జగన్ ప్రారంభించిన "సాక్షి" కొరకరాని కొయ్యగా తయారైంది. తన "దయ"లేనిదే ఎవ్వరూ విజయం సాధించలేరన్నది రామోజి భ్రమ.

సాక్షి రాకకు పూర్వం ఈ భ్రమలో కొంత సత్యమూ ఉండేది.కాని 2009 ఎన్నికల్లో వై.ఎస్. చేసిన ఒంటరి పోరాటం రామోజి ఆశల పై నీళ్ళు చల్లింది.

ఒక పక్క చూస్తే ఆర్థికంగా మునిగి పోతున్న ఈనాడు సంస్థలు -మరో పక్క చూస్తే ఎన్.టి.ఆర్ని మించిన మొండి ఘటంగా వై.ఎస్.ఆర్ .మరో పక్క చూస్తే జగన్ కాంగ్రెస్ చేతికందించిన పాశుపతాస్త్ర్రంగా సాక్షి.

బ్యాలన్స్ తప్పిన రామోజి రిలయన్స్ వారితో చేతులు కలిపారు. ( కేవలం వ్యాపారపరంగా మాత్రమే అంటే దానిని ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు) వై.ఎస్. మనకు లేకుండా పోయారు.

రామోజి రావులో మళ్ళీ ఆశలు రేకెత్తాయి. కాని జగన్ తెలుగు ఆత్మగౌరవం నినాదంతో పార్టి పెట్టడం - కడప -కోవూరు ఎన్నికల్లో సత్తా చాటడం రామోజి నడ్డి విరిచాయి.

దీంతో తాను ఏదైతే జరగాలని కోరుకుంటున్నారో ఆ విషయాలను తన పత్రికలో వ్రాయించి "సంత్రుప్తి"చెందే స్థాయికి వచ్చేసారు.

ఒక పత్రికను నడపడం అంత సుళువైన పనేం కాదు. మరీ ఈనాడు వంటి డైనోజరును - నష్ఠాల్లో కూరుకు పోయిన పత్రికని నడపడం మరీ చిక్కులతో కూడిన పని,

తన ప్రింటింగ్ ప్రెస్లో పడే పేపర్ స్క్ర్రాబును సైతం కుదవ పెట్టి లోను తీసుకున్నాక కుదవ పెట్టేందుకు ఏమి లేని స్థితిలో పత్రికా ధర్మాన్నే కుదవ పెట్టేసారు రామోజి.

జగన్ ప్రస్తానం కొనసాగితే రామోజి జగన్ ధండయాత్రకు అడ్డు కట్ట వెయ్యలేక పోతే అటు ప్రభుత్వం -ఇటు తెలుగు దేశం పార్టి ఈనాడును పోషించటానికి ముందుకు రావు. ఈనాడు మూతపడాల్సిందే.

అందుకే రామోజికి జగన్ పై ఇంతటి కక్ష..

7 comments:

  1. అబ్బ కొడుకు లాఘవంగా రాష్ట్రాన్ని దొబ్బి తిన్నందుకే కక్ష్య.

    ReplyDelete
    Replies
    1. బాబు రాత్రి పూట రిక్షా తొక్కి డబ్బు సంపాదించి పార్టీ నడుపుతున్నాడు . మిగిలిన వారంతా రాష్ట్రాన్ని దోచి పార్టీ లు నడుపుతున్నారు

      Delete
    2. అయ్యుండవచ్చు. ఇక్కడ లేవనెత్తిన ప్రశ్నకు అది అప్రస్తుతం. గడ్డితినడంలో చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలా?

      Delete
  2. రామోజీరావు తప్పులు లాఘవంగా యెన్నగలిగే, కనిపెట్టగలిగే, తలకట్టగలిగే నైపుణ్యం ఉన్న యీ సాంబార్ స్వామికి వై.యస్. & కంపెనీ నిలివు దోపిడీ మాత్రం కంటికి ఆనలేదంటే దానికి కారణం యేమిటబ్బా?

    ReplyDelete
  3. అన్నా !
    నీస్తాయి పైకెకబాకాలని కోరుకుంటూన్నాం . ఇలా దిగజార్చుకుంటూన్నావెందుకు రాజకీయపక్షులకోసం

    ReplyDelete