క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday 21 April 2012

వై.ఎస్.పై ఈనాడులో రానున్న సంచలన కథనం



ఈ నాడు పత్రికలో వై.ఎస్. పై వస్తున్న కథనాల పరంపరను రెండ్రోజులు చదవడంతో తలతిరిగింది. కళ్ళు బైర్లు కమ్మాయి. అలాగే ఒక కునుకు తీసాను.

* * *
ఉదయం లేచి బస్ స్టాండుకెళ్ళి ఒక చేతిలో సాక్షి మరో చేతిలో ఈనాడు పట్టుకుని ఇంటికొచ్చాను. ఈనాడులో పతాక శీర్షిక నా కంట పడింది. అది మీకోసం ..ఇక్కడ..

* * *
భయిట పడ్డ వై.ఎస్ సరి కొత్త అవినీతి భండారం - జగన్ జాగారం

సి.బి.ఐ విచారణలో వై.ఎస్ సరికొత్త అవినీతి భండారం భయిట పడింది. ఈ సంగతి తెలిసిన ఈనాడు రంగంలోకి దూకింది. భయిట పడ్డ అవినీతి భండారం చూసి జగన్ రాత్రి అంతట నిద్ర పోలేదని పూర్తిగా జాగారం చేసారని సమాచారం. దీంతో డీలా పడ్డ జగన్ ఎక్కడ తనను ఉరి తీస్తారోనని కన్నీళ్ళు పెట్టుకున్నట్టు తెలిసింది. న్యాయ నిఫుణులను ఇంటికి పిలిపించుకుని పొద్దు పొడిచే దాక వారితో మంతనాలు జరిపినట్టు చెబుతున్నారు.

సిబిఐ వర్గాల కథనం మెరకు భయిట పడ్డ వై.ఎస్. అవినీతి వివరాలిలా ఉన్నాయి.

వై.ఎస్.బడిలో చేరడానికి పూర్వమే వై.ఎస్.అవినీతి పరుడనడానికి తిరుగులేని సాక్ష్యాధారాలు దొరికాయి. పండుగలొచ్చినప్పుడు ఇంట్లో వొండిన ఫలహారాలు,బప్పట్లను ఎడా పెడా దోచుకునేవారని తెలిసింది. దోచుకున్నదాంట్లో తన అనుచరులకు పంచి పెట్టేవాడని మా విచారణలో తేలింది.

స్కూల్ చదివే రోజుల్లో ఫలకా బలపం కూడ తెచ్చుకోడని - ఎవరు పడితే వారివద్ద లాక్కునేవాడని మా విచారణలో వెల్లడైంది.

(ఈ తరహాలో ముప్పవు పేజీ కథనం )

అసలు వై.ఎస్ ఇతరులను మానసికంగా ఎంతగానో క్షోభ పెట్టేవారని మా విచారణలో తేలింది. కుళ్ళు కుతంత్రాలతో సదా సర్వ కాలం ఏడుపు మొహం పెట్టుకొని జీవించే వారందరిని ఆత్మ హత్యలకు ప్రేరేపించాలని నిర్ణయించి హాయిగా నవ్వే వారని. ఆ నవ్వు చూసి నవ్వలేని వారు నరకయాతన అనుభవించే వారని సి.బి.ఐ విచారణలో రుడీ అయ్యింది.

దీంతో వై.ఎస్. పై క్రిమినల్ కేసులు కూడ పెట్టవచ్చని అధికారులు చెప్పారు. ఈ విషయం తెలిసిన జగన్ తను కూడ నాన్న లాగే నవ్వేవాడ్ని కదా.. నా మీద కూడ క్రిమినల్ కేసులు పెడతారా అని న్యాయ నిఫుణులతో వాకబు చేసినట్టు సమాచారం.

ఏది ఏమైనప్పటికి కొన్ని రోజుల్లో లేదా గంటల్లో జగన్ అరెస్ట్ కావడం ఉరి తీయడం జరిగి తీరుతుందని అధికార్లు చెప్పారు.

* * *
కళ్ళు తెరిచి చూసుకున్నా. వళ్ళంతా చమటతో తడిచిపోయింది.షిట్.. పవర్ కట్..అంటే ఈ కథనం -దీనిని నేను చదవడం .. అన్నీ కలలోనన్నమాట. ఇది కేవలం కలని కొట్టి పారెయ్యకండి.రామోజికి పిచ్చి ముదిరితే దీనిని తల దన్నే కథనం ఈనాడులో వెలుబడుతుంది.

5 comments:

  1. మీరు ఈనాడు పేపర్ కూడా చదువుతారా ? తన కులపోల్ల కడుపాత్రం సల్లబడటానికి రామోజీ రావు అనే ఒక ముష్టి వెదవ వెల్లబోసుకునే వాడి పైత్యం అంతా వాడి పేపర్లో ఉంటుంది. అది మిగతా వాళ్ళు సదివితే ఇటువంటి వైపరిత్యాలు కలుగుతాయి.

    ReplyDelete
    Replies
    1. Chaalaa baagaa, nijam cheppaaru.sir,ramoji mundu andhraprajalaku,andhra jaatiki kshamapana cheppalsi untundi ,endukantea ataniki minchina dopidee daarudu evaruu leru,vadi enaadu anta abhutakalpanale kadaa,nijaayitee parudea papernadapali,nijam mataladali,antea gaanee ramoji lanti dayyam vedam vallinchadamenti

      Delete
  2. బాసూ..
    రాజకీయ రణరంగంలో మనం ఏం చేస్తున్నామన్నది ఎంత ముఖ్యమో ..మన శతృవులు ఏం చేస్తున్నారని ఒక కంట కనిపెట్టడం కూడ అంతే ముఖ్యం.

    ReplyDelete
  3. ఆయన ఎన్ని రాసినా ప్రజలు నమ్మటం లేదు. అలాగే బాబు గారు కాలికి బలపం కట్టుకొని తిరిగినా ఓట్లు పడటం లేదు. ఆ వర్గం బ్రాండ్ వాల్యు అమాంతంగా పడిపోయింది. దానిని ఎంత పునరుద్దరించాలన్నా అది అయ్యేపనిగా కనపడటం లేదు.

    ReplyDelete
  4. ఒకరు మంచి చేస్తే అంతకన్నా నేను బాగా చేస్తాను అని పోటి పడవలసింది పోయి... నువ్వు ఎంత తిన్నావు నేను నీకన్నా ఎక్కువా తింత అని పోటి పడుతున్నారు... ఒకరిమీద ఒకరు బురద చల్లుకోవటంలో నే బిజీగా ఉన్నారు... ఎక్కడనో విన్నాను ఒక పంది బురద రాసుకుంటే తన పక్కన ఉన్న పందులకు అన్నిటికి రాసి ఆనంద పడుతుంది అంట.. మన రాజకియనకులు కూడా వాటిని మించి పోతున్నారు... ప్రజలను పట్టించుకొనే నాదుడే కరువు అయిపోయాడు... మనవారు ఎప్పుడు మారుతారో ఏమో...

    ReplyDelete