క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday 28 April 2012

అధ్భుత గాడిద - వదలిపోయిన రాష్ఠ్ర్రం బెడద


ఒక ఊర్లో ఒక గుడి.ఆ గుడి వద్దకు ఒక గాడిద వచ్చి చేరింది. మొదట్లో ఎవరూ దానిని పట్టించుకోలేదు. కాని ఒక రోజు ఆ ఊర్లోని ఒక కోడలు అత్తింటివారి హింస భరించలేకుండా ఇల్లొదలి పారిపోయి గుడి వద్దకు చేరింది. అక్కడున్న గాడిద ఆమెను చూసి నవ్వి "తరాలు మారినా మీ ఆడోళ్ళ తలవ్రాత మాత్రం మారలేదు ..ఇప్పటికైనా తెగించు ..అంతా శుభమే జరుగుతుంది" అంది.

దీంతో ఆమె మనస్సులో ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఇంటి దారి పట్టింది, దార్లో ఎవరో ఎలక్షన్ కోసం తరలిస్తున్న నోట కట్లల్లో కొన్ని పడి ఉండడం ఆమె కంట పడింది. ఆమె చేత డబ్బుంది అని తెలిసిన అత్త ఆమెకు దాసోహమైంది.

ఈ కథ ఆ నోట ఈ నోట ప్రాకి పోవడంతో గాడిద పెద్ద న్యూస్ మేకర్ అయిపోయింది. ఈ వార్తను టివి చానళ్ళ ద్వార చూసిన కిరణ్,చంద్ర బాబు ఎలాగన్నా ఆ గాడిదను ఒక్క సారి కలవాలని నిర్ణయించుకున్నారు. మరీ పబ్లిక్ గా కలుస్తే ఇబ్బందని.. ఒక హెలికాఫ్టర్లో ఎక్కించుకు రమ్మన్నారు. రహస్య స్థలంలో గాడిద వద్ద సలహాలు ఆశిస్సులు పొందాలని వారి ఉద్దేశం.

అధికారంలో ఉన్నవారు -అధికారం ఉన్నవారితో కుమ్మక్కైనవారికి ఇది పెద్ద కష్ఠమా? హెలికాఫ్టర్ వెళ్ళి గాడిదను ఎక్కించుకొచ్చింది. కిరణ్, చంద్రబాబు హెలికాఫ్టర్ ఎక్కారు. హెలికాఫ్టర్ రహస్య ప్ర్దదేశానికి బయలు దేరింది.

గాడిదను చూడగానే బాబు,కిరణ్లకు అర్థమై పోయింది. ఇదేదో దైవాంశమున్న గాడిద అని. స్వార్థ పూరిత కోరికలు కోరితే ఏమవుతుందో ఏమోనని ఇద్దరూ రాష్థ్ర్రం దుస్థితిని వివరించేరు.

ఈ రాష్ఠ్ర్రం బాగుపడటానికి నువ్వే తగిన ఉపాయం చెప్పాలని వేడుకున్నారు. గాడిత కుడి ఎడమ వైపు ఒక సారి చూసుకుంది. కుడికాలుతో బాబును ఎడం కాలుతో కిరణ్ ని తన్నింది.

0 comments:

Post a Comment