క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Thursday 24 May 2012

2012, మే ,25 జగన్ బతుకు బండిని ఎటు మళ్ళిస్తుంది?


ముందుగా జగన్ అభిమానులకు శుభవార్త :

ఈ రోజు జగన్ సి.బి.ఐ ఎదుట హాజరు కానున్న ఈ స్థితిలో - విచారణకంటూ పిలిపించి సి.బి.ఐ అతన్ని అరెస్ట్ చెయ్యొచ్చన్న ఈ పరిస్థితిలో - జగన్ పెట్టుకున్న తాత్కాలిక బెయిల్ పెటిషన్ను కోర్టు కొట్టివేసిన ఈ దుస్థితిలో మాకెక్కడిది శుభవార్త అని వాపోకండి.
నిజంగానే మీకో శుభవార్త చెప్పడానికే ఈ టపా. అదేమంటే జగన్ ఈ ఉప ఎన్నికల్లో నే కాదు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సైతం విజ ధుంధుభి మోగించడం ఖాయం

ఒక వ్యక్తి భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ముందుగా తెలుసుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. అందులో ఒక మార్గం గురించి ఇప్పుడు -ఇక్కడ చెబుతా.. శంఖ్యా శాస్త్రంలో చాలా మందికి తెలియని - కాని అధ్బుతంగా టాలి అయ్యేది ఒక పద్దతి ఉంది.
చాలా సింపుల్. ప్రాణ శంఖ్య లేదా స్థూల సంఖ్య లేదా నేమ్ నెంబరు కనుగొనాలి. ఇది కూడ చాలా తేలికే.
ప్రాణ శంఖ్య: వ్యక్తి పుట్టిన తేదిలోని అంకెలను కూడి ఏక సంఖ్య చేసుకుంటే అదే ప్రాణ శంఖ్య ఉ: జగన్ పుట్టిన తేది 21 దీనిని ఏక సంఖ్య చేస్తే 3 వస్తుంది.
స్థూల సంఖ్య; వ్యక్తి పుట్టిన తేది/నెల/సం లోని అంకెలను కూడి ఏక సంఖ్య చేసుకుంటే అదే ప్రాణ శంఖ్య ఉ: జగన్ పుట్టిన తేది 21/12/1972. దీనిని ఏక సంఖ్య చేస్తే 7 వస్తుంది.
నేమ్ నెంబరు: ప్రతి ఆంగ్ల అక్షరానికి ఒక విలువ ఉంటుంది. ఉ: AIJQ లకు విలువ 1 . దీని ప్రకారం పేర్లోని అక్షరాలకు వ్యాల్యూ వేసుకుని వాటిని కూడి ఏక సంఖ్య చేసుకోవాలి .జగన్ నేమ్ నెంబరు 6 వస్తుంది.
ప్రతి అంకె ఒక గ్రహాన్ని సూచిస్తుంది. ఉ. 3 గురువును , 7 కేతువును , 6 శుక్రుడ్ని సూచిస్తాయి.
సతరు వ్యక్తి యొక్క వయస్సు ఎంతో కనుగొని అతని గతాన్ని పై అంకెలతో విభజించాలి. విభజించగా వచ్చిన అంకె అతను ఎన్ని రౌండ్స్ కంప్లీట్ చేసాడో చెబుతుంది.
ఉ.జగన్ వయస్సు ప్రస్తుతం 40. దీనిని ప్రాణ సంఖ్య 3 తో భాగిస్తే 13 వస్తుంది. అంటే 13 వ రౌండ్లో ఉన్నాడన్న మాట. అంకె గ్రహాన్ని సూచిస్తుంది. రౌండ్స్ రాశిని సూచిస్తుంది. ఉన్న రాశులు 12 మాత్రమే కాబట్టి 12 రౌండ్స్ పూర్తయ్యాక మళ్ళీ మొదటి రౌండ్ ప్రారంభమవుతుందని భావింఛాలి. కారక గ్రహం గోచార విధులను పట్టి ఎన్నవ రాశిలో ఉంటే మంచిదో అన్నవ రౌండ్స్ జాతకునికి అనుకూలంగా ఉంటాయని భావించాలి.
గురు గ్రహం ,5,7,9,11 వ రాశుల్లో ఉంటే శుభం. జగన్ 39 సం. పూర్తి చేసుకోగానే రెండవ పెద్ద రౌండ్లో మొదటి రౌండ్ పూర్తయ్యి రెండో రౌండ్ మొదలైందన్న మాట. అంటే గోచారంలో గురు రెండవ రాశిలో ఉంటే ఏ ఏ ఫలితాలు జరుగుతాయో ఆ ఫలితాలన్ని ఇప్పుడు జరగాలన్న మాట. ఈ ఫలితాలు జగన్ రెండో రౌండ్ పూర్తి చేసుకునే దాక అంటే 42 సం. పూర్తి చేసుకునే దాక కొనసాగుతాయని భావం.
ఈ పద్దతి కరెక్టే అనడానికి ఏం ఆధారమని మీరడగ వచ్చు. రెండో పెద్ద రౌండ్లో మొదటి రౌండ్ జరిగినప్పుడు గురు జన్మ రాశిలో ఉంటే ఇవ్వ గల ఫ్లైతాలు జగన్ కి జరిగిందో లేదో చూద్దాం . 37 నుండి 40 వ ఏట దాక
అపనింద, అత్యాలోచన, వి.వి.ఐ.పిలతో కలహాలు, (ఇవన్ని జరిగాయి)
కాబట్టి ప్రస్తుతం రెండో రౌండ్లో ఉన్న జగన్ కి గురు రెండో రాశిలో ఉంటే జరగవలసిన ఫలితాలు జరుగుతాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం:
వాగ్దాటి పెరగడం - మాటకు విలువ -పలుకు బడి హెచ్చడం - కుటుంభంలో ఐక్యత (బాబాయి కూడ వచ్చి చేరిపోయాడుగా) - ఆర్థిక ఇబ్బందులు తొలగడం ( సాక్షి మీడియా ఖాతాల డీఫ్రీజ్) -రాజకీయంగా విజయం
సి.బి.ఐ ముందు హాజరు కావల్సిన ఈ రోజు నక్షత్రం పునర్వసు -దీనికి అధిపతి గురు - వృషభంలోని గురు కేతువుతో కలిసి ఉన్నాడు. కేతుకు సంభందించిన అంకె 7. జగన్ స్థూల సంఖ్య కూడ ఇదే. పైగా ఈ రోజు తేది 25 దీనిని సింగిల్ నెంబరు చేస్తే 7 వస్తుంది. ఇదీ అనుకూల అంశమే.
ప్రాణ సంఖ్యను పక్కన పెట్టి స్థూల సంఖ్యయగు 7 తో జగన్ వయస్సును భాగిద్దాం. 40 డివైడడ్ బై 7 అంటే 35 సం.లు పూర్తయ్యేదాక పెద్ద అనుకూలత ఉండదు ( కేతు 5 న ఉంటే జరుగ గల ఫలితాలే జరిగి ఉంటాయి)
కాని కేతు 6 న ఉంటే మంచిదే ( 6 వ రౌండు -అంటే 35 నుండి 42 వ ఏట వరకు) దీంతో పగవారిని ఓడించడం - తిరుగులేని మనిషిగా ఎదగడం-శతృ శేషం -రుణ శేషాలను పూర్తిగా పైసల్ చెయ్యడం జరుగుతాయి..
నేం నెంబరు ప్రకారం చూసినా (6) శుక్రుడు 7 వ రాశిలో ఉంటే మంచిది కాదు . అంటే 6x7=42 వ వయస్సు దాకే చెడ్డ . ( అన్నాహారాలు -నిద్ర-విశ్రాంతి లేక అల్లాడటం -ఇంటికి - భార్యకు దూరంగా ఉండాల్సి రావడం) 42 పూర్తైతే 8 వ రౌండ్ మొదలవుతుంది. శుక్రుడు 8 న ఉంటే చాలా విశేషం .కొన్ని పురాతన జ్యోతిష గ్రంథాలు శుక్రుడ్ని రాజయోగ కారక గ్రహంగా పేర్కొంటాయి. తమిళనాడు సి.ఎం జయ జాతకంలో సైతం శుక్రుడు ఒకడే మాంచి పొసిషన్లో ఉన్నాడు.శుక్రభలంతోనే ఆమె రాజయోగాన్ని అనుబవిస్తూంది

2 comments:

  1. జాతకంలో కావాల్సిన ఫలితం రాలేదా, న్యూమరాలజీలోకి దిగారు? అదీ కుదరకపోతే మూడుముక్కలాట ప్రయత్నించండి, 420లకు అచ్చొస్తుంది.

    ReplyDelete
  2. బాబు జాతకం ఎలా ఉందోచెప్పండి ( ముఖం లో కనిపిస్తోంది కానీ )

    ReplyDelete