క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday 12 May 2012

జగన్ అక్రమాస్తుల కేసులో ఏ 1 సోనియా

2004 ఎన్నికలనంతరం వై.ఎస్.ను సి.ఎం చేసిందెవరు? సోనియా. కొనసాగించిందెవరు సోనియా. 2009 లో మళ్ళీ వై.ఎస్.ను సి.ఎం చేసిందెవ్వరు? సోనియా. వై.ఎస్. అవినీతికి పాల్పడి ఉంటే కట్టిడి చెయ్యాల్సిన భాధ్యత సోనియాదే.

ఆవిడ సర్వ శక్తి సంపన్నురాలు. జాతీయ అధ్యక్షురాలు . వై.ఎస్.కేవలం ఒక రాష్ఠ్రానికి చెందిన సి.ఎల్పి నేత మాత్రమే. సీల్డు కవర్లో మరో పేరు వ్రాయించి పంపి యుంటే వై.ఎస్. దిగిపోయే వారు.

మరి ఎందుకా పని చెయ్యలేదు? నేరం చేసినవారితో పాటు - ఆ నేరానికి అవకాశం కల్పించినవారు -మరి ఆ అవకాశాన్ని పొడిగించిన వారు కూడ శిక్షార్హులే.

ఆ నాడు చంద్రబాబు , యెల్లో మీడియా వై.ఎస్ అవినీతి పరుడని రోడ్డెక్కేరు -పుస్తకాలు ముద్రించేరు -కోర్టులకెక్కేరు. అయినా సోనియా మాత పట్టించుకోలేదు. దీనాంతర్యమ్ ఏమిటి?

వై.ఎస్.మరణానంతరం జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకునేవారు కొంతమందే ఉన్నారు. కేకే,హనుమంత రావులాంటి వారు. వీరు పాపం వయో వృద్దులు - ఎన్నికలంటేనే దడ- సోనియ కణికరిస్తే గాని పదవులు దక్కని వారు.వారి పదవులకోసం ఏవో వాగుతుంటారని అనుకునేవాడ్ని.

ఆ మద్య ఉండవల్లి భయలుదేరారు. ఎందుకో దానిని కొనసాగించలేదు. రేణుకా చౌదరి కథ తెలిసిందే (రాజ్య సభ సభ్యత్వం కావాలిగా) కాని ఈ మద్య జగన్ పైకి ఒంటికాలితో లేసేవారి సంఖ్య కాస్త పెరిగింది. (ప్రతి) కుక్క బౌ బౌమనును అన్న చందంగా వీరందరూ జగన్ పై చేసే ఆరోపణ ఒక్కటే .

తండ్రి వలన కొందరికి "మేలు" జరిగింది.ఆ మేలు జరిగిన వారు జగన్ కంపెనిల్లో పెట్టుబడి పెట్టారు. తండ్రి ఎవరు కేవలం ఒక సి.ఎం. అదీ ఒక జా.....తీయ పార్టికి చెందిన సి.ఎం. మరీ అది కాంగ్రెస్ పార్టి అందులో కార్యకర్తలు ఉంటారో లేదో తెలీదు కాని "నాయకులు "మాత్రం వందల సంఖ్యల్లో ఉంటారు. వై.ఎస్. నెత్తి మీద డిల్లి -డిల్లీలో ఒక రాణి ఉన్నారు.

అటు ఆ రాణి, పార్టి పెద్దలు, రాష్ఠ్ర్ర పార్టిలోని గౄపులు , అసమ్మతి నాయకులు వీరందరిని కాదని వై.ఎస్. కొందరికి మేలు చెయ్యకలిగారు అంటే ఎలా నమ్మాలి?

ఎక్కడ తప్పు దొర్లుతుందా వెంటనే మీద పడి గోరంత కొండంత చేద్దామంటూ కాచుక్కూర్చున్న ఎల్లో మీడియా-దాని తోక పత్రిక. వీరందరి కళ్ళు కప్పి వై.ఎస్. "మేలు"చేసారే అనుకుందాం.

ఆ మేలుకి కేవలం వై.ఎస్. మాత్రమే కాదు . వై.ఎస్. హయాంలో పనిచేసిన మంత్రి మండలి ఉమ్మడి భాధ్యత వహించాల్సి ఉంటుంది. (కలెక్టివ్ రెస్పాన్స్ బిలిటి -ఇది రాజ్యాంగంలోని ఉంది)

ఆరోపణలు గుప్పిస్తున్న వారి మాటకే వస్తున్నా మేలు చేసింది ఎవరు? సి.ఎం అందుకు భాధ్యత వహించాల్సింది ఎవరు? సమస్త మంత్రి మండలి -ఆయా శాఖాధికారులు.

మేలుకి భాధ్యుల్ని పట్టించుకోలేదు మేలు పొందిన వారిని పట్టించుకోలేదు. ఆ మేలు పోందిన వారు జగన్ కంపెనిల్లో పెట్టుబడి పెట్టారని - అవన్ని అవినీతి సొమ్మేనని గగ్గోలు పెడతారు. జగన్మోహన్ రెడ్డికి డజన్ల కొద్ది కంపెనీలు ఉంటాయి.

వాటిలో ఏ కంపెని జోలికి పోరు.కేవలం ఒక్క సాక్షి పత్రిక,సాక్షి చానళ్ళను మాత్రం టార్గెట్ చేస్తారు. బ్యాంక్ ఖాతాలు స్థంబింప చేస్తారు.ప్రభుత్వ ప్రకటనలు నిలిపి వేస్తారు.

మరీ ఉప ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ పనులన్ని చేస్తారు. తమ గోయబల్స్ ప్రచారాన్ని జగన్ ఎక్కడ తిప్పి కొడతారోనన్న వనుకుతో ఈ కుట్ర పన్నుతారు.

వై.ఎస్. ఏం మేలు చేసారు? శ్రీమాన్ చంద్రబాబు నాయుడు హయాంలో భూముల కేటాయింపుకు ఏవైతే నియమాలు రూపొందించి పాటించారో అవే నియమాలను పాటిస్తూ - ఇంకా ప్రభుత్వానికి నాలుగు రాళ్ళు ఎక్కువ వచ్చేలా భూములు కేటాయించారు.

అలాంటప్పుడు వై.ఎస్ అవినీతి పరుడంటే బాబు కూడ అవినీతి పరుడేగా? వై.ఎస్. మంత్రి వర్గ సహచరులతో పాటు - నాటి 9 సంవత్సరాల బాబు పరిపాలనలో మంత్రి మండలిలో ఉన్న వారు, శాఖాధికారులుగా ఉన్నవారు కూడ కూడ అవినీతి పరులే.

ఇందాక చంద్ర బాబుకు కాని , బాబు - వై.ఎస్ మంత్రి వర్గ సహచరుల పేర్లను కాని చార్జి షీట్లో చేర్చలేదు. రెయిడ్లు చెయ్యలేదు -నోటీసులు -సమ్మన్లు జారి కాలేదు - వారి బ్యాంక్ ఖాతాలను స్థంభింప చెయ్య లేదు.

ఇదేమి న్యాయం? పోని ఇవన్ని కోర్టు పరిదిలో ఉన్నవే అనుకుందాం. త్యాగ శీలి - పరుశుద్దురాలని చాటుకునే సోనియా ఏం చేసుండాలి?

కోర్టు భూ కేటాయింపుల పై విచారణకు ఆదేశించగానే వై.ఎస్. హయాంలో మంత్రులుగా ఉన్నవారందరిని మండలి నుండి తొలగించి ఉండాలి. వారి పై విచారణ జరిపించటానికి ఒక కమిషన్ను అప్పాయింట్ చేసి ఉండాలి. ఆ పని చెయ్యకపోవడమేమిటి?

జాతీయ పార్టి అద్యక్షురాలిగా తన పార్టి రాష్ఠ్ర్ర విభాగానికి చెందిన ఒక వ్యక్తి సి.ఎంగా ఎవరికో మేలు చేస్తున్నా ఆ మేలు పొందిన వారు సి.ఎం కుమారుడి కంపెనిల్లో పెట్టుబడి పెడుతున్నారని తెలిసినా నోరు మెదప లేదు. పైగా వై.ఎస్.ను ఆకాశానికి ఎత్తేరు.

దీనర్థం ఒక్కటే అన్నీ సోనియా మాతకు తెలిసే జరిగాయి. ఆ మేలు పొందిన వారి వద్దనుండి ఆమె కూడ మేలు పొందారు.

1 comment:

  1. అంటే YSR, Soniaలు తోడు దొంగలు కాని జగన్‌కి ఏపాపం తెలియదు అంటున్నారా? భౌ భౌ మన్న అరిచిన పచ్చపార్టీని మొదట షూట్ చేయాలంటున్నారా. సానా బాగుండాది ఈ వాదన.

    ReplyDelete