
CBI అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్. కాంగ్రెస్ అంటే సోనియా. ఈ రోజు సి.బి.ఐ సాక్షి,జగతి పబ్లికేషన్స్,ఇందిరా టెలివిజన్ సంస్థల బ్యాంక్ ఖాతాలను స్థంబింప చేసింది అంటే సి.బి.ఐ చేత ఆ పని చేయించింది సాక్షాత్తు సోనియానే.
ఇంతటి నీచానికి దిగజారిన సోనియాను -ఇంతటి ప్రజాస్వామ్య ఖూనికి పాల్పడ్డ సోనియాను, మీడియా గొంతు నొక్కిన సోనియాను మహత్తర త్యాగశీలి అంటున్నారేమిటి దేవరా అని మీరు ప్రశ్నిస్తారు.
పాయింటుకొస్తా..పాయింటుకొస్తా..
పాయింట్ నెంబర్ 1:
రాష్ఠ్ర్ర దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చెయ్య గల ఉప ఎన్నికలు సమీపిస్తున్నాయి. కౌంట్ డౌన్ మొదలై పోయింది.
ఎమ్మార్ కుంభ కోణం కేసులో కాని, అక్రమాస్తుల ఆరోపణల కేసులో కాని ఏ 2 మొదల్గొని చాలా మంది అరెస్ట్ అయ్యారు. కాని ఏ1 అయిన జగన్ పై మాత్రం ఏ చర్యలు లేవని ఆడిపోసుకున్నారు
అంతే కాదు జగన్ ఏ రోజుటికైనా కాంగ్రెస్లోకి వెళ్ళి పోతాడని జోస్యం చెప్పేరు. కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారని నీలాపనిందలు వేసేరు.
ఈ రోజు బ్యాంక్ ఖాతాలు స్థంభింప చెయ్యడంతో ఇవన్ని ఎగిరి పోతాయి. దీంతో జగన్ విస్వసనీయత, ఇమేజ్ నూరింతలు పెరుగుతుందని తెలిసి ఈ పని చెయ్యించిన సోనియా మహత్తర త్యాగశీలి కాదా?
పాయింట్ నెంబర్ :2
ఇందిరా మరణానంతరం మనకీ రాజకీయాలొద్దు మా దేశానికి వెళ్ళి పోదామన్న సోనియా - రాజీవ్ మరణానంతరం ఏళ్ళ తరబడి ఇంటికే పరిమితమైన సోనియా -బోఫర్స్ కుంభకోణ నిందితులతో "దగ్గర" సంభందం ఉన్న సోనియా పైనే దేశ ప్రజలు ఎంతో కొంత సానుభూతి చూపి నిలబెట్టారు.
అటువంటిది తండ్రి మరణానంతరం కేవలం ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం చేసిన ఓదార్పు యాత్రను అడ్డుకో చూసినందుకు తిరుగు భాట పట్టిన జగన్ని, తండ్రి పథకాలు అమలై తీరాలని పోరాడుతున్న జగన్ని, ఈ సమ్మన్లు ,స్ఠంభనలు ,జప్తులు ,అరెస్టులు జరుగుతాయని తెలిసి తెలిసి ప్రజా పక్షం నిలబడి పోరాడుతున్న జగన్ని ఎంతగా ఆదరిస్తారో సోనియాకి తెలియందేం కాదు. ఈ మాత్రం దానికి బుర్ర కూడ అవసరం లేదు.
ఈ పరిస్థితిలో జగన్ పై ఈగ వాలితే సానుభూతి ఉప్పెనలా ఎగిసి పడుతుందని తెలిసి తెలిసి -రాష్త్ఠ్ర్రం లో ఇప్పటికే ఖయమై పోయిన ఉప ఎన్నికల విజయం ఘన విజయంగా -చారిత్రిక విజయంగా విశ్వరూపం దాలుస్తుందని తెలిసి తెలిసి -కాంగ్రెస్ పార్టి బంగాళా ఖాతంలో కలిసి పోతుందని తెలిసి తెలిసి ఈ పని చెయ్యించారంటే సోనియా
మహత్తర త్యాగశీలియే..
ఈ దుశ్చర్యలకు పూర్వమే జగన్ సి.ఎం కావడం ఖాయమై పోయింది. ఈ సమ్మన్లు -స్థంభనలు సెకండ్ బుల్లెట్ పౄఫ్ వంటిది.
అయినా తనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తికి సెకండ్ బుల్లెట్ పౄఫ్ అందించాలంటే కూడ కాస్త త్యాగ భావం ఉండాలిగా.
అందుకే చెబుతున్నా సోనియా మహత్తర త్యాగశీలి
0 comments:
Post a Comment