క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday 5 May 2012

జగన్ పూర్వ జన్మ స్మృతులు


"పునరభి జననం పునరభి మరణం" అంటారు. చరిత్ర పిచ్చి వాని వలే ఒకే విషయాన్ని మర్ల మర్ల వాగుతుంటుంది అంటారు.

తండ్రి మరణాంతరం స్వంత పార్టి "చెయ్యిచ్చి " "పొమ్మన లేక  పొగ పెడుతుంటే " ఏమాత్రం జంకు
భొంకు లేక ఓదార్పు యాత్రకు కదిలి పోవడం కాని..

నీలాపనిందలు మోపి -రెయిడ్లని -విచారణలని ఎన్ని తిప్పలు పెట్టినా మారని చిరునవ్వుతో కొత్త పార్టి పెట్టడం -పదవికి రాజినామా చేసి హిస్టారికల్ మెజారిటితో ఎం.పి కావడం -తల్లిని గెలిపించుకోవడం ఇలా ఒక దాని వెనుక మరొకతి చక చకా జరిగి పోతుంటే ఈ కార్యక్రమాలను కొత్తగా మొదలు పెట్టి చేసినట్టు అనిపించడం లేదు. జగన్ ధీరత్వం చూస్తుంటే ఈ కార్యక్రమాన్ని ఎప్పుడో తన పూర్వ జన్మలోనే చేసినట్టుగా అనిపిస్తూంది.

2వ శతాబ్దానికి చెందిన తమిళ రాజు ఇళంజేట్చెన్ని.  తండ్రి సామంత రాజులను,ఇరుగు పొరుగు రాజులను  అనచి తన చెప్పుచేతల్లో పెట్టుకొని ఏక చథ్రాధిపత్యం చేస్తున్నాడు.

మొదట వ్యతిరేకించినప్పటికి కాలక్రమంలో  సామంత రాజులకు గాని , ఇరుగు పొరుగు దేశ రాజులకు గాని   ఇళంజేట్చెన్ని అంటే వల్ల మాలిన ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి. ఇక స్వరాజ్యంలోని  మంత్రి ప్రథానుల గురించి వేరే చెప్పక్కర్లేదు.

ఇతని ఏకైక కుమారుడు కరికాలన్. ఇతను 13 ఏళ్ళ బాలునిగా ఉండగానే ఇళంజేట్చెన్ని ఆకస్మికంగా మరణించారు.

కొందరు కరికాలన్ను పట్టాభిషిక్తుడ్ని చెయ్యాలని కోరినా తక్కినవారందరూ కుమ్మక్కై కరికాలన్ను జైల్లో పెట్టేరు. అక్కడ నుండి తప్పించుకున్నాడు. ఒక ఇంట దాగి ఉన్నాడని తెలిసి ఆ ఇంటికి నిప్పెట్టేరు. ఆ అగ్ని ప్రమాదంనుండి తప్పించుకునే యత్నంలో కరికాలన్ కాలు నల్లబడిపోయింది.

తప్పించుకున్న కరికాలన్ తండ్రి అనుచరులను కూడకట్టాడు.సైన్యం ఏర్పాటు చేసుకున్నాడు. శతృవులను ,ఆ శతృవులతో కుమ్మక్కైన ద్రోహులను మట్టు పెట్టాడు. రైతన్నల కన్నీళ్ళు తుడవడం కోసం బండరాళ్ళతోనే తిరుచ్చిరాపళ్ళి సమీపంలో కొళ్ళిడంలో  (కావేరి నది  పై )ఆణకట్ట నిర్మించాడు (దీనినే కల్లనై అంటారు)

రాజ్యాన్ని విస్తరించి జనరంజక పాలన అందించాడు. చరిత్రలో ఒక శాస్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు.

ఇది కరికాలన్ కథ. ఇదే కథ జగన్ విషయంలో పునరావృతం అవుతుండడం చూస్తే రెండవ శతాబ్దానికి చెందిన సతరు కరికాలనే ఈ ఇరవై ఒకటవ  శతాభ్దంలో జగన్ గా జన్మించాడేమోననిపిస్తూంది.

1 comment: