క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Friday, 20 July 2012
అటో ఇటో తేల్చుకోలేని అటు ఇటుగాని ..
జగన్! జగన్ ! జగన్!
ఆ నోట ఈ నోట కాదు ప్రతి నోట జగన్
కోట్ల మంది నోట బెల్లమై జగన్
కొంత మంది నోట అల్లమై జగన్
జగన్! జగన్ ! జగన్!
తండ్రి కోర్టు గుమాస్తా అయ్యుంటే
అక్కడి జడ్జి ఇంటికి నీళ్ళు మోసి,కూరగాయలు మోసిని
బుట్టలో వేసుకుని టైపిస్టు పోస్టు కొట్టెయ్యాలని చూసే జనం నడుమ
తండ్రి ముఖ్యమంత్రి అయ్యున్నా
తన బెంగళూరుకే - తన వ్యాపారాలకే
పరిమితమైన జగన్
యెల్లో మీడియా అర్థం పర్థం లేని విమర్శలతో
ప్రభుత్వాన్ని -పార్టిని
ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే హై రిస్క్ తీసుకుని
సాక్షిని నెలకొల్పిన జగన్
రాష్ఠ్ర్రమంతట పార్టిని గెలిపించాల్సిన భాధ్యతతో
స్వంత జిల్లా పై దృష్ఠి పెట్టలేని తండ్రి
జిల్లా మొత్తం మీద ప్రభావం చూపి తీరాలన్న
వ్యూహంతో ఎం.పి అభ్యర్థిగా గా రంగంలో దింపితే
నేనెప్పటికి సి.ఎంని కాకూడదా అని ఎదురు ప్రశ్నించని జగన్
నూట యాబై మంది ఎం.ఎల్.ఏలు తనను ప్రపోజ్ చేస్తే
రోశయ్యను ప్రపోజ్ చేసిన జగన్
తండ్రి మరణం ఇచ్చిన షాకునుండి తేరుకోక మునుపే
ఆ దు:ఖం గొంతుకు అడ్డు తగులుతుండగానే
తండ్రి మరణంతో మరణానికి చేరువైన వారి కుటుంభాలను
ఓదారుస్తానన్న జగన్
జగన్ కేసి ఉరకలు వేస్తున్న జనవాహిణి చూసి ఓదార్పుకు
అడ్డుకట్ట వేయ చూసిన అదిష్ఠానం మాట వింటే
వెను వెంటనే కేంద్ర మంత్రి - ఏ ఆరు నెలలకో సం.నికో సి.ఎం
పదవులు ఖాయమని తెలిసినా ఇచ్చిన మాటకే కట్టు బడిన జగన్.
పొమ్మన లేక పొగ పెట్టినా ఓర్పు వహించిన జగన్
ఓదార్పును కొనసాగించిన జగన్
మెహబూదాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళణకారులను
లోనికి వదిలి తనను ఆహ్వాణీంచడానికొచ్చిన వారిని
స్టేషన్ భయిట నిలువరించినా ఓర్పు వహించిన జగన్
అరెస్టు చేసి ఇంటికి తరలించినా కిమ్మనని జగన్
అదిష్ఠానాన్ని - తప్పుల మీద తప్పులు చేయనిచ్చి
"ఇక లేదు ఓర్పు - కోరుదాం ప్రజల తీర్పు" అని
జనమే నినదించేలా చేసిన జగన్
పార్టి వద్దంటే ఆ పార్టి ఇచ్చిన పదవులెందుకని
తృణ ప్రాయంగా త్యజించిన జగన్
ప్రజా తీర్పు కోరి భారి మెజారిటితో
గిన్నెస్ రికార్డు బద్దలు కొట్టిన జగన్
తనకు తన తల్లికి పోటీ ఇచ్చిన వారినే
తన చెంతకు ఆకర్శించిన జగన్
ఏవో జీ.ఓలట -ఆ జీ.ఓ లతో ఎవరికో మేళ్ళు జరిగాయటా
వారు జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టారట
అందుకు
చార్జి షీటులో పేదల దేవుని పేరు చేరుస్తారట.
గవర్నమెంట్ ఆఫ్ ఏ.పి అని ఉండవలసిన చోట
ఏమో ప్రభుత్వమే వై.ఎస్. ఎస్టేట్ అన్నట్టుగా
వై.ఎస్.ఆర్ పేరు చూపుతారట..
రాష్ఠ్ర్ర్రంలో దేశానికే వెన్నెముకైన రైతు వెన్ను విరిగి
రోధిస్తుంటే పాలకులేమో వారి గోడును సైతం
ఆలకించరట..
దీంతో రగిలి పోయిన ఎం.ఎల్.ఏలు
ఓటింగుకు వచ్చిన అవిస్వాశ తీర్మానానికి
అనుకూలంగా ఓటేసేరు.
ఉప ఎన్నికలొచ్చాయి.
కడపలో అప్పటి విజయానికి కారణం సానుభూతి
ఇక ఎన్నికలంటే మాలో లేదు బీతి
అని బీరాలు పలికేరు..
ఎన్నికలరోజు దగ్గర పడుతుంటే
జగన్ వెంట జనం -ఉప్పెనలా పోటెత్తుతుంటే
నీతి మాలి - మతి చెడి
జగన్ను జైల్లో పెట్టేరు.
గడ్డివాములు అగ్గిరవ్వను
భంధింప చూసి కాలి బూడిదయ్యాయి.
విజయం జగన్ను వరించింది
తెలుగు గడ్డ తరించింది.
స్వేచ్చగా భయిట ఉన్న పాలకులు
ఎవరో ఆడిస్తే ఆడుతుంటే
భంధీగా ఉన్న జగన్ వారిని ఆటాడిస్తుంటే
భంధించిన వారిని ఉధ్వాసన భయాలు వెంటాడి
వేటాడేస్తుంటే..
రథ చక్రాలు భూమిలోకి దిగిపోయి -చిక్కుకు పోతే
పార్థుని అమ్ముల వర్షం నెత్తుటేరులే పారిస్తుంటే
అర్రులు చాచిన కృష్ణుని
కోరిక తీర్చిన కర్ణుడివలే
ప్రణబ్ ముకర్జికి ఇచ్చేడు ఓటు
మతతత్వ శక్తులు బలపడక వేసేడు అడ్డు కట్టు
ఇట్టి జగన్ ఒక వైపు
అటో ఇటో తేల్చుకోలేని
అటు ఇటుకాని వృద్ద నేత మరో వైపు..
ఏమై పోతుందిలే అని
అవమానించి
ఎటో పోతుందనుకుని మలుపులు తిప్పి
ఆ మలుపులు కాస్త
తమకే చుట్టుకుంటుంటే
ఎటూ పాల్పోక
ఎటో భయిట పడాలని
కాళ్ళ బేరానికొచ్చిన వారు మరో వైపు..
యువతా.. నువ్వు ఎవరి వైపు?
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment