క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday, 18 August 2012

జగన్ : ఇంకా మిగిలి ఉన్న ఏకైక ఆశాకిరణం



సామ్రాజ్య వాదం,మితి మీరిన అతి విశ్వాసం,స్వార్థం,బాసిసం, పెద్దన్న పాత్ర పోషణ, పెట్టుబడి దారి వ్యవస్థ పై ప్రేమతొ అగ్ర రాజ్యం కుదేలై పోతుంటే..

వారు ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో - వాటి వనరులను దోచెయ్యాలన్న కుత్శిత స్వభావంతో -తమ చెప్పు చేతల్లో ఉండే ప్రపంచ బ్యాంకు సాయంతో ప్రపంచీకరణ,సరళీకరణ,ప్రైవేటికరణవంటి వాటిని రుద్ది నాశనం చేస్తుంటే..

ప్రపంచ బ్యాంకు మాజి ఉధ్యోగస్తుడైన మన్మోహన్ ,ఇటలి దేశస్తురాలైన సోనియా అగ్రరాజ్యపు అజెండా అమలుకే పరిమితమవుతుంటే

చంద్ర బాబు కిరణ్ వంటి వారు ఈ అంతర్జాతీయ ,జాతీయ కుట్రల్లో భాగస్వాములై శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు. ప్రపంచ దేశాలు ఎటు పోతే అటు సాగడం వల్లే మన దేశం పరిస్థితి ఇలా ఏడ్చింది. పూర్తి మెజారిటి లేక పోవడం - మిత్ర పక్షాలే వ్యతిరేకత చూపడం వంటి కారణాల వలన వీరు కోర్తించే "సంస్కరణలు" పెద్ద ఎత్తున జరగలేదు కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థే పతనం అయినా మనం తప్పించుకున్నాం.

ఈ ఉప్పెనను అడ్డుకో కలిగేది సంపూర్ణ ప్రజా మద్దత్తున్ను -మానవత్వం ఉన్న నేత ఒక్కడే. జగన్ ఈ పని చెయ్యగలడు.

తండ్రిలా -తండ్రికంటే అత్యధిక ప్రజా మద్దత్తు కూడ కట్టుకున్న నేత జగన్. లెఫ్టిస్ట్ భావాలు కలిగిన నేత. ( స్కూల్ బస్సులను ఆర్.టి.సి కి అప్ప చెప్పాలన్నప్పుడే ఇది అర్థమవుతుంది). మానవత్వం ఉన్న నేత .

ప్రజాభలం ఉన్న నేతలందరిని ఏదో వంక పెట్టి బ్లాక్ లిస్టులో పెడుతూ రావడం దేశ అభివృద్దికి మంచిది కాదు. నరేంద్ర మోడి అంటే వెంటనే హింతుత్వా అనడం. జగన్ అనగానే అవినీతి అనడం .

నరేంద్ర మోడి హిందుత్వాను - ప్రజలు తెలుస్తారు. అతనేమన్నా నేరాలకు పాల్పడి ఉంటే కోర్టులు చూసుకుంటాయి. మనం చూడాల్సింది మోడి ప్రజల కోసం ఏం చేసాడు అన్న విషయాన్నే.

అలానే జగన్ పై ఉన్న ఆరోపణలను కోర్టులు తేలుస్తాయి. ఆరోపణలున్న మాత్రాన జగన్ను బ్లాక్ లిస్టులో పెట్టేస్తే కిరణ్ వంటి కీలు బొమ్మలు పరిపాలిస్తారు. బక్క చిక్కిన పేద బడుగు వర్గ ప్రజలను ఇంకా క్షోభ పెడతారు.
లేట్స్ట్ : షాపుల అగ్రిమెంటులు సైతం ఇక రెజిస్టర్ చెయ్యాలట..

హింతుత్వ రంగు పులుముకోని ఎదవల కన్నా పరిపాలన దక్షత - మచ్చలేని ప్రజా జీవితం గల మోడీలే బెటర్.
ఆరోపణలు లేని కిరణ్లకన్నా ఆరోపణలున్నప్పటికి ప్రజా మద్దత్తు - ప్రజా శ్రేయస్సుకై అంకితం కాగల జగన్లు బెటర్ చాయిస్

1 comment:

  1. sare..., puli ku atoo itoo pilli bomma pettevemiraa...?

    ReplyDelete