క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Thursday, 16 August 2012

జగన్మోహన్ రెడ్డి Vs మోహన్ దాస్ కరంచంద్ గాంది



వై.ఎస్ కడుపున పుట్టడమే జగన్ చేసిన నేరమా? వై.ఎస్.బతికుండగా అతన్ని ఏమి చెయ్యలేక పోయిన వారందరూ జగన్ పై కక్ష కట్టడం చూస్తుంటే ఇదే అనిపిస్తూంది.

జగన్ ఆ ఐదు సంవత్సరాలు వై.ఎస్. వెంట ఉంటూ చంచాగిరి చేసుకుంటూ "అన్ ప్రొడక్టివ్ ఫెలో" గా ఉండి పోకుండా తన కాళ్ళ పై తాను నిలబడాలన్న ఉద్దేశం తో వ్యాపారాలు చేసుకోవడమే జగన్ చేసిన పాపమా? చాలా మంది గొప్పింటి బిడ్డల్లా ఉన్నవాటిని పోదొబ్బకుండా -వ్యాపార దక్షతతో అభివృద్ది చెందడమే అతను చేసిన తప్పిదమా? జగన్ పట్ల మీడియాకు కక్ష పుట్టడానికి ముఖ్య కారణం వారి గుత్తాధిపత్యాన్ని సాక్షితో పటా పంచలు చేయడమేనని అందరికీ తెలుసు.

మీడియా,రాజ కీయ పక్షాలు జగన్ పై అవాకులు చవాకులు ప్రేలుతుంటే అర్థం చేసుకో కలుగుతున్నాను. కాని బ్లాగ్లోకంలో సైతం కొందరు ఇలా అర్థం పర్థం లేకుండా - మీడియా చిలక పలుకులను పలుకుతుంటే బాధేస్తుంది.
వీరిలో కుల పిచ్చితో -పార్టి అభిమానంతో ఇలా వ్యవహరించే వారి గురించి పెద్దగా ఆలోచించడం లేదు.

కాని కేవలం మీడియా కథనాలను చూసి వాటిని వాంతి చేస్తూ ఉన్నవారిని - మరీ తామేదో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్న భ్రమలో ఉన్న వారిని చూస్తే చాలా బాధేస్తుంది.

జగన్ జైల్లో ఉన్నారు. కేవలం విచారణ ఖైదిగా ఉన్నారు. నేరం రుజువయ్యేంతవరకు జగన్ను నిర్ధోషిగానే పరిగణించాలి. కాని చాలా మంది ఈ చిన్న విషయాన్ని కూడ మరిచిపోయి రెచ్చి పోతున్నారు.

ఒక మాటకు జగన్ తప్పు చేసాడనే అనుకుందాం. జగన్ తప్పు చేస్తున్నప్పుడే - ఎందుకు అతన్ని అరెస్ట్ చెయ్యలేదు?

కేవలం కాంగ్రెస్ పార్టిని వీడి స్వంత పార్టి పెట్టుకున్నాకే - ఉప ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుండగానే ఎందుకు అరెస్ట్ చెయ్యాలి?

ఆజాద్ తన నోటితో తనే చెప్పాడుగా " జగన్ మా పార్టిలో ఉండి ఉంటే ఈ పాటికి సి.ఎం అయ్యేవాడు" అని.

సోనియా జగన్ల మద్య వచ్చిన యవ్వారమంతా ఓదార్పు చెయ్యాలా చెయ్యకూడదా అన్న పాయింటు మీదే. జగన్ మాత్రం ఓదార్పా నా బొందా అని " ఊ " కొట్టి ఉంటే జగన్ కేసుల్లో ఇరుక్కునేవారేనా? జైలు పాలయ్యే వారేనా?

జగన్ నేరస్తుడో కాదో అవినీతిపరుడో కాడో కోర్టులు తేల్చని. అవి కోర్టు పరిదిలో ఉన్న యవ్వారాలు. రాజకీయంగా చూస్తే .. దాదాపుగా ఎన్.టి.ఆర్ పూర్వమున్న స్థితి గతులు పునరావృతమై పోయాయి.

చీటికి మాటికి డిల్లి యాత్రలు - వంగి వంగి దండాలు -చీవాట్లు తినడాలు .. తెలుగువారిగా తెలుగు ఆత్మగౌరవం డిల్లిలోని గల్లి గల్లిల్లో అవహేళనకు గురవుతుంటే .. కేవలం మీడియా కథనాల ఆధారంగా -సి.బి.ఐ వేసిన ఎఫ్.ఐ .ఆర్ల ఆధారంగా జగన్నే టార్గెట్ చేస్తున్నవారిని ఏమనాలి?

అరే వై.ఎస్సే అవినీతి పరుడు అనుకుందాం..వై.ఎస్. తెచ్చిన సంక్షేమ పథకాలను నీరుకారుస్తుంటే - అటకకెక్కెస్తుంటే -తుంగలో తొక్కుతుంటే దాని గురించి మాట్లాడరేం?

జగన్ పై మాటల తూటాలు ప్రేలుస్తున్నవారివి చిలక పలుకులని తెలిసినా - వారిలో ఒకరి మాటలకు ఇక్కడ స్పందిస్తున్నా. ఇదే ఇటువంటి వారందరికి నా సమాధానం.


ఇటీవల తొలగించ బడిన గుంటూరు ఫ్లెక్సి వ్యవహారం పై నేను వ్రాసిన ఒక టపా పై వరుణుడనే అతను పోస్ట్ చేసిన కమెంట్ ఇది . దీని పై నా వివరణను సవివరంగా అందించా. ఇప్పటికైనా ఇటువంటి వారు చిలక పలుకులు మానితే బెటర్ !

//సాంబార్ గారు! మో ధోరణి చూస్తే రోజూ మనం పూజ చేసుకునే దేవుళ్ళ బదులు జగన్ ఫోటో పెట్టుకుని పూజ చేసినా పర్లేదు అనేలా ఉన్నారు.//
ఆ రోజూ వస్తుంది. ఈ చేతగాని సర్కార్ కూలి - వై.కా.పా సంపూర్ణ మెజారితి సాధించి -జగన్ సి.ఎం అయ్యి వై.ఎస్. సంక్షేమ పథకాలతో పాటు ప్లీనరిలో తానిచ్చిన హామీలను అమలు చేస్తే నేనే కాదు ప్రతి పేదవాడు మీరన్నంత పని చేస్తారు.

// జగన్ను గాందితో పోల్చడానికి జగన్ దేశానికి చేసిన సేవ ఏమిటి?//
ఆ ఫ్లెక్సిలో వ్యక్తులను పోల్చ లేదయ్య బాబూ.. చరిత్రలోని రెండు సంఘఠణలను ఉటంకించారంతే . ఆ ఫ్లెక్సిలో వ్యక్తులను పోల్చారని మీరు రెచ్చి పోతున్నారు. నిజానికి వారు నాటి బ్రిటీష్ దొరల పాలనను -నేటి ఇటలి దొరసాని పాలనను పోల్చారంతే .

జగన్ దేశానికి చేసిన సేవ ఏమిటో ఏపిలో రేపటి పార్లెమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టికి గుండు సున్న మిగిలినప్పుడు తెలుసుకుంటారు.

జగన్ ఒక్కో సమస్య పై గళం విప్పినప్పుడల్లా - ఒక్కో సమస్య పై దీక్ష చే పట్టినప్పుడెల్లా సర్కారులో వచ్చిన కదలిక ఏమిటో - తద్వారా ప్రజలకు లభించిన ఊరట ఏమిటో పాత న్యూస్ పేపర్లు తిరగేస్తే తెలుస్తుంది.


//ప్రజా శ్రేయస్సు కోసం ప్రాజెక్టులు నిర్మించాడా?//
వై.ఎస్ చేపట్టిన ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం అటకకెక్కించకుండా అడ్డుకుంటున్నది జగనే.

// ప్రజల్లో నెలకొన్న దారిద్రియం తొలగించడానికి ఏమైనా ప్రణాళికలు రచించాడా?//
పార్లెమెంట్ ఎన్నికల్లో పార్టి ఘన విజయం సాధిస్తే - రాష్ఠ్ర్రానికి మేలు చేసేందుకు వీలుగా వ్యవసాయ శాఖ వంటి ముఖ్య శాఖలను డిమాండ్ చేస్తామన్నారు జగన్ . పేదవాని మోమున చిరునవ్వే ద్యేయమన్నారు జగన్. ఇంతకన్నా గొప్ప ప్రణాళిక ఏముంటుంది.

ప్రైవేట్ స్కూళ్ళ వాహణాలు తరచూ ప్రమాదాలకు గురవుతుంటే స్కూలు బస్సులను ఆర్.టి.సికి అప్పగించాలన్నారు గుర్తుందా? అది జగన్ ప్రణాళిక అంటే

//ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి ఏమైనా నూతన విదానాలు ప్రవేశ పెట్టాడా?//
జగన్ వై.కా.పా ప్లీనరి సభలో ప్రకటించిన పథకాలు -విదానాలు మీకు తెలియవా? ఐ పిటి ఆఫ్ యు !

//ప్రజల కోసం లాటి దెబ్బలు తిన్నాడా?//
ఇలాంటి కోరికలు కూడ మీకున్నాయన్న మాట..

//ప్రజల కోసం జైలుకు వెళ్ళాడా?//
ప్రస్తుతం జైల్లో ఉన్నది ప్రజల కోసం కాదా? జగన్ అనే స్పీడు బ్రేకర్ మాత్రం తటస్తంగా ఉండి పోయుంటే ఈ సర్కార్ రాష్ఠ్ర్రాన్ని అత:పాతాళానికి తోసి ఉండేది.. జగన్ భయంతో ఆచి తూచి చేస్తున్న పరిపాలనకే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి ( తిరుపతి రుయోలో మొన్న 11 నిన్న 3 పసి పిల్లల ప్రాణాలు పోయాయి - వై.కా.పా తరపున కరుణాకర్ రెడ్డి గట్టిగా నిలదీస్తున్నారు)

ఇక జగన్ జనం గొడవ నాకెందుకు అని ఓదార్పుకు గుడ్ బై చెప్పి ఉంటే గోవిందా గోవిందా..

//చెయ్యడానికి ఆయనేమైనా ముఖ్యమంత్రా -ప్రధాన మంత్రా అనే లాజిక్ తీసేసి ఆయన ఎం.పిగా తన స్వంత నియోజగ వర్గానికి ఏం చేసాడనే విషయాన్ని చెప్పండి//

సమాచార హక్కు చట్టం ప్రకారం కడప సమాచార అధికారికి ఒక ఉత్త్రరం ముక్క వ్రాసి పడేస్తే చేంతాడంత లిస్ట్ వస్తుంది సోదరా?

//అసలు గాందితో పోల్చగలిగినంత గొప్పదనం ఏముంది?ఎందులో పోల్చాలి? //
గాందితో పోల్చలేదయ్య బాబు.. ఏబిఎన్ చిమ్మిన విషం మీ బుర్రకు బాగా ఎక్కినట్టుంది

//ప్రశ్నకు జవాబుగా గాంది మీద కూడ భురద జల్లుతారేమో?//
ఆశ దోశ ..

//కాని ఎంత బురద చల్లినా గాంది తనకున్న ప్రజా బలం అండతో తన కుటుంభానికి ఏమీ చేసుకోలేదు కదా?//
జగన్ తనకున్న ప్రజా బలంతో తన కుటుంబానికి చాలా చాలా తెచ్చి పెట్టాడుగా .. ఫుట్ పాత్ పై నిరసన - గృహిణి అయిన తల్లిని రోడ్డు పాలు చెయ్యడం - చెంచల్ గుడ జైలుకు రప్పించడం

//ఏనాడూ ప్రధాని పదవి కోసమో మరో అధికారం కోసమో అర్రులు చాచలేదుకదా?//
కిరణ్లా జగన్ సోనియా ముందు మోకరిల్లాడా? సి.ఎం చెయ్యమని ప్రాధేయ పడ్డాడా? జగన్ సి.ఎం కావాలని కోరుకునేది నావంటి లక్షలాది అభిమానులు మాత్రమే. జగన్ కాదు.

//అలాంటి మహనీయుడితో దేశాన్ని ఏకం చేసి ఒక్క తాటి పై నడిపిన ఒక నాయకునితో -తన ఒక్క నిరాహార దీక్షతో (అది కూడ ఆమరణ నిరాహార దీక్ష తో) మత కలహాలను ఆపే ప్రయత్నం చేసి విజయుడైన ఒక మనిషితో అవినీతి ఆరోపణల్లో కూరుకు పోయిన ఒక నీచుడ్ని పోల్చడం కంటే వేరే అవమానం జాతికి లేదుకదా?//

ఆరోపణలని మీరే చెప్పి నీచుడని తేల్చేస్తే ఎట్లా?

8 comments:

  1. జైల్లో జగన్, 2జి రాజాని పోల్చుస్తూ మీరో పోస్ట్ రాయరూ. దేనికైనా సమవుజ్జీ వుండాలి. ఒంటినిండా బట్టలేని ముసలాయన ఎక్కడ, వేలకోట్లు చిటికెలో సంపాదించిన జగన్ ఎక్కడ? నక్కకు నాగలోకానికి వున్నంత తేడా. కావాలంటే మీ పోయస్గార్డన్ జయమ్మతో పోల్చుకోండి.

    ReplyDelete
  2. YSR శవజాగరణకు వచ్చిన సోనియా బుగ్గలు నిమరడానికి ప్రయత్నించకుండా వుండాల్సింది. అప్పుడూ ఆమె గాంధీనే కదా, ఇప్పుడే కనిపెట్టినట్టు రాస్తున్నారే. రాజీవ్ బూట్లు YSR ఏళ్ళకొద్దీ నాకినప్పుడూ ఆయన, సోణియాలు గాంధీలే. జగన్‌గాంధీ అని పేరు మార్చుకుంటే ఏమైనా వుపయోగం వుంటుందేమో సలహా ఇవ్వరాదూ.

    ReplyDelete
  3. September 5 వస్తోంది, బెయిల్ ఏర్పాట్లు ఏమైనా 420జడ్జిలతో ఏర్పాట్లు చేసుకున్నారా? విడుదల కాకపోతే జోస్యాలు చెప్పడం మానేస్తారా? ఇడ్లీ సాంబార్ తినడం ఆపేస్తారా?

    ReplyDelete
  4. meeru maarare, Raajiv bootlu naakaledu 30 yrs poradadu party lo undi charithra teliyakapote maatlaadoddu , naakite meerannattu eppudu cm ayyevaadu ysr 2004 tanu paadayaatra cheyyanavasaram ledu meeku pichi ekki ededo prelapalanaalu pelite memu emi cheyyalemu meeku charithra lo enni chaavu debbalu tinna inka maarara ilaane istamochinatlu egurutaaru tarvata result choosi edustaaru, basic ga meerandaraki cinema ki lyf ki reality telvadu, andu edo oohinchukoni raasestoo untaaru 420 judges ade judges ni pettukonti NOT BEFORE ni use chesukonna ghanudevaro andariki telusu.. idi pettudu case iknow meeru bail vaste JUDGE LU NI MANAGE CHESAARU ANTAARU raakapote ADUGO JAGAN NERASTADU ANTAARU ..mee double standard evariki talvadu, delhi velli manage chese avasam jagan ki ledu ala chesukonte ee saarike kontha mandi kommu kaastunna oka party kanumarugaipoyedi.

    ReplyDelete
  5. aa flexi pettinchinodu o verribaagulodu..., inkodu verriBLOGlodu...

    ReplyDelete
  6. asalu ee sambargadu koodaa jagan ku vyathirekame..., jagan ante janaalaku inkaa asahyam kaligelaa raasthaadu. jagan nu thiduthoo raase comments nu enjoy chesthoo publish chesthaadu. inkaa edo raasthaadu, manalanu rechchagodathaadu. manam jagan nu thiduthoo inkaa comments raasthoontaamu. sambargadu deenini enjoy chesthunnaadu.

    ReplyDelete
    Replies
    1. nijame..., 'andhrajyothi' RadhaKrishna, ee sambargadu okate..., jagan nu allari chese vishayam lo, kaakapothe iddaru rootloo veru, anthe...

      ee flexi vishayamai jagan party vaallu mingaleka kakkaleka unte..., ee sambargadu rendu saarlu raasaadu deenni goorchi,jagan nu allari cheyadam kosam.

      Delete
  7. jagan kooda gandhi lage ayite ghadse evaro meeku telise untundi , cheppandi

    ReplyDelete