క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Wednesday 22 August 2012

ఆ జి.ఓ ల పట్ల మంత్రులకు బాధ్యత ఉన్నట్టా లేనట్టా?

ఏ.పి రాజకీయాలను - పాలక పక్షాన్ని - ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపేస్తున్న ఆ జీ.ఓల విషయంలో చోటు చేసుకుంటున్న మలుపులు చూస్తుంటే - వై.ఎస్ /వై.ఎస్ వ్యతిరేకుల వాదనలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు.

వై.ఎస్ బతికున్నంత కాలం ఈ రాష్ఠ్ర్ర ప్రజలు -మరీ ముఖ్యంగా మద్యతరగతి వారు -పేదవారు గొప్పగా కాకున్నా ఏదో తమ బతుకు తాము బతికేవారు. వీలున్న ప్రతి విషయంలొను ప్రభుత్వం ఎంతో కొంత ఆదుకునేది.లేదా వారి మానాన వారిని బతకనిచ్చేది.

వై.ఎస్ ఉన్నంత కాలం ఆర్.టి.సి చార్జీలు పెరగలేదు.విద్యుత్ చార్జీలు పెరగలేదు నేటి కని విని ఎరుగని విద్యుత్ కోతల్లేవు. జాక్పాట్ సి.ఎంలు లేరు . కుర్చీల కుమ్ములాటల్లేవు. డిల్లి గల్లిల్లో పంచాయితీల్లేవు.

ఏవో రెండు పత్రికలు పేజీల కొద్ది వ్రాసుకునేవి. క్యేబినెట్లో ఏం నిర్ణయించారో ? ప్రభుత్వం ఏ జీఓలిచ్చిందో ? ఏం ఖర్మో ఎవరికీ తెలీదు.తెలుసుకునే ఆసక్తి కూడా లేదు.

వై.ఎస్. పోయారు. తెర మీదకు జగన్ వచ్చారు. రాష్ఠ్ర్రంలో ఎందరో సి.ఎంల కొడుకులు,మనవళ్ళు ఉండొచ్చును గాక. కాని జగన్ తెర మీదకు రావడం రావడమే అదిష్ఠానం గుండెల్లీ రైళ్ళు పరుగెత్తించాడు. ఓదార్పు వద్దు అంటే ఓదార్పే ముద్దు అన్నాడు.

ఇక జగన్ను పక్కన పెట్టాలి. బురద చల్లాలి. అన్నీ మన చేతుల్లో పనులేగా అనుకుని నిప్పంటించేరు. ఆ జీఓలే ఆ నిప్పుకు మూలాలు.

జగనేమో అవన్ని క్యేబినెట్ సమిష్ఠి నిర్ణయాలని వాదించేరు. మంత్రులు జీ.ఓలు క్యేబినెట్ నిర్ణయాల మెరకు విడుదలయ్యాయి కాబట్టి మేం భాద్యత వహిస్తాం కాని వాటి వెనుక జరిగిన వాటికి మేమెలా బాధ్యులమని వాదిస్తూ వచ్చేరు. తీరా చూస్తే మోపి దేవి విషయంలో క్యేబినెట్ నిర్ణయానికి -జీ.ఓకు నడుమ గల వ్యత్యాసం భయిట పడింది. మోపిదేవి బుక్ అయ్యేరు.

ధర్మాన విషయంలోను అదే తంతు. ఇప్పుడేమో మంత్ర్లులు అనం,శైలజా నాథ్ ఏబిఎన్ తో కొత్త కొత్త కథలు చెప్పడం మొదలు పెట్టేరు.

ఫైల్స్ వచ్చేవి - ఫోన్లు వచ్చేవి -వై.ఎస్ అంతటి నేతకు ఎదురు చెప్పడమా వంటి మాటలు చెబుతున్నారు. చచ్చిన అతను ఎలాగూ బతికి రాలేడు అన్నది వారి ధైర్యం.

ఇక్కడ ఒక్క మాట - చిన్న మాట మరీ ఆలోచించాల్సిన అవసరం లేదు - చిన్న ముక్క అర్థం చేసుకుంటే సరిపోతుంది.

క్యేబినెట్ నిర్ణయం మెరకే జీఓ విడుదలై ఉంటే అది క్యేబినెట్ బాధ్యత. సమిష్ఠి నిర్ణయం. దానిని ప్రశ్నించే అధికారం సి.బి.ఐకి లేదు . కోర్టు సైతం రద్దు చేయ గలదేమో గాని అందుకు కారకులను శిక్షించ జాలదు.

ఒక వేళ క్యేబినెట్ నిర్ణయానికి బిన్నంగా జీఓ విడుదలై ఉంటే దానికి ఆ జీ.ఓ విడుదల చేసిన శాఖా మంత్రిదే బాధ్యత, ఆ శాఖా ఐ.ఏ.ఎస్లది బాధ్యత.

నేటి మంత్రులు నాడు తాము మంత్రిగా పదవి స్వీకారం చేసినప్పుడు ఏదో ప్రింట్ అవుట్ ఇచ్చారు అది చదివామంతే అనుకుంటే సరి పోదు.

దానిని ఇక్కడ పొందు పరుస్తా:
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం-విదేయత చూపుతానని -భారత సార్వ భౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంద్ర ప్రదేశ్ రాష్ఠ్ర్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్దతో , అంత:కరణ శుద్దితో నిర్వహిస్తానని - భయం కాని పక్ష పాతంకాని - రాగ ద్వేషాలు కాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికి న్యాయం చేస్తానని దైవ శాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

ఇలా ప్రమాణం చేసిన వారు ఈ ప్రమాణానికి అనుగుణంగా పని చెయ్యాలి.అలా చెయ్యని పక్షంలో వారు శిక్షార్హులవుతారు.

భలమైన నేతగా వైఎస్ ఉన్నారు - ఫోను వచ్చింది -క్యేబినెట్ నిర్ణయానికి సంభందంలేని జీ.ఓ పై సంతకం పెట్టాను అంటే ..

వీరికి భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం-విదేయత లేవన్నది తేట తెల్లం అవుతూంది. //భయం కాని పక్ష పాతంకాని - రాగ ద్వేషాలు కాని లేకుండా // అనే మాటకు వీరు తూట్లు పొడిచినట్టే.

సాక్షాత్తు ఏడు కొండలవాడే నాకు శంక చక్రాలతో ప్రత్యక్షమై చెప్పారు. అందుకే క్యేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా సిద్దమైన జీ.ఓ పై సంతకం చేసామన్నా........

క్యేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా విడుదలైన జీఓలకి తమదే బాధ్యత అని ఈ మంత్రి మహాశయులకు ఎవరైనా చెప్పండి.



4 comments:

  1. అన్వేష్23 August 2012 at 07:24

    ఉంది

    ReplyDelete
  2. Already YSR ku aa Devudu siksha vesesaadu. ika ee jaganoo, mantthrulu ikanainaa buddhi thechchukovaali.

    ReplyDelete
  3. అమ్మ అనానిమస్సూ !
    నువ్వేమన్నా దేవుడికి పి.ఏ నా .. ఈ దరిద్ర గొడ్డు విశ్వాస ఘాతకుల మద్యనుండి వెళ్ళి పోవడం శిక్షా?

    ఒక జ్యోతిష్కునిగా ఒక్క విషయమైతే చెప్పగలను.. 2012,సెప్టెంబరు 9 న వై.ఎస్ జాతకానికి ఏల్నాటి శని ప్రారంభాం కావల్సి ఉండగా ఏడురోజులు ముందుగా తప్పించుకున్నారు.

    బతికే ఉంటే నేడు జగన్ పడుతున్న తిప్పలన్ని ఆయన కూడ పడాల్సిందే ఆయన చేసిన పుణ్య ఫలం ఆయన్ను అలా తప్పించింది..

    ReplyDelete
  4. avunu YSR bathiki vunte..., ee sikshalu YSR ku padi vunte..., deeniki asalu kaarakudaina jagan siksha laku dooramayi undevaadu. anduke aa DEVUDU YSR nu alaa sikshinchi, jagan nu ilaa sikshisthunnaadu, appati manthruloo sikshaarhule. appudu choosthuu oorukunna sonia ku koodaa siksha thappadu. annee varusagaa jarigi theeruthaayi.

    ReplyDelete