శంకర్ రావు వివాదస్పదం చేసిన ఆ జీఓల కారణంగా సిబిఐ ఎఫ్.ఐ.ఆర్ ఎక్కిన దర్మానతో పాటు మరో నలుగురి వద్ద రాజినామా కోరాలని అదిష్ఠానం నిర్ణయం !
మరో అరుగురికీ ఉధ్వాసన? సి.ఎం/పిసిసి ల మార్చి వారికి ప్రత్యామ్నాయ బాధ్యతలు అప్పగించే వ్యూహం?
-సాక్షి పేల్చిన ఈ బాంబు లాంటి వార్త ఇది ..
ఇక నేటి టపా మీ కోసం :
కలియుగ హరిశ్చంద్రులు (?) ఏబిఎన్ ఆర్.కె కు సూటి ప్రశ్నలు
ఏబిఎన్ అధినేత ఆర్.కె గారికి నా సూటి ప్రశ్న ఒకటే. అయ్యా ! తమరు కలియుగ హరిశ్చంద్రులు అని - అపర గాంది అని - నిప్పులాంటి మనిషి అని అయిన బిల్డప్పులంతా ఇస్తున్నారు.
దొక్కు సైకిల్ టు ఎం.డి ఈ రూట్లో ఎన్ని స్టాప్పింగ్స్ ఉన్నాయో ఇంతకీ చెప్పడం లేదు.. పోనీ మీరు ఏ అడ్డదారి తొక్క లేదనే అనుకుందాం. మీరు పయణించిన అదే రహదారిలో ప్రయాణించి ఇంకెవరన్నా - ఈ భూ ప్రపంచం మీద మీలా ఎం.డి అయ్యారా? ఎని ఇన్ఫర్మేషన్ ప్లీజ్ !
సాక్షి రాక పూర్వం ఏబిఎన్ కు వచ్చిన ప్రభుత్వ యాడ్స్ ఎంత?
సాక్షి రాక అనంతరం ఏబిఎన్ కు వచ్చిన ప్రభుత్వ యాడ్స్ ఎంత?
వై.ఎస్ బతికుండగా ఏబిఎన్ కు వచ్చిన ప్రభుత్వ యాడ్స్ ఎంత?
వై.ఎస్. పోయాక ఏబిఎన్ కు వచ్చిన ప్రభుత్వ యాడ్స్ ఎంత?
ఈ ప్రశ్నలకు సమాదానం ఇస్తే ఆ సమాదానాలే మీ నిజాయితీని నిరూపించేస్తాయి.
సాక్షి రాక పూర్వం మీ సర్కులేషన్ ఎంత?
సాక్షి రాక అనంతరం మీ సర్కులేషన్ ఎంత?
మీరిలా జగన్ను టార్గెట్ చేసుకుని పిచ్చి గీతలు గుప్పించక పూర్వం మీ సర్కులేషన్ ఎంత?
అనంతరం మీ సర్కులేషన్ ఎంత?
ఈ ప్రశ్నలకు సమాదానం ఇస్తే ఆ సమాదానాలే మీకున్న విశ్వసనీయతను సాక్షికి -జగన్కు ప్రజల మద్య ఉన్న ఆధరణను నిరూపిస్తాయి
సర్లెండి పెద్ద పెద్ద విషయాలెందుకు చిన్న విషయం ఒకటి అడుగుతా:
అవినీతి గురించి లెక్సర్లు దంచుతున్నారే . యంగిస్కాన్ ప్రోగ్రామ్. ఇందాక మీరు చేపట్టిన యంగిస్కాన్ కార్యక్రమాలను స్పాన్సర్ చేసిన వారు ఎవరు? సతరు కార్యక్రమం జరిగిన విథ్యా సంస్థలు ఏవి? సతరు కార్యక్రమాలు అక్కడ జరుగక ముందుగాని -జరిగిన తరువాత కాని ఆ విద్యా సంస్థల్లో ఎటువంటి అవకతవకలు -దోపిళ్ళు, అవాంచనీయ సంఘఠణలు జరగ లేదా? జరిగి ఉంటే అవి ఏబిఎన్లో ప్రసారం అయ్యాయా?
కొసరుకి చివరిగా ఒక ప్రశ్న:
సెక్స్ సామర్థ్యాన్ని పెంచుదామనే ప్రకటనలను కాని - మెడికల్గా స్వస్థ పరచ లేని వ్యాదులను నయం చేస్తామని కాని -భరువు తగ్గిస్తాం - భరువు పెంచుదాం అని చెప్పే ప్రకటనలను కాని ప్రసారం చెయ్యడం నేరం. ఈ నేరాన్ని
కలియుగ హరిశ్చంద్రులు ఏబిఎన్ అధినేత ఆర్.కె చెయ్య వచ్చా?
nijame..., ee RK.. jagan ku ranku mogudu laa thayaarayaadu.
ReplyDelete