క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Showing posts with label బ్లాగ్లోకం. Show all posts
Showing posts with label బ్లాగ్లోకం. Show all posts

Thursday, 23 February 2012

వెలి వేసినందుకు బ్లాగ్లోకమా థ్యాంక్స్ !



2008 నవంబరు నుండి 2009 మే దాక తెలుగు బ్లాగ్లోకంలో యాక్టివ్ గా ఉన్న నేను కొందరి కుట్ర వలన తమిళ బ్లాగ్లోకానికి వలస వెళ్ళవలసి వచ్చింది.కాని అంతా మంచికే అన్నట్టుగా స్థిర పడ్డాను . లీడింగ్ బ్లాగరుగా - ఆన్ లైన్ జ్యోతిష్కునిగా ఎదిగాను. స్వంత వెబ్ సైట్ పెట్టాను. ఇప్పటికి ఏడు లక్షలకు పైగా హిట్స్ కొట్టాను. ఇటీవల వ్యాలంటెన్స్ డే రోజున "జ్యోతిషం 360 "పేరిట ఒక పుస్తకం కూడ విడుదల చేసాను.

దాదాపు 419 కాపీలు ముందుగా రిజర్వ్ చేయబడితే మిగిలిన కాపీలు కూడ జోరుగానే సేల్ అవుతున్నాయి. భవిష్యత్ సంభంధ పది ప్రశ్నలకు సామాదనంతో పాటు ఈ పుస్తకానికి రూ.250 ముందుగా చెల్లించి రిజర్వు చేసుకున్నారు ( 419) అంటే నా ప్రాభల్యం ఎంతమటుకో అర్థమై ఉంటుంది.

ఎన్.టి.ఆర్,వై.ఎస్.ఆర్, జగన్లకు ప్రోగా నేను వ్రాయడాన్ని జీర్ణించుకోలేక - సెక్స్ గురించిన మూడ నమ్మకాలను విమర్శించడాన్ని తట్టుకోలేక - బ్రాహ్మణ కులాహంకారాన్ని నేను విమర్శించడాన్ని సహించలేక కుట్రలు పన్నిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెబుతామనే ఈ టపా వ్రాసి వెళ్ళి పోతున్నాను.

మీ దయతో వెలివేయ బడినా -దేవుని దయతో చల్లంగున్నాను. థ్యాంక్స్


Tuesday, 4 January 2011

2011లో బ్లాగ్లోకం అజెండా కూడా ఇదే అయితే సూపర్

గతంలో చంద్రబాబు ఊతపదం "నిర్దిష్ఠ ప్రణాళికతో ముందుకు పోతాం"అన్నదే. ఆయనగారి ముందుకు పోవడంతో ఎన్.టి.ఆర్ రెక్కల కష్ఠంతో /భా.జా.పా రెండు శాతం ఓట్ల బిచ్చంతో మనుగడ సాగించిన తె.దే.పా విజయవంతంగా రెండో సారి ప్రతిపక్షంలో పడ్డది.

అందుకే నాకు ప్రణాళిక అంటేనే పరమ చికాకు. ఉద్దేశం మంచిదైనప్పుడు తిక్క తిక్కగా చేసినా పిచ్చ పిచ్చగా సక్సెస్ అవుదాం.

దురుద్దేశంతో ఎంత చక్కటి ప్రణాళికలు రూపొందించుకున్నా షెడ్డైపోతాం. అయినా చంద్రబాబు ఫోబియా కాస్త తగ్గడంతో 2011లో బ్లాగ్లోకంలో  నా అజెండా ఏమిటో ఈ టపా ద్వారా పంచుకుంటా.

నా రచనలు కేవలం క్రింది విషయాల పైనే ఉండాలని ప్రయత్నిస్తా. నిజానికి జ్యోతిషం చివరన ఉన్నా కేవలం హిట్స్ కోసం అడపా తడపా వ్రాయాల్సి వస్తూంది. పది మంది చదువుతున్నప్పుడు మంచి విషయాలు వ్రాస్తే పది మందికి చేరుతుందన్న కకృత్తితోనె జ్యోతిషం మీద దృష్ఠి పెడుతున్నాను .

తమిళ బ్లాగ్లోకంలో ఉన్న స్వేచ్చ ఇక్కడ లేదు .లేకుంటేనా సంచలనం మా ఇంటి పేరు.

*ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాలి ? ( హత్యలు,ఆత్మ హత్యలు,దాడులు,ప్రమాదాలను వారించే మార్గాలు)

*విద్యా,విద్యా విదానంలోని లోపాలు సవరించుకునే మార్గాలు. యువతరం మాట బాట ఎలా ఉండాలి? ఎలా ఉన్నాయి?

* ప్రజలు తమకు కావలసిన నిత్యావసరాలను తమ స్వయం కృషితో ఎలా సమకూర్చుకో వచ్చు అన్న విషయం పై సూచనలు (వృత్తి,ఉధ్యోగం,వ్యాపారం, సెర్వీసెస్ ఏదైనా సరే చట్ట బద్దంగా,దర్మ బద్దంగా)

*వివాహం సంతానం పిల్లల పెంపు

*ఆథ్యాత్మికం జ్యోతిష్యం

*ద్యానం యోగం
ఇవే శీర్షికలతో నా బ్లాగులో ఇంకెవరన్నా వ్రాయడానికి ముందుకొచ్చినా ఆహ్వానిస్తాను. పైగా నాకు నచ్చిన టపాలకు రూ.వంద పారితోషికం కూడ పంపుతా.

Tuesday, 30 November 2010

బ్లాగ్లోకంలో పొరపొచ్చలు

బ్లాగ్లోకంలో పొరపొచ్చలు

నిజానికి నన్ను వ్యక్తిగతంగా తెలిసినవారెవరైనా సరే "అతనో టైపండి" తనకు తోచింది మొఖం మీద చెబుతాడంతే అంటారు గాని మరొకటి కాదు. నేను కరెక్ట్ అని నమ్మిన వాటిని అలా నమ్మినంత కాలం నిర్భయంగా చెప్పడం నా నైజం. నా మాటల్లో ఎటువంటి వ్యూహమో ,నా మదిలో వ్యక్తిగత లాభాలో ఉండవు కాక ఉండవు.

కాబట్టి నన్నెవరేమన్నా పట్టించుకోను. నిజానికి నా మాటలను వాటిని విన్న క్షణం వ్యతిరేకించిన వారు సైతం ఏ రెండేళ్ళకో, మూడేళ్ళకో "నువ్వారోజే చెప్పావు కాని నాకే రుచించలేదని" సారి చెప్పిన సందర్భాలు అనేకం.

కాని తెలుగు బ్లాగ్లోకంలో నా మీద పగ పట్టి ,కసి పెంచుకున్నవారు కొందరున్నారు. గూగుల్ సర్చ్ ఇంజిన్లో  నా పేరును నేనే వెతికినప్పుడు కొందరి కమెంట్స్ నా కంట పడుతుంటాయి వీరి నామ దేయాలు,పాడు పరదేశం ఏది నాకు గుర్తుండవు  ( చ్చా.. ఈ పెంటల్నెందుకు బుర్రకెక్కించడం అన్న నిర్లక్ష్యం )

నన్నిలా తూలలాడి కమెంట్స్ వేయడంతో ఆగక అగ్రగేటర్సుకు మెయిల్ మీద మెయిల్ పంపి నిషేదానికి గురయ్యేలా చేసిన మహానుభావులు చాలా మంది ఉన్నారు.

వారిని కొన్ని గ్రూపులుగా విభజించాను. చూడండి:

కరడు కట్టిన బ్రాహ్మణులు:
( నేను జ్యోతిష్యం ఆథ్యాత్మికాల్లో వారు చేసిన కుట్రలను టచ్ చేస్తుంటాను కాబట్టి -తమిళంలోనైతే ఉతికి ఆరేసాను)

హిప్పాక్రట్స్ :
వ్యభిచారానికి చట్ట బద్దత కోరి కొన్ని టపాలు వ్రాసాను కాబట్టి

తెలంగానా వాదులు:
విడి పోవడం అంటే కృంగి పోవడం, కలిసి ఉండటం అంటే వికసించటం. కలిసుందాం అనే మస్తిష్కమే ఆరోగ్యవంతమైంది. విడిపోతామనే మనస్సు రోగిష్థిదని కరా కంఠంగా చెబుతుంటాను కాబట్టి

కరడు కట్టిన హేతువాదులు:
నేను జ్యోతిష్యాన్ని,ఆథ్యాత్మికాన్ని సైతం హేతుబద్దంగానే డీల్ చేసినా వీరు నా రచనలను జీర్ణించుకోలేక దుయ్యపడుతుంటారు

చంద్ర బాబు - చిరు భజన పరులు:
ముఖ్యంగా వీరిలో కమ్మకులస్తులు, బలిజలే ఎక్కువ ఉంటారు. నిజానికి నేను తమిళుడను. మొదలియార్ కులస్తుడను.

నేను ప్రజాభీష్థం మెరకు రాష్ఠ్ర్రాన్ని పాలించిన ఎన్.టి.ఆర్ వై.ఎస్.ఆర్లను కీర్తించి వ్రాస్తుంటాను .నేను కమ్మకులస్తుడను కాను. రెడ్డి కులస్తుడను కాని . అసలు నేను తెలుగువాడినె కాను. వీరి పట్ల  నా ఆధరాభిమానాలకు లాజిక్కే లేదు.

నాకు బాబు,చిరులపై  పై వ్యక్తిగత కక్షలు లేవు

నేనేదో ప్రజా పక్షం నిలబడి నాకు తోచింది వ్రాస్తా. కాని వీరు కేవలం కుల ప్రాతిపదికన బాబు చిరులకు బజన చేస్తు నా పై విరుచుకుపడుతుంటారు

ఇక నాకు అనుకూలురు ఎవరంటారా?

ఈ పి.ము ఏదో కొత్తగా చెబుతాడు. చికాకనిపించినా చదవాలనిపిస్తుంది. ఈడి మాటల్లో ఎక్కడో సత్యం ఉన్నట్టుంది అని ఆలోచిస్తూ ఇందాకా ఈ టపాని చదివారే మీరే నాకు అనుకూలురు.

మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ టపా చదివిన మీకు థ్యాంక్స్.

Tuesday, 26 October 2010

నిన్నటి బ్లాగ్ లోకంలోని టపాలు + నా కమెంట్స్

ఎవరిని నొప్పించాలనో, కించ పరచాలనో ఈ టపా వ్రాయడం లేదు. ఎవరి లోకంలో వారుండక ఇతరులు కూడ ఇటువంటి ప్రయత్నం చెయ్యాలని కోరుతూ ..
-చిత్తూరు చిన్నోడు

mirchbajji: ముఖంపై ముడతలా..? అయితే...
కడుపుబ్బా నవ్వండి - అంతే గాని నానా పెంటలు ముఖానికి రాయకండి

తెలుగు బాష:  అనుష్క... అనుష్క.. కలవరిస్తున్న కోలీవుడ్ కుర్రకారు
ఈ దుస్థితిని మార్చేందుకే పది కోట్ల మంది నిరుద్యోగులతో ప్రత్యేక సైన్యం + నదుల అనుసందానం

పర్ణశాల: దళితులపై దౌర్జన్యాల మీద లండన్ లో ఫోటోఎగ్జిబిషన్
ఇక్కడ పెడితే దాని పై కూడ దౌర్జన్యం చేస్తారేమో?

రచన : పీసీ నుండి వైరస్ లను తొలగించటానికి ఒక సురక్షిత మార్గము!!!
అలాగే ఈ సమాజం నుండి లంచమనే వైరస్ ని  తొలగించే మార్గమేమన్నా ఉంటే చెప్పండి బాసు!

Blossom Era: క్యారట్ ఫేషియల్ :
అమ్మ బాబోయి.. మళ్ళీ ఇదేనా
మనస్సున  మంచి ఆలోచనలు పెట్టుకుని, ఆ ఆలోచనలు కార్య రూపం దాల్చటానికి ప్రయత్నిస్తుంటే క్యేరెట్ బీట్రూట్లను ఏం చక్కా వండుకుని తినొచ్చు

వంటింటి చిట్కాలు: ముడతల నివారణ కోసం...
అమ్మ బాబోయి మళ్ళీ ఇదేనా. మీ ఆలోచనలను సైతం నియంత్రిచేవి గ్లాండ్స్ . గ్లాండ్సులకు రారాజు హైపోతలామస్. దానిని నియంత్రించేది మీ ఆలోచనలు . మాత్తి యోసింగప్పు.. (డిఫ్రెంట్ గా ఆలోచించండి గురువా)

సరదాకి చిరు కవిత: గాలి నీరు నేల కలుషిత మైపోవ
మనస్సులు మానవత్వం సైతం కలుషితమై పోయాక ఇదేం సోది