పప్పు ,ఉప్పు,భియ్యం కొంటాం !
ఎందుకు తినకుంటే చచ్చి పోతామా ? నేను 10 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసాను. మొదటి రోజైతే భాగా ఆకలైంది. రెండో రోజునుండి ఆకలి శుద్దంగా లేదు.. మళ్ళీ ఐదో రోజో ఆరో రోజో కాస్త ఆకలైంది. పదవ రోజుదాకా ఆకలంటే ఏమో కూడ మరిచి పోయాను.
మరి ఎందుకు తింటున్నాం ? రోజూ తింటున్నాం. మూడు పూట్ల తింటున్నాం. వండి,ఉడక పెట్టి,వేంచి,తాలింపు చేసి, తింటాం.
మూడు పూటలు తింటున్నాం. ఇది చాలక స్నేక్స్,ఐస్ క్రీం . బ్రతకడానికి తింటున్నామా ? లేక తిని తిని చావడానికి తింటున్నామా ? బహుసా బతకడానికి అన్న ముసుగులో చావడానికే తింటున్నామేమో ?
మరి చావడానికేనా డబ్బు ? చావడానికేనా డబ్బు సంపాదిస్తున్నాం ?
బాడుగలు కడుతున్నాం / లేదా హవుసింగ్ లోన్ వాయిదాలు కడుతున్నాం:
ఏ మాత్రం గాలి ఆడని, సూర్య చంద్రుల వెలుతురు తొంగి చూడని , ఇళ్ళకు వేలాది రూపాయలు బాడుగలు కడుతున్నాం. కొన్ని బాడుగ ఇళ్ళల్లో అయితే గేట్ బీగాలు ఇంటి ఓనర్ వద్ద ఉంటుంది. రాత్రి పదికంతా గేట్ లాక్ చేస్తారు. మీరు ఇల్లు చేరడానికి రాత్రి పదై పోతే మీ బతుకు బస్ స్టాండే ! ఇలా ఒకటి కాదు రెండు కాదు సవా లక్షా ఉన్నాయి
ఇక స్వంత ఇల్లు నిర్మించిన వారి కథ చూస్తే జీవిత కాలపు పొదుపును దార పోసి జీవిత కాలపు అప్పులతో , అడ్డమైన పన్నులు కడుతూ ఉన్నారు, ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?
కరెంటు బిల్లులు కడుతున్నాం:
ఎప్పుడుంటుందో, ఎప్పుడు పోతుందో తెలీదు. మిక్సీలు,గ్రైండర్లు,ఎలక్ట్రిక్ కుక్కర్లు పని చెయ్యడంతో మన ఇంట్లోని స్త్ర్రీలు బొత్తిగా పని చెయ్యక స్థూల కాయులై, బి.పి, షుగర్ వ్యాదులకు గురవుతూ చచ్చు టి.వి.సీరియళ్ల మద్యలో వచ్చే అడ్వర్టైజ్ మెంట్ గ్యేపుల్లో అన్నం పెడుతుంటారు అయినా సంపాదిస్తూనే ఉన్నాం కరెంటు బిల్లులు కడ్తూనే ఉన్నాం. ఇందులో మరో మెలిక ఏమంటే ఆఖరు తేది దాటితే యాభై రూపాయల ఫైన్ తో కూడ కడుతున్నాం. ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?
మొబైల్ ఫోన్స్ కొంటున్నాం ఫోన్ బిల్లులు కడుతున్నాం:
ఆ ఫోన్ ఏం చేస్తుంది ? ఈ ప్రపంచముతో మనలను అనుసందానం చేస్తుంది ప్రకటనలు చేస్తే కొన్నాం. కేవలం పిచ్చుకలు సైతం తట్టుకోని వేవ్స్ వెదజల్లే టవర్లు వెలిసాయి. పట్టణ పరిదిలో ఒక మంచి వాడిని చూపగలరేమో గాని ఒ క్క పిచ్చుకను సైతం మీరు చూపలేరు.ఒకే.మొబైల్ ఫోన్ మనలను ప్రపంచంతో అనుసందానం చేస్తుందట. నిజంగా..నిజంగా అది అనుసందానం చేసేది ప్రపంచముతోనా ? కాదే ఎంత బిజిగా ఉండే ఏ మొబైలరునన్నా తీసుకొండి. అతనితో నిత్యం అనుసందించబడి ఉన్న కాలర్స్ ను వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు.
పోనీ ఆ అనుసందానమన్నా ఆనందాన్ని ఇస్తుందా ? లేదే..............రకరకాలైన ఇబ్బందులు
టూ వీలర్లకు పెట్రోలు కొట్టిస్తాం:
పొల్యూషన్ ..........ఏయిర్ పొల్యూషన్ ,సౌండ్ పొల్యూషన్,ప్రమాదం జరిగే ప్రమాదం
పిల్లల స్కూలు ఫీజులు , ట్యూషన్ ఫీజులు కడుతున్నాం:
పిల్లలను ఇపరీతంగా కొడుతున్నారని,మానసికంగా హింసించగా పిల్లలు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని,లైంగిక వేదింపులకు గురి చేస్తున్నారని పత్రికల్లో చదువుతూనే ఉన్నాం. పిల్లలక్ విపరీతమైన మానసిక వత్తిడినిచ్చే విద్యను వారిపై రుద్దుతున్నాం. టేప్ రెకార్డర్లు వచ్చి ఎంతో కాలమైనా పిల్లల మస్తిష్కాలను కేవలం రికార్డర్లుగా మార్చుతున్నాం
ఇలా ఒకటి కాదు రెండు సవా లక్షా ఖర్చులు పెడుతున్నాం . ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?
పొదుపు:
ఇవి చాలక మనలో చాలా మంది పొదుపు కూడ చేస్తుంటాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో అయితే సర్వీసు బెటరుగా ఉండదని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల్లొ అధిక వడ్డికి ఆశ పడి పెట్టి గోచీ సైతం ఊడిపోతుంది.
పోని నేష్నలైజ్డ్ బ్యాంకుల్లో మన డబ్బు దాచుకుంటామనుకుంటే వారు ఏ.టి.ఎం.ల ద్వారా నకిలీ నోట్లు సరఫరా చేస్తున్నారు. షేర్ మార్కెట్ లోనే పెట్టుబడి పెడితే ఎవడో బాత్ రూంలో కాలు జారి పడినా, మరి ఇంకెవడో తాగి పడిపోయినా షేర్ మార్కెట్ కుప్ప కూలి పోతుంది ఎందుకొచ్చిన గొడవా అని మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే ,ఎల్.ఐ.సి ప్రిమియం కట్టుకుంటే వారు సైతం షేర్ మార్కెట్ లో మన సొమ్ము పెట్టి మన జీవితాలను జూదం చేస్తున్నారు. మరి మన సంపాదనలు బతకడానికా చావడానికా?
ఏ రోజన్నా మన డబ్బును కేవలం మన ఆత్మ సంతృప్తి కోసం ఖర్చు పెట్టామా? లేదు.. ప్రతి రూపాయి సమాజం కోసం ఐ మీన్ సమాజం దృష్ఠిలో దిగజారి పోకుండా ఉండేందుకు ,ఇతరులు మనలను తక్కువ అంచనా వేయకుండేందుకే ఖర్చు పెడుతూ వస్తున్నాం.
మనం ఎంతకాలం ఎన్ని విదాలుగా ఖర్చు పెట్టినా ఏదో రోజు,ఏదో క్షణం మన శ్రమంతా వృధా చేసిన ఫీలింగే కలుగుతూంది. అయినా వృధా చేస్తూనే ఉన్నాం.
మరి ఆ డబ్బును ఎలా సంపాదిస్తున్నాం ఆ డబ్బేదో మనలను ఉద్దరిస్తుందని, మనలను మనవారిని సంతోష పెడుతుందని భావించి సంపాదిస్తాం. మరీ మన వ్యక్తిత్వం,ఆత్మ గౌరవం, మాతృ భూమి,మాతృ భాష ఇలా ఒకటికాదు అన్నింటిని మరిచి ,తుడిచి పెట్టి సంపాదిస్తున్నాం.
ఏదో క్షణం "తూ ..నా బతుకు" అనిపించినా మరుక్షణం అదే తంతు. ఒక్క సారి పునరాలోచిద్దాం. మన ఆలోచనలను పరిశీలిద్దాం. మన సంపాదనా మార్గాలను, సంపాదనను వెచ్చించే మార్గాలను సమీక్షిద్దాం.
ఏ డెబ్బై ఏళ్ళ వయస్సుకో - మరణ శయ్య మీదో ఆలోచించినా నిర్ణయం తీసుకున్నా క్రిమినల్ వేస్ట్..
ప్లాస్టిక్,ఎలక్ట్ర్రానిక్ చెత్తల మీద మోజుతో గడ్డిని ,ఆ గడ్డి పై కిరణ్ ప్రభుత్వంలా వనుకుతూ కనిపించే నీటి భింధువును, దానిలో నిక్షిప్తమై ఉన్న సమస్త సృష్ఠిని ఎప్పుడు దర్శిస్తాం!
క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Showing posts with label సంపాదన. Show all posts

Monday, 17 January 2011
Wednesday, 1 December 2010
సంపాదన మార్గాలు: 4
సంపాదన గురించిన న గత టపాలను చదివి ఎంత మంది స్ఫూర్తి పోందారో తెలీదు గాని నాకు మాత్రం ఈ టపాలు ఒక రివిషన్లా పనికొస్తున్నాయి. నేను ఎంతటి దుర్బర జీవితం గడిపానో చెప్పినా నమ్మ లేరు. పొట్ట చేత పట్టి బతికినా నా లక్ష్యాన్ని మాత్రం జార విడువలేదు.
నా దృష్ఠిలో నా లక్ష్యం ఒక గమ్యం. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి నాకు డబ్బు కావాలి. అందుకే నేను సంపాదన మార్గాలను అన్వేషించాను. కేవలం సంపాదనే నా ద్యేయం అనుకును ఉంటే ఇంతకాలం వేచి ఉండాల్సిన అవసరమే లేదు.
నా బోటి జ్యోతిష్కులు ఎంతో మంది లక్షలు లక్షలు సంపాదించేరు. కాని నా లక్ష్యం సంపాదనకాదు. నా లక్ష్యం నా దేశాన్ని సంపన్న దేశంగా మార్చటమే. అందుకని ఒక పథకం రూపొందించాను, ఆ పథకాన్ని పాలకుల దృష్ఠికి తీసుకెళ్ళటానికి నాకు డబ్బు అవసరమైంది. సంపాదన మార్గాలు అన్వేషించాను. కనుగొన్నాను. వాటినే మీతో పంచుకుంటున్నాను.
జ్యోతిష్యం మీద సంపాదించడం, మరీ కంప్యూటర్ నాలెడ్జ్, బ్రాడ్ బ్యాండ్ కనెక్శన్ కలిగి ఉన్న నాలాంటి బహు బాషా కోవిదునికి ఎంత తేలికో మీకు తెలుసు. కాని నేను జ్యోతిష్యంలోని లొసుగులను నిత్యం భయిట పెడుతూ అహేతుక అంశాలన్ దుయ్యపడుతూ వచ్చాను.
అదేం మాయో తెలీదుగాని నేను వేసుకున్న సేమ్ సైడ్ గోల్స్ నా విశ్వసనీయతను మరింత పెంచాయి. గతంలో అదనపు ఆదాయ మార్గంగా ఉన్న ఆన్ లైన్ జ్యోతిష్య సలహా ఇప్పుడు నా ముఖ్య ఆదాయ మార్గాల్లో ఒకటిగా మారింది. ఇది నా గొప్పతనం కాదు. జ్యోతిష్యంయొక్క గొప్పదనం. నిజాయితి యొక్క గొప్పదనం.
యండమూరి వీరేంథ్ర నాద్ లాగా నాలుగు విదేశీ పుస్తకాలు చదివి ఒక స్వదేశీ పుస్తకం వ్రాయడం నాకు చేతకాదు. నా పుట్టుకే అంతా. ఏదైనా సరే నాకు గురి కుదిరితే గాని అస్సల్ పట్టించుకోను. డబ్బును నాకన్నా నీచంగా విమర్శించినవారూ ఉండరు. నేడు నాలా కీర్తించేవారూ ఉండరు. నా అభిప్రాయాలు అంత తేలికగా మారవు. మారితే అది అనుభవంతోనే మారాలి.
నేను సైతం ఒక సినిమా ప్రేక్షకుడను. నాకు , నా బుర్రకు నేటివిటి మరీ ముఖ్యం. నేటివిటి లేకుంటే ఎంత గొప్ప విషయమన్నా సరే నా బుర్రలో నో అడ్మిషన్ బోర్డే కనిపిస్తుంది. నేను నా మైండ్లోనుండి డైరక్టుగా టైప్ చెయ్యగలను గాని మరి దేనినైనా చూసి టైప్ చెయ్యలేను. నా పుట్టుకే అంతా కక్కిన కూడు, సద్ది మూటలు నాకు పనికి రావు. నేను ఆకలిలో ఉన్న పులిని నాకు నేనై వేటాడుతాను.
నా మైండ్లో ఒక పాయింటు నిలబడాలంటే అది మరీ గొప్ప అంశమై ఉండాలి. నాకు పుస్తకాలు చదవడమన్నది మందు బాబులకు మందులాంటిది. మంచి పుస్తకాలు దొరకనప్పుడు చెత్త పుస్తకాలు సైతం చదువుతా. కాని అవేమి నా బుర్రలో నిలవవు.
సొంత సోది సరిగాని సంపాదన పాయింటుకు రండి బాబు.. అంటున్నారు. వినబడుతూంది.వస్తున్నా.పాయింటుకే వస్తున్నా. మనిషికి శరీరం,మనస్సు,బుద్ది అంటూ నాలుగు అంశాలున్నాయి. ఇవి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. వీటిని సంపాదనకు అనువుగా మలుచుకో కలిగితే సంపాదన చాలా తేలిక.
కవితకేదీ కాదు అనర్హం అన్నట్టుగా సంపాదనకు సైతం ఏది కాదు అనర్హం. ఒక సారి నా ఫ్రెండ్ ఒకతను ( గోల్డ్ స్మిత్) తన పాత స్కూటరును తుక్కు క్రింద తూకానికి అమ్మి వేసే ఏర్పాటు చెయ్యమన్నాడు. సరేనని మా ఇంట తోసి ఉంచాను. మా ఇంటి పని మనిష్ తన మొగునికోసం కొనుక్కోవాలనుకుంది. మెకానిక్ ఒకతనిని తీసుకొచ్చు వ్యేల్యూ వేసుకోమన్నాను. అలానే చేసింది. రెండు వేలిస్తానంది. సరేనన్నాను.
నేను కాటా తెప్పించి తూకం చూసుకున్నాను. పాత ఇనుము కేజి ఎంతకు పోతుందో కనుగొన్నాను. మార్కెట్ దరకైతే ఐదొందలు పోతుందని తేలింది. పని మనిషి వద్ద రెండు వేలు తీసుకుని ఫ్రెండ్ వద్దకు వెళ్ళి తూకం, ఇనుము దర చెప్పి ఐదొందలు అతనికిచ్చాను.
"ఆర్ యు సేటిస్ఫడ్ ?" అన్నాను
" కాదా మరి" అంటూ డబ్బు తీసుకున్నాడు.
అదనంగా మరో ఐదొందలొస్తే ? అన్నాను
" చాలా సంతోషం కదా మరి " అన్నాడు
మరో ఐదొందలు అతని చేతికిచ్చి అసలు విషయం చెప్పాను. దిమ్మ తిరిగి పోయి నన్ను ఎంతగానో మెచ్చుకున్నాడు.
( కవులంటే మురికి పంచ, జుబ్బా, సోడా బుడ్డి అద్దంతో సదా సర్వకాలం అనవసర పెగ్గితో,భావిలో కప్పల్లా, పేదరికంలో నలుగుతుంటారని అతని ఫీలింగ్. అందుకు భిన్నంగా నేను ప్రవర్తించడంతో ఆనందించాడు .అతనో మంచి వ్యాపారి కాబట్టి)
ఈ చిన్న సంఘఠనలో చాలా విషయాలు దాగి ఉన్నాయి.
మన పని మనం కూర్చున్న చోటే అయిపోవాలనుకుంటే మనం కొంత నష్ఠ పోవలసి వస్తుంది ( నా ఫ్రెండులా)
ఎవరి పనైనా సరే తిరిగి చేద్దామనుకుంటే కొంత లాభ పడే అవకాశం ఉంటుంది నాలా?
ఒకే వస్తువుయొక్క మతింపు మీ భావాన్ని పట్టి మారిపోతుంది. అతను తుక్కు అనుకున్నాడు. నా దృష్ఠిలో అది స్కూటర్లానే కనిపించింది.
స్క్ర్రాబ్ అంగడి అతని వద్దకు తీసుకెళ్ళి ఉంటే తుక్కు క్రిందే చూసి ఉంటాడు. మా ఇంటి పని మనిషి చూసింది కాబట్టి అది స్కూటర్లా కనిపించింది.
ఇన్ని అంశాలు అనుకూలించినా ఐదొందలు ఫ్రెండు మొఖాన పడెయ్యకుండా నిజం ఎందుకు చెప్పాలి అని మీరు ప్రశ్నించవచ్చు.
అతని స్కూటరు ఏదో రోజు రోడ్డు మీద తిరుగుతూ కనిపిస్తుంది. ఒక వేళ అతను మా పని మనిషిని/ఆమె భర్తను ప్రశ్నించి నిజం తెలిసొస్తే అతను నా గురించి ఏమనుకుంటాడు? నేనతనిని మోసగించాననే అనుకుంటాడు. పైగా నాకు దూరమవుతాడు.పైగా నా గురించి దుష్ప్రచారం చేస్తాడు. ఇదో కోణం.
అతను ఒక సోమరి. అతని వద్దనుండి ఇటువంటి ఆఫర్లే మరిన్ని వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని నేనెందుకు పోగొట్టుకోవాలి. భవిష్యత్ లాభం కోసం వర్థమానంలో కొద్దిగా నష్ఠపోవడంలో తప్పు లేదుగా?
ఈనాటి కొత్త వ్యాపారం:
ఇందుకు కావలసింది ప్రజల దైనందిన జీవితంలో రాగల చిన్న చిన్న సమస్యల గురించిన అవగాహణ -వాటికి పరిష్కారాలు -వాటిని అందించ గల టెక్నీషియన్స్, సమర్థులు, అనుభవజ్ణుల గ్రూపు. ( వీరు మన ఆఫీసులో పడికాపులు కాయాల్సిన పని లేదు.. మనం సమాచారం అందించినప్పుడు మన క్లెయింట్స్ వద్దకు చేరుకుని సేవలందించే వీలుకలిగి ఉంటే చాలు)
ఉ: ఇంటి తాళం పోయినప్పుడు/ ఫ్యూజు పోతే / ప్యేన్ ,ట్యూబ్ లైట్ ఫిటింగ్/ టూ వీలర్ సగం దారిలో నిలిచి పోతే/ ఇలా కో కొల్లలు సమస్యలు వస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా లిస్ట్ అవుట్ చేసుకుని వీటిని పరిష్కరించ గల ,మనకు అందుబాటులో ఉండగల సమర్థులను సమకూర్చుకోవడం. అడ్వర్టైజ్ చెయ్యడం. క్లెయింట్స్ సంపూర్ణ సంతృప్తి చెందేలా పని చేయడం,చెయ్యించడం

Sunday, 28 November 2010
సంపాదన మార్గాలు: 3
ఈ సీరియల్ మొదలు పెట్టి రెండో ఎపిసోడ్ మీద ఒక అనానిమస్ రెస్పాండ్ అవుతూ నువ్వెంత సంపాదించావని ప్రశ్నించేరు. ఈ ప్రశ్నకు సమాదానం చివరన చెబుతాను. ఇక్కడ నేను చెప్పే విషయాలు మీకే పుస్తకంలోను దొరకదు. ఇవన్నింటిని నెను కనీశం పదహారు సం.లు మరియు కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి తెలుసుకున్నవి. వాటిని మీకు పైసా ఖర్చు లేకుండా అందిస్తున్నాను. నా నిభందన గుర్తుందిగా నేను సూచించే సరి కొత్త ఆలోచనలను ఈ సైట్ చూసి అమలు చేసేవారు, తమ విజిటింగ్ కార్డులో స్ఫూర్తి :www.sambargaadu.blogspot.com అని ముద్రించుకోవాలంతే.
సంపాదనలో మనం విఫలమ్మవడానికి అతి కీలకమైన కారణం ఒకటుంది. వ్యయ,అదాయాల్లో రెవిన్యూ,క్యేపిటల్ అంటూ రెండు ఉంటాయి.
మీకు ఇట్టే అర్థం కావడం కోసం తమాషాగా చెబుతా. మీరు కోడి కొన్నారనుకొండి అది క్యేపిటల్ వ్యయం. గుడ్డు కొన్నారనుకొండి అది రెవిన్యూ వ్యయం. మీరు కోళ్ళు పెంచుతున్నారు. కోడి అమ్మి డబ్బులొస్తే అది క్యేపిటల్ ఆదాయం. గుడ్దు అమ్మి డబ్బులొచ్చాయనుకొండి అది రెవిన్యూ ఆదాయం.
ప్రతి ఒక్కరికి పెద్ద మొత్తంలో సంపాదించాలన్న కుతకుతలు ఉంటాయి. ఆ ఉద్దేశంతో క్యేపిటల్ ఆదాయంలో నుండి ఇష్థమొచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ పోతే రెవిన్యూ ఆదాయం క్రమేనా తగ్గి గుండు సున్నగా తయారవుతుంది. ( ఈ పొరభాటు కూడ చేసాను నా రోజు వారి ఆదాయాన్ని గొప్ప దూరదృష్ఠితో సుదూరపు కలల సాకారం కోసం వెచ్చిస్తూ వచ్చాను)
అలానే రెవిన్యూ ఆదాయంలో నుండి పైసా కూడ ఖర్చులు పెట్టుకోకుండా వాటిని క్యేపిటల్ వ్యయాలకు మళ్ళిస్తూ రావడం కూడ మంచిది కాదు. ( నేనీ పొరభాటు చేసే గతంలో సంపాదించిన సొమ్మును ఒక్క సారిగా పోగిట్టుకున్నాను - గ్లూకోజ్ వ్యాపారం చేసానోచ్- ఈ వివరాలు మరో సందర్భంలో చూద్దాం).
పెద్ద మొత్తంలో సంపాదించాలనుకోవడం తప్పు కాదు. కాని దానికని ఒక వ్యూహం రచించుకొని వన్ స్టెప్ అట్ వన్ మూవ్ మెంట్ తరహాలొ ముందుకు సాగాలి.
పైగా పె.మొ.ఆ విషయంలో ఈ రోజు అయిపోతుంది,రేపు అయిపోతుందని ఆతృత పడ కూడదు. టూ వీలర్ వేగానికి, ఫోర్ వీలర్ వేగానికి, కంటెయినర్ వేగానికి తేడా ఉంటుందిగా? పె.మొ.ఆదాయమన్నది కంటెయినర్ వంటిది. ఏ మలుపులోనన్నా చిక్కుకు పోవచ్చు.
అది మన గుమ్మం దాక వచ్చి చేరే వరకు పస్తు ఉండాల్సిన అవసరం లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్ ఉండాలి. లేకుంటే కంటెయినర్లో సరుకును , అది చిక్కుకున్న మలుపులోనే సగం దరకే విక్రయించవలసిన పరిస్థితి వస్తుంది.
సంపాదన మాటకొస్తే ప్రతి ఒకరు జీవితంలో ఏదో సందర్భంలో సంపాదిస్తారు. కాని ఆ సందర్భం మినహాయించి అన్ని సందర్భాల్లోను ఆర్థిక అటు పోట్లతో సతమతం అవుతుంటారు. సంపాదన ప్రక్రియ అన్నది ప్రతి రోజూ కొనసాగాలి. ఆ ప్రక్రియ ప్రతి సెకను కొనసాగాలి. అదే అసలు సిసలైన సంపాదన.
పోనీ ఈ రోజుకి ఈ చిట్కా చాలనుకుంటా ఇదివరకే నెను హామి ఇచ్చినట్టుగా ఒక కొత్త వ్యాపారం గురించిన రూట్ మ్యేప్:
సిటి ఇన్ఫర్మేషన్ సెంటర్
ఇందుకు కావల్సింది ఒక ఫోను, చిన్న గది, పదహారు గంటలూ ఫోన్ అటెండ్ చెయ్యడానికి మనుషులు. వధూ వరుల సమాచారం నుండి, టు లెట్ సమాచారం దాక, ఫ్లాట్స్, ప్లాట్స్, ఇంటి స్థలం నుండి పాత కాలేజి పుస్తకాలదాక ఏ సమాచారాన్ని అయినా స్వీకరించి వర్గీకరించి వీలుంటే ఒక కంప్యూటర్లో గాని ,లెడ్జర్స్ లో గాని దాచుకోవాలి. సమాచారం ఇచ్చేవారి వద్ద ఎటువంటి ఫీజు వసూలించ రాదు.సమాచారం కోరే వారి వద్ద మాత్రమే ఫీజు వసూలు చెయ్యాలి.( మూడు నెలల దాక)
వ్యాపారం బాగా పుంజుకున్నాక సమాచారం ఇచ్చేవారి వద్ద నుండు పది, ఇరవై రూపాయలు, సమాచారం కోరేవారి వద్దనుండి యాబై రూపాయలు స్వీకరించవచ్చు. కొందరు సదా సర్వ కాలం సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, కొందరి సదా సర్వకాలం సమాచారం అవసరమవుతుంటుంది.
ఇట్లాంటి వారికోసం నెలవారి రుసుము కూడ పరిచయం చెయ్యొచ్చు
ఓకే బ్రదర్స్.. తదుపరి టపాలో మరిన్ని చిట్కాలు, మరో కొత్త సంపాదన మార్గాన్ని చూద్దాం

Saturday, 27 November 2010
సంపాదనకు మార్గాలు:2
సంపాదనకు మార్గాలు:2
(బాసూ నిజంగానే ఈ టపాలో సంపాదన మార్గం ఒకతి చూపాను - మీరు సంపాదించాలంటే మీ చుట్టూ ఉన్నవారు కూద సంపాదిస్తూ ఉండాలి. కాబత్తి పక్కనే ఉన్న ట్విటర్ బటన్ నొక్కి మీ ఫ్రెండ్స్ తో పంచుకొండి)
సంపాదనలో మనం సక్సెస్ కావాలంటే మనకు డబ్బుతో అవసరం ఉండ కూడదు.( అవసరం ఆలోచించుకోనీయదు) లేని పోని కలలు,ఊహలు ఉండ కూడదు. మీకు కావలసింది డబ్బె అన్నప్పుడు ఎటువంటి ఆందోళనకూ అవసరం లేదు.
ఎందుకంటే ప్రతి ఒకరివద్దా డబ్బుంది. అంటే అది డబ్బుగా లేక పోవచ్చు.కాని డబ్బుగా మలుచుకోగల ఏదో ఒకటుంది.అదేమని గుర్తించ గలిగితే డబ్బు సంపాదించవచ్చు. దానిని గుర్తించడానికి కొంత కాలం పడుతుంది. సహజంగా మానవుని మస్తిష్కంలోని అహం కారణంగా చాలా సార్లు తప్పు ద్రోవ పడుతుంటాడు. మరీ టీన్ ఏజిలో ఇది సర్వ సహజం.
నేను బ్రాహ్మణేతర కులంలో పుట్టినప్పటికి నా జాతకప్రకారం నేను బ్రాహ్మణుడి వలే బ్రతకాలి ఇది నా రాత. కాని టీన్ ఏజిలో నేను చిరంజీవి అభిమానిని. చిరంజీవిలా బాడి బిల్డప్ చెయ్యాలని డాన్స్ చెయ్యాలని,డైలాగ్ చెప్పాలని ఉవ్విళ్ళూరేవాడ్ని.
టీన్ ఏజిలో సర్వదా మీ మనస్సు తప్పుడు దిక్కుకేసి లాగుతుంటుంది. (యవ్వనం, అంగ బలం, యధార్థం తెలీక పోవడం,భవిష్యత్ పై విశ్వాసం తదితర కారణాల వలన మీ అహం ఉచ్చంలో ఉంటుంది కాబట్టి) మిమ్మల్ని ఏరంగం తీవ్రంగా ఆకర్షిస్తుందో అది మీ రంగం కాదని ఇట్టే నిర్ణయించుకోవచ్చు.
మీ రంగం ఏదో గుర్తిస్తే అదే సంపాదన ప్రయత్నంలో సగం విజయం సాదించినట్టే. 1987లో విద్య పూర్తి చేసుకున్న నాకు నా రంగం ఇదని డిసైడ్ చేసుకోవడానికి రెండు సం.లు పట్టింది.. అయినా చంచలం కారణంగా అప్పుడప్పుడు నా రంగం కాని రంగాల్లో వేలు పెట్టి చెయ్యి కాల్చుకునే వాడ్ని.
మరీ మీకు తెల్ల కాకి అవసరమంటే టెన్షన్ పడాలే గాని డబ్బు కావాలంటే గాబరా పడాల్సిన అవసరం లేదు. డబ్బు అందరిదగ్గరా ఉంది.డబ్బుగానే ఉంది. వారికి ఎన్నో అవసరాలుంటాయి. ఎన్నో సేవలు అవసరమవుతాయి. వాటిలో ఏదో ఒకదానిని నెరవేర్చే సత్తా, నైపుణ్యం మీకుంటే చాలు ఇట్టే డబ్బు సంపాదించవచ్చు.
నేనిదివరకే వ్రాసిన మని సీక్రెట్స్ ఏ పుస్తకంలోనో దొరికింది కాదు. శుక్రవారం బిక్షకులు షాప్ టు షాప్ ఎక్కి దిగుతూ చిల్లర డబ్బులు సేకరించినట్టు నా చుట్టూ ఉన్నవారినుండి సేకరించాను. మరీ వారి ప్రవర్తనల్లో నుండి డైరక్టుగా ఈ సీక్రెట్స్ నేర్చుకోలేదు. వారు నెగటివ్ గా ప్రవర్తించి "షెడ్" ( దివాళా తీయడం) అయి పోతే వారు నేర్చుకున్నారో లేదో నేను నేర్చుకున్నా గుణ పాఠాలు.
తొలూత నేను సైతం జీసస్ బైబుల్లో పేర్కొన్న పక్షుల్లాగే " విత్తడమో, కోయడమో" చెయ్యక బ్రతికేవాడ్ని. నాన్న ఉన్నంత కాలం ఎలాగో సర్దుకు పోయింది. నాన్న పోయాక ఒక్క సారిగా యధార్థం నెత్తి మీద పిడుగులా దిగింది.
అవసరం నన్ను సంపాదన మార్గంలోకి తోసింది. నా అవసరంతో నా చుట్టూ ఉన్నవారు సంపాదించ కలిగినారే గాని నేను నష్ఠ పోవడమే జరిగింది. ఇలా నేను నష్ఠ పోయిన సందర్భాలు కోకొల్లలు. నాకు మరీ చికాకెక్కువ. స్టీరియో టైప్ కథలు, సినిమాలంటే నాకు వళ్ళు మండుతుంది. అలాంటిది జీవితంలో ఒకే విదమైన తప్పులు ఎలా చెస్తాను? కొత్త కొత్త తప్పులు చేసాను.
నేను ఏ టాటా,బిర్లా, అంబాని,వాడియా కుటుంభాల్లో బుల్లి మనముడిగా పుట్టి అన్ని తప్పులు చేసి ఉంటే వారి శతాబ్దకాల ఆస్తులన్ని కాలి పోయి మన దేశం ఆపరేషన్ ఇండియాతో అవసరమే లేక సంపన్న దేశమై ఉంటుంది.
నా తప్పులతో నా చుట్టూ ఉన్నవారంతా లాభపడ్డారని ఇదివరకే చెప్పానుగా
సంపాదన మార్గం: 1 " సెకండ్స్ బజారు"
ఒక సారి మీ ఇంటి అరక పైకి ఎక్కి చూడండి అందులో ఏవేవో చెత్తలుంటాయి. మీ అబ్బాయి పుట్టినప్పుడు కొన్న మస్కిటో నెట్, అతను పడుకొన్న ఊయల, తోసుకుని పరుగులు తీసిన త్రోపుడు బండి,అతను తోలిన ట్రై సైకిళ్ అన్నీ పడి ఉంటాయి. ( ఈ లిస్టు ఓటరు జాబితాకన్నా పెద్దది)
కాని మీ ఊళ్ళోనే ఎందరో పేద తల్లి తండ్రులుంటారు .వారికి వారి పాపకు మస్కిటీ నెట్ పెట్టుకోవాలనుంటుంది కాని ఆర్థక స్థోమత ఉండదు. మీ అరక మీద ఉన్నది మీకో అడ్డం, చెత్త కాని వీరికి?
ఈ పరిస్థ్తితిని దృష్ఠిలో ఉంచుకుని ఔత్సాహికులు ప్రతి ఆదివారం ఒక సెకండ్స్ బజారు నిర్వహించవచ్చు. ఇందుకు కావల్సింది ఒక ఖాళి స్థలం, ఒక షామియానా, కొంత అడ్వర్టైజ్ మెంట్. నామినల్ ఎంట్రన్స్ ఫీ పెట్టి సెకండ్స్ వస్తువులను లోనికి అనుమతించ వచ్చు. అవి సేల్ అయితే కొంత కమీషన్ టైపులో వసూలు చెయ్యొచ్చు.
ఈ సలహాను అమలు చేసి సంపాదించ దలచినవారు తమ ప్రకటనల్లో నా ఈ సైట్ పేరు యు ఆర్ ఎల్ ముద్రిస్తే చాలు ( ఇదే ఫీజు)

Friday, 26 November 2010
సంపాదన మార్గాలు : 1
బాసూ ..ఈ ఒక్క టపాలో వంద సంపాదన మార్గాలుంటాయి.ఒక్కటైనా మనకు సరిపోదా అని భావించి వచ్చారేమో? ఒకటి కాదు వెయ్యి మార్గాలు చూపుతా కాని తదుపరి టాపాల్లో. ఈ టపాలో సంపాదనకు నిజాయితీ కీలకం అన్న పాయింటును వివరించా.
నిజాయితీగా డబ్బు సంపాదించడం సాధ్యమేనా? సాధ్యమే అని నమ్మేవారిలో నేనూ ఒకడ్ని. సాధ్యం చేసుకున్నాను కూడ. (లక్షల్లో కాక పోయినా వేలల్లో) అదెలా సాధ్యమైందో కూడ వివరిస్తా.
మీలో దమ్మున్న వారు పాటించి సంపాదించి చూపితే అదే నాకు పదివేలు.
నేను పుట్టుకతో ఉత్తముడ్ని కాను. అందుకని ఐ.పి.సి ప్రకారం నేరాలు చేసినవాడ్ని కాను. మా నాన్నగారి నిజాయితీని చేతగానితనంగా విమర్శిస్తుండేవాడ్ని.మా నాన్నగారు జిల్లా ఖజాణా అధికారిగా పని చేస్తున్న వేళలో మా ఇల్లు వానకు కూలి పోయిందంటే నమ్ముతారా? ఇటువంటి సంఘఠన బహుసా మా (నా) జీవితంలోనే జరిగి ఉంటుందనుకుంటా.
ఆయనగారి నిజాయితీ అంటే అట్టాంటి ఇట్టాంటి నిజాయితి కాదండి బాబూ . చిర్రెత్తించే నిజాయితీ. చేదస్తం అనొచ్చు.ఓవర్ ఆక్షన్ అనొచ్చు. అంతటి నిజాయితీ. ఆనాటి జనతా చీరలే మాకు (నలుగురు కొడుకులు) చొక్కాలుగా మారేవి. ఒకే డిజైన్లో అర డజను చొక్కాలు.బోగి నాటికి అదే డిజైన్, సంకరాంతికి అదే డిజైన్, కనుమకు అదే డిజైన్.
యూనిఫార్మ్ అంటే బిన్ని క్లాత్ లో డ్రాయర్లు, ఎల్.ఎమ్.సి గాడాలో చొక్కాలు. జిల్లా అధికారి కాబట్టి జిల్లా టు జిల్లా బదిలీలు ఉంటాయి. ఊరుగాని ఊళ్ళో హోటల్ భోజనం ఒక పూటకు తెచ్చుకుని అందులోనే మిగుల్చుకుని రాత్రికి తినేవాడు. ఉ.పూ ఆఫీసుకెళ్ళి పనులు చేసేవాడు. అర్ద రాత్రిదాక చేసేవాడు. మద్యలో ఆకలైతే బొరుగులు తెప్పించుకుని తినేవాడు.
ఆయనిలా ప్రవర్తిస్తుంటే టీన్ ఏజిలో ఉన్న నాకు ఏమనిపించి ఉంటుందో మీరే ఊహించుకొండి. కాని కాల క్రమంలో ఆయనగారి నీతి,నిజాయితి,దర్మ సూత్రాలు నాకు అంటుకున్నవి. ఆయన కాలానికి ఆయనకో బోడి ఉధ్యోగం దొరికింది. ఒక గ్రామ పెద్ద కూతుర్నిచ్చి పెళ్ళి చేసాడు ( మాంచి కట్న కానుకలతో) మా అమ్మ సీతకన్నా ఓర్పుతో పేదరికాన్ని ,ఆయన చేదస్తాన్ని భరించింది.
మరి నేనూ? నిరుధ్యోగిని. పైగా ముక్కోపిని. ఎన్.టి.ఆర్ అంతటి ఆత్మ విశ్వాసం గలవాడ్ని .నేను ఎన్ని ఉధ్యోగాల్లో( ప్రైవేటు చిన్నా చితకా) చేరానో ఎందుకు మానెయ్యాల్సి వచ్చిందో అన్న పాయింటు మీద ఒక్క ఏడాది వరకు వరస పెట్టి టపాలు వ్రాయొచ్చు. నాదా ప్రేమ పెళ్ళి . నా భార్య కట్టుకున్న చీరతో కూడ కాదు వోనితో వచ్చింది. ఇందులో దేశాన్ని సంపన్న దేశం చేస్తానని ఆదర్శాలు, సి.ఎంతో యవ్వారాలు,కేసులు.
ఇక జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి గెస్ చెయ్యండి. ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా కష్ఠాలే.
1991-2007 దాకా 16 సంలు పస్తును వాయిదా వేయడానికి, పేదరికపు కోరల్లోనుండి జారుకోవడానికే నా శక్తి యుక్తులన్ని వెచ్చించవలసి వచ్చింది. సాధారణంగా ఎవరైనా ఇటువంటి పరిస్థితిలో "నీతి నిజాయితి అంటూ మడి కట్టుకుని కూర్చుంటే పస్తులతో చచ్చిపోతాంరా బాబో.. నీతి లేదు గీతి లేదు "అని ఒక యు టర్న్ కొట్తి ఉంటారు.
సహజ సిద్దంగా ఆరోగ్యమైన శరీరం గలవాడ్ని. పదునైన బుద్దిగలవాడ్ని. ( ఎస్.ఎస్..సిలో 72 శాతం) కరిగి పోయే మనస్సున్నవాడ్ని.
కాని బేసికల్ గా నేను రెబెల్ ను. జగమొండిని. నా టీన్ ఏజిలో నా పరిసరాలు /మనుషులు నీతి బోధ చేస్తుండే వారు. నేను వారిని వ్యతిరేకించేవాడ్ని.
నాకు జ్నాన దంతం మొలిచినాక నా పరిసరాలు మారిపోయాయి. మనుషులు మారి పోయారు. ఇక వీరిపై రెబల్ అవ్వడం మొదలు పెట్టాను.
వివాహానంతరం 1991-2007 దాకా 16 సంలు పొట్ట చేత పట్టి నడిచినా నా లక్ష్యాన్ని జారవిడువ లేదు. నేనెంతగా క్షీణించి పోయినా క్షణమన్నా ధర్మాన్ని వీడ లేదు. గుంటూరు పంచాంగం రేపర్ మీద వ్రాసినట్టుగా/లేదా స్వామి వివేకానంద స్వామి చెప్పినట్టుగా నాలో - నా అంత:కరణంలో ఎన్నో మార్పులొచ్చాయి. ఎన్నో అధ్భుతాలు జరిగాయి.
సమాజంలో తిక్కలోడబ్బా/ స్ట్ర్రెయిట్ ఫార్వార్డ్ ము.కొడుకు/ మొఖం మీద మాట్లాడతాడబ్బా/,మంచోడే ..మాట పడడప్పా టైపులో పేరు తెచ్చుకున్నాను. ఇవేమి నేను ప్లాన్ చేసి సాధించినవి కావు. కేవలం ఈ గుడ్ విల్ నాకు సంపాదన మార్గాలను తెరిచి ఉంచింది.
అవేమిటో తదుపరి టపాలో వివరిస్తాను

Subscribe to:
Posts (Atom)