క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Showing posts with label డబ్బు. Show all posts
Showing posts with label డబ్బు. Show all posts

Wednesday, 3 August 2011

మిమ్మల్ని సంపన్నులు చెయ్యగల మని సీక్రెట్స్ : సెమినార్ స్పీచ్ (ఆడియో)


చావు - సెక్స్- హింస - డబ్బు : అంతా ఒక్కటే. ఈ సత్యాన్ని తెలుసుకున్నవారు చాలా తీలిగ్గా డబ్బు సంపాదించగలరు. కనీశం తాము ఎందుకు సంపాదించ లేక పోయారో - అది ఎంత మంచిదైందో తెలుసుకుని ఆనందిస్తారు.

నిజానికి డబ్బు సంపాదించే వారంతా చావు మీది భయంతో చావుకేసి పరుగులు తీసే వారే. సెక్స్ దొరక్క - తమకు దొరకనిదేమో తెలీక డబ్బు వెంట పరుగులు తీసే వారే. తిన పోతూ రుచి గురించి చెప్పడం దేనికి. ఈ నగ్న సత్యాలన్నింటిని ఆడియో ఫైలుగా మీకు వడ్డించాను.(Look at just below the header image) ఆనందించండి.

గమనిక:
ఇది వీడియోనుండి విడదీసిన ఆడియో ట్రాక్. కావున ప్రారంభంలో వై.ఎస్.ప్రమాణ స్వీకారం - కొన్ని బ్యేక్ గ్రౌండ్ మ్యూజిక్స్ వినిపిస్తాయి (శుభంగా సుప్రభాతం కూడా) ఓపిక లేని వారు Fast Forward చెయ్యండి

Saturday, 30 July 2011

చావు - సెక్స్- హింస - డబ్బు : అంతా ఒక్కటే


చావు - సెక్స్- హింస - డబ్బు : అంతా ఒక్కటే. ఈ సత్యాన్ని తెలుసుకున్నవారు చాలా తీలిగ్గా డబ్బు సంపాదించగలరు. కనీశం తాము ఎందుకు సంపాదించ లేక పోయారో - అది ఎంత మంచిదైందో తెలుసుకుని ఆనందిస్తారు. నిజానికి డబ్బు సంపాదించే వారంతా చావు మీది భయంతో చావుకేసి పరుగులు తీసే వారే. సెక్స్ దొరక్క - తాము దొరకనిదేమో తెలీక డబ్బు వెంట పరుగులు తీసే వారే. తిన పోతూ రుచి గురించి చెప్పడం దేనికి. ఈ నగ్న సత్యాలన్నింటిని ఆడియో ఫైలుగా మీకు వడ్డించాను.(Look at just below the header image) ఆనందించండి.

Monday, 17 January 2011

డబ్బుతో ఏం కొంటున్నాం ? ఎందుకు?

పప్పు ,ఉప్పు,భియ్యం కొంటాం !
ఎందుకు తినకుంటే చచ్చి పోతామా ? నేను 10 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసాను. మొదటి రోజైతే భాగా ఆకలైంది. రెండో రోజునుండి ఆకలి శుద్దంగా లేదు.. మళ్ళీ ఐదో రోజో ఆరో రోజో కాస్త ఆకలైంది. పదవ రోజుదాకా ఆకలంటే ఏమో కూడ మరిచి పోయాను.

మరి ఎందుకు తింటున్నాం ? రోజూ తింటున్నాం. మూడు పూట్ల తింటున్నాం. వండి,ఉడక పెట్టి,వేంచి,తాలింపు చేసి, తింటాం.

మూడు పూటలు తింటున్నాం. ఇది చాలక స్నేక్స్,ఐస్ క్రీం . బ్రతకడానికి తింటున్నామా ? లేక తిని తిని చావడానికి తింటున్నామా ? బహుసా బతకడానికి అన్న ముసుగులో చావడానికే తింటున్నామేమో ?

మరి చావడానికేనా డబ్బు ? చావడానికేనా డబ్బు సంపాదిస్తున్నాం ?

బాడుగలు కడుతున్నాం / లేదా హవుసింగ్ లోన్ వాయిదాలు కడుతున్నాం:
ఏ మాత్రం గాలి ఆడని, సూర్య చంద్రుల వెలుతురు తొంగి చూడని , ఇళ్ళకు వేలాది రూపాయలు బాడుగలు కడుతున్నాం. కొన్ని బాడుగ ఇళ్ళల్లో అయితే గేట్ బీగాలు ఇంటి ఓనర్ వద్ద ఉంటుంది. రాత్రి పదికంతా గేట్ లాక్ చేస్తారు. మీరు ఇల్లు చేరడానికి రాత్రి పదై పోతే మీ బతుకు బస్ స్టాండే ! ఇలా ఒకటి కాదు రెండు కాదు సవా లక్షా ఉన్నాయి

ఇక స్వంత ఇల్లు నిర్మించిన వారి కథ చూస్తే జీవిత కాలపు పొదుపును దార పోసి జీవిత కాలపు అప్పులతో , అడ్డమైన పన్నులు కడుతూ ఉన్నారు, ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?

కరెంటు బిల్లులు కడుతున్నాం:
ఎప్పుడుంటుందో, ఎప్పుడు పోతుందో తెలీదు. మిక్సీలు,గ్రైండర్లు,ఎలక్ట్రిక్ కుక్కర్లు పని చెయ్యడంతో మన ఇంట్లోని స్త్ర్రీలు బొత్తిగా పని చెయ్యక స్థూల కాయులై, బి.పి, షుగర్ వ్యాదులకు గురవుతూ చచ్చు టి.వి.సీరియళ్ల మద్యలో వచ్చే అడ్వర్టైజ్ మెంట్ గ్యేపుల్లో అన్నం పెడుతుంటారు అయినా సంపాదిస్తూనే ఉన్నాం కరెంటు బిల్లులు కడ్తూనే ఉన్నాం. ఇందులో మరో మెలిక ఏమంటే ఆఖరు తేది దాటితే యాభై రూపాయల ఫైన్ తో కూడ కడుతున్నాం. ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?

మొబైల్ ఫోన్స్ కొంటున్నాం ఫోన్ బిల్లులు కడుతున్నాం:
ఆ ఫోన్ ఏం చేస్తుంది ? ఈ ప్రపంచముతో మనలను అనుసందానం చేస్తుంది ప్రకటనలు చేస్తే కొన్నాం. కేవలం పిచ్చుకలు సైతం తట్టుకోని వేవ్స్ వెదజల్లే టవర్లు వెలిసాయి. పట్టణ పరిదిలో ఒక మంచి వాడిని చూపగలరేమో గాని ఒ క్క పిచ్చుకను సైతం మీరు చూపలేరు.ఒకే.మొబైల్ ఫోన్ మనలను ప్రపంచంతో అనుసందానం చేస్తుందట. నిజంగా..నిజంగా అది అనుసందానం చేసేది ప్రపంచముతోనా ? కాదే ఎంత బిజిగా ఉండే ఏ మొబైలరునన్నా తీసుకొండి. అతనితో నిత్యం అనుసందించబడి ఉన్న కాలర్స్ ను వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు.
పోనీ ఆ అనుసందానమన్నా ఆనందాన్ని ఇస్తుందా ? లేదే..............రకరకాలైన ఇబ్బందులు
టూ వీలర్లకు పెట్రోలు కొట్టిస్తాం:
పొల్యూషన్ ..........ఏయిర్ పొల్యూషన్ ,సౌండ్ పొల్యూషన్,ప్రమాదం జరిగే ప్రమాదం
పిల్లల స్కూలు ఫీజులు , ట్యూషన్ ఫీజులు కడుతున్నాం:
పిల్లలను ఇపరీతంగా కొడుతున్నారని,మానసికంగా హింసించగా పిల్లలు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని,లైంగిక వేదింపులకు గురి చేస్తున్నారని పత్రికల్లో చదువుతూనే ఉన్నాం. పిల్లలక్ విపరీతమైన మానసిక వత్తిడినిచ్చే విద్యను వారిపై రుద్దుతున్నాం. టేప్ రెకార్డర్లు వచ్చి ఎంతో కాలమైనా పిల్లల మస్తిష్కాలను కేవలం రికార్డర్లుగా మార్చుతున్నాం
ఇలా ఒకటి కాదు రెండు సవా లక్షా ఖర్చులు పెడుతున్నాం . ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?
పొదుపు:
ఇవి చాలక మనలో చాలా మంది పొదుపు కూడ చేస్తుంటాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో అయితే సర్వీసు బెటరుగా ఉండదని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల్లొ అధిక వడ్డికి ఆశ పడి పెట్టి గోచీ సైతం ఊడిపోతుంది.
పోని నేష్నలైజ్డ్ బ్యాంకుల్లో మన డబ్బు దాచుకుంటామనుకుంటే వారు ఏ.టి.ఎం.ల ద్వారా నకిలీ నోట్లు సరఫరా చేస్తున్నారు. షేర్ మార్కెట్ లోనే పెట్టుబడి పెడితే ఎవడో బాత్ రూంలో కాలు జారి పడినా, మరి ఇంకెవడో తాగి పడిపోయినా షేర్ మార్కెట్ కుప్ప కూలి పోతుంది ఎందుకొచ్చిన గొడవా అని మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే ,ఎల్.ఐ.సి ప్రిమియం కట్టుకుంటే వారు సైతం షేర్ మార్కెట్ లో మన సొమ్ము పెట్టి మన జీవితాలను జూదం చేస్తున్నారు. మరి మన సంపాదనలు బతకడానికా చావడానికా?

ఏ రోజన్నా మన డబ్బును కేవలం మన ఆత్మ సంతృప్తి కోసం ఖర్చు పెట్టామా? లేదు.. ప్రతి రూపాయి సమాజం కోసం ఐ మీన్ సమాజం దృష్ఠిలో దిగజారి పోకుండా ఉండేందుకు ,ఇతరులు మనలను తక్కువ అంచనా వేయకుండేందుకే ఖర్చు పెడుతూ వస్తున్నాం.

మనం ఎంతకాలం ఎన్ని విదాలుగా ఖర్చు పెట్టినా ఏదో రోజు,ఏదో క్షణం మన శ్రమంతా వృధా చేసిన ఫీలింగే కలుగుతూంది. అయినా వృధా చేస్తూనే ఉన్నాం.

మరి ఆ డబ్బును ఎలా సంపాదిస్తున్నాం ఆ డబ్బేదో మనలను ఉద్దరిస్తుందని, మనలను మనవారిని సంతోష పెడుతుందని భావించి సంపాదిస్తాం. మరీ మన వ్యక్తిత్వం,ఆత్మ గౌరవం, మాతృ భూమి,మాతృ భాష ఇలా ఒకటికాదు అన్నింటిని మరిచి ,తుడిచి పెట్టి సంపాదిస్తున్నాం.

ఏదో క్షణం "తూ ..నా బతుకు" అనిపించినా మరుక్షణం అదే తంతు. ఒక్క సారి పునరాలోచిద్దాం. మన ఆలోచనలను పరిశీలిద్దాం. మన సంపాదనా మార్గాలను, సంపాదనను వెచ్చించే మార్గాలను సమీక్షిద్దాం.

ఏ డెబ్బై ఏళ్ళ వయస్సుకో - మరణ శయ్య మీదో ఆలోచించినా నిర్ణయం తీసుకున్నా క్రిమినల్ వేస్ట్..

ప్లాస్టిక్,ఎలక్ట్ర్రానిక్ చెత్తల మీద మోజుతో  గడ్డిని ,ఆ గడ్డి పై కిరణ్ ప్రభుత్వంలా వనుకుతూ కనిపించే నీటి భింధువును, దానిలో నిక్షిప్తమై ఉన్న సమస్త సృష్ఠిని ఎప్పుడు దర్శిస్తాం!

Tuesday, 21 December 2010

మరణం -మైథునం -దనం

ప్రజా జీవితంలో అవినీతి:

పిల్లాడు ఏడుస్తె వెంటనే వాడికి ఏదో తాయిలం పెట్టి ఏడుపు మానిపిస్తారు తల్లి తండ్రులు.అవినీతి అన్నది ఇక్కడే ప్రారరంభం అవుతుంది. వాడు ఎందుకు ఏడ్చాడు? వాడలా ఏడవడం  మంచా? చెడ్డా?కూడ ఆలోచించరు . పిల్లాడు ఊరుకుంటాడు. ఇది వివాహ సమయంలో  కాశియాత్రకు బయలు దేరే అల్లుడికి ఇచ్చే కట్న కానుకలదాకా వెళ్తుంది.

వివేకానందుడేమో నీ మనస్సుకన్నా గొప్ప వస్తువు ఈ  భూప్రపంచం మీద లేదు. ఒకవేళ ఏదైన వస్తువు గొప్పదనిపిస్తే నీ మనస్సు బలహీనంగా ఉందని అర్థం అన్నాడు. అవినీతికి ప్రప్రథమ కారణం అవినీతి పరుల మానసిక దౌర్భల్యమే.

పైగా మానవులు ఏంచేసినా వారిని ఆ చర్యలకు ప్రేరేపించింది వారిలోనే చంపే లేదా చచ్చే కోరికలే అని సైకాలజి చెబుతూంది. అవినీతికి పాల్పడే వాడికి తెలియదా తన అవినీతితో జనులు చస్తారని? అతనికి తెలియదా ఏదో రోజు తన గుట్టు రట్టైతే తాను చస్తాడని. తెలుసు అయినా ఎందుకు అవినీతికి పాల్పడతారు? చచ్చే చంపే కోరికలు.

అసలు ఈ కోరికలకు కారణం ఏది? ఈ సమస్త జీవకోటికి మూలం అమీభా.ఏక కణ జీవి .అది  భాగా  బలిసి పోవడం వలన   సెల్ కాపియింగ్ ద్వారా ఒకటి రెండై,రెండు నాలుగైంది. కాపియింగ్లో జరిగిన ఎర్రర్ కారణంగా కొత్త జీవరాశులు. కోతి. కోతినుండి మానవుడు.

అనాడు ఒకే శరీరం -ఒకే కణం -ఒకే ప్రాణంగా ఉన్నప్పుడు ఏ సమస్యా లేదు. కాలం -దూరం-అబద్రత-కమ్యూనికేషన్ సమస్య ఏదీ లేదు. ఆ అది కణంలోని ఈ తియ్యటి స్మృతులు సెల్ కాపియింగ్ ద్వారా కణానికి కణానికి మార్పిడి అయ్యి ప్రతి మానవ మస్తిష్కంలో అట్టడుగు పొరల్లో దాగి ఉంది.

మళ్ళీ ఆ స్థితిని పొందాలంటే ఈ శరీరాన్ని త్యజించాలి. అందుకే ఈ చంపే చచ్చే కోరికలు. ఆఠవిక జీవితంలో ప్రత్యక్షంగా జరిగింది - ఆపై సెక్సులో సాధ్యమైంది- నాగరికత -సంస్కృతి పేరిట సెక్స్ ఇంచు మించు నిషేదింప పడ్డాక డబ్బుతో సాధ్యమవుతూంది.

స్థూలంగా చూస్తేనే మరణం -మైథునం (సెక్స్) -దనం ఇవన్ని వేర్వేరుగా కనిపిస్తాయి. కాని కాస్త లోతుగా ఆలోచిస్తే ఇవన్ని ఒకే విదమైన సంత్రుప్తిని మానవునికి ఇస్తాయి. అది మరేది కాదు అతనిలోని చంపే చచ్చే కోరికను సంతృప్తి పరచడం.

నిజానికి ఒక కణం రెండు కణాలుగా మారినప్పటికి రెండు నాలుగై, నాలుగు పదహారై కాపియింగ్ ఎర్రర్ కారణంగా కొత్త జీవరాశులు -కోతి -మానవుడు దాక వచ్చినప్పటికి మనమందరం ఏదో విదంగా అనుసందింప పడి ఉన్నాం.

మన శరీరాలను సెల్ ఫోన్స్ అనుకొండి. మన ఆత్మలను సిమ్ కార్డ్స్ అనుకొండి. సెల్ ఫోన్ ఏ మేక్ అయినా ,దాని లోపల ఉన్న సిమ్ ఏ నెట్వర్కు సంభంధించినదైనా వాటన్నింటిని సేటిలైట్ నుండి వచ్చే తరంగాలు అనుసందిస్తాయి.

ఇదే విదంగా మనమందరం ఏదో విదంగా,మరేదో పద్దతిలో అనుసందింప పడి యున్నాం. ఈ అనుసందానాన్ని మనం గుర్తెరగక పోవడానికి కారణం మనం గొప్పగా కొనియాడే వ్యక్తిత్వం (సెల్ఫ్) పచ్చిగా చెబితే అహం.

నిజానికి మనమందరం ఈ సృష్ఠి వలయంలో భాగస్వాములం. దీనిని ఒక మానవ హారంగా భావిస్తే ఇందులో ఏ ఒక్కరు అనుసందానాన్ని కాదనుకుని చెయ్యి ముడుచుకున్నా లింక్ గోవిందా.

ఈ చిన్న సత్యాన్ని అర్థం చేసుకోక విడిపోయాం అనుకోవడం -మళ్ళీ కలవాలనుకోవడం - అందుకు ఈ శరీరాలే అడ్డనుకోవడం- అందుకు కాను చంపుకోవడం -చావడం -స్థూలంగా చెయ్య లేక సెక్సుద్వారా వీర్య స్కలన సమయాన కలిగే ఆ బ్లాక్ అవుట్ అనే బుల్లి మరణం కోసం తపించడం - లేదా బోలెడన్ని స్త్ర్రీలతో సెక్సు చేసుకోవచ్చు కదా అని డబ్బు వెంట బడటం- అందుకోసం అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకోవడం ఇవన్ని మూర్ఖత్వాలేగా.

మనిషి అవినీతికి పాల్పడ కూడదంటే అందుకున్న మార్గాలివి:

* అతను ఈ సృష్ఠిలో ఏకాకి కాదని కొత్తగా సాటి జీవులతో అనుసందానం కావల్సిన పని లేదని ఇప్పటికే అనుసందించ బడి ఉన్నాడని అతనికి అనుభవమయ్యేలా చూడటం (ద్యానం)

*చంపుకొండి చావండి అని వదిలెయ్యడం

*  సెక్సు పై ఉన్న నిషేదాజ్నలను ఎత్తి వేసి వీర్య స్కలన సమయాన పొందే బుల్లి మరణాన్ని పొందేలా చూడటం. ఇది పురుషుల విషయంలో యదేచ్చగా జరిగిపోవచ్చు (వీర్య స్కలనం) కాని స్త్ర్రీల విషయంలొ ఇది సాధ్యం కావాలంటే ఆమె సైతం భావప్రాప్తి పొందాలి . అందుకు సెక్స్ ఎజుకేషన్ అత్యవసరం.( జీవుల అనుసందానం కనీశం శారీరకంగానైనా ..కొంత సమయానికైనా సాధ్యమయ్యే అవకాశం కూడ ఉంది మరి)

ఈ మూడింట ఏదో ఒకటి సాధ్యమైతే మనిషి డబ్బును కేవలం డబ్బుగా చూస్తాడు. డబ్బు గురించిన భ్రమలనుండి విముక్తుడవుతాడు. అవినీతి తనంతట తనే మటుమాయం అవుతుంది.

( వీక్ ఎండ్ పొలిటీషియన్ గారూ.. మీ కోసమే ఈటపా : ఇందాక చెప్పినవి మీకు చికాకు కలిగించి ఉండవచ్చు - కాని ఇదే అసలు సిసలైన శాస్వత పరిష్కారం. కావాలంటే మీ కోసం తదుపరి టపాలో తాత్కాలిక పరిష్కారంగా కొన్ని అంశాలను ప్రతిపాదిస్తాను)

Wednesday, 1 December 2010

సంపాదన మార్గాలు: 4

సంపాదన గురించిన న గత టపాలను చదివి ఎంత మంది స్ఫూర్తి పోందారో తెలీదు గాని నాకు మాత్రం ఈ టపాలు ఒక రివిషన్లా పనికొస్తున్నాయి.  నేను ఎంతటి దుర్బర జీవితం గడిపానో చెప్పినా నమ్మ లేరు. పొట్ట చేత పట్టి బతికినా నా లక్ష్యాన్ని మాత్రం జార విడువలేదు.

నా దృష్ఠిలో నా లక్ష్యం ఒక గమ్యం. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి నాకు డబ్బు కావాలి. అందుకే నేను సంపాదన మార్గాలను అన్వేషించాను. కేవలం సంపాదనే నా ద్యేయం అనుకును ఉంటే ఇంతకాలం వేచి ఉండాల్సిన అవసరమే లేదు.

నా బోటి జ్యోతిష్కులు ఎంతో మంది లక్షలు లక్షలు సంపాదించేరు. కాని నా లక్ష్యం సంపాదనకాదు. నా లక్ష్యం నా దేశాన్ని సంపన్న దేశంగా మార్చటమే. అందుకని ఒక పథకం రూపొందించాను, ఆ పథకాన్ని పాలకుల దృష్ఠికి తీసుకెళ్ళటానికి నాకు డబ్బు అవసరమైంది. సంపాదన మార్గాలు అన్వేషించాను. కనుగొన్నాను. వాటినే మీతో పంచుకుంటున్నాను.

జ్యోతిష్యం మీద సంపాదించడం, మరీ కంప్యూటర్ నాలెడ్జ్, బ్రాడ్ బ్యాండ్ కనెక్శన్ కలిగి ఉన్న  నాలాంటి  బహు బాషా కోవిదునికి ఎంత తేలికో మీకు తెలుసు. కాని నేను జ్యోతిష్యంలోని లొసుగులను నిత్యం భయిట పెడుతూ అహేతుక అంశాలన్ దుయ్యపడుతూ వచ్చాను.

అదేం మాయో తెలీదుగాని నేను వేసుకున్న సేమ్ సైడ్ గోల్స్ నా విశ్వసనీయతను మరింత పెంచాయి. గతంలో అదనపు ఆదాయ మార్గంగా ఉన్న ఆన్ లైన్ జ్యోతిష్య సలహా ఇప్పుడు నా ముఖ్య ఆదాయ మార్గాల్లో ఒకటిగా మారింది. ఇది నా గొప్పతనం కాదు. జ్యోతిష్యంయొక్క గొప్పదనం. నిజాయితి యొక్క గొప్పదనం.

యండమూరి వీరేంథ్ర నాద్ లాగా నాలుగు విదేశీ పుస్తకాలు చదివి ఒక స్వదేశీ పుస్తకం వ్రాయడం నాకు చేతకాదు. నా పుట్టుకే అంతా. ఏదైనా సరే నాకు గురి కుదిరితే గాని అస్సల్ పట్టించుకోను. డబ్బును నాకన్నా నీచంగా విమర్శించినవారూ ఉండరు. నేడు నాలా కీర్తించేవారూ ఉండరు. నా అభిప్రాయాలు అంత తేలికగా మారవు. మారితే అది అనుభవంతోనే మారాలి.

నేను సైతం ఒక సినిమా ప్రేక్షకుడను. నాకు , నా బుర్రకు నేటివిటి మరీ ముఖ్యం. నేటివిటి లేకుంటే ఎంత గొప్ప విషయమన్నా సరే  నా బుర్రలో నో అడ్మిషన్ బోర్డే కనిపిస్తుంది. నేను నా మైండ్లోనుండి డైరక్టుగా టైప్ చెయ్యగలను గాని మరి దేనినైనా చూసి టైప్ చెయ్యలేను. నా పుట్టుకే అంతా కక్కిన కూడు, సద్ది మూటలు నాకు పనికి రావు. నేను ఆకలిలో ఉన్న పులిని నాకు నేనై వేటాడుతాను.

నా మైండ్లో ఒక పాయింటు నిలబడాలంటే అది మరీ గొప్ప అంశమై ఉండాలి. నాకు పుస్తకాలు చదవడమన్నది మందు బాబులకు మందులాంటిది. మంచి పుస్తకాలు దొరకనప్పుడు చెత్త పుస్తకాలు సైతం చదువుతా. కాని అవేమి నా బుర్రలో నిలవవు.

సొంత సోది సరిగాని సంపాదన పాయింటుకు రండి బాబు.. అంటున్నారు. వినబడుతూంది.వస్తున్నా.పాయింటుకే వస్తున్నా. మనిషికి శరీరం,మనస్సు,బుద్ది అంటూ నాలుగు అంశాలున్నాయి. ఇవి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. వీటిని సంపాదనకు అనువుగా మలుచుకో కలిగితే సంపాదన చాలా తేలిక.

కవితకేదీ కాదు అనర్హం అన్నట్టుగా సంపాదనకు సైతం ఏది కాదు అనర్హం. ఒక సారి నా ఫ్రెండ్ ఒకతను ( గోల్డ్ స్మిత్) తన పాత స్కూటరును తుక్కు క్రింద తూకానికి అమ్మి వేసే ఏర్పాటు చెయ్యమన్నాడు. సరేనని మా ఇంట తోసి ఉంచాను. మా ఇంటి పని మనిష్ తన మొగునికోసం కొనుక్కోవాలనుకుంది. మెకానిక్ ఒకతనిని తీసుకొచ్చు వ్యేల్యూ వేసుకోమన్నాను. అలానే చేసింది. రెండు వేలిస్తానంది. సరేనన్నాను.

నేను కాటా తెప్పించి తూకం చూసుకున్నాను. పాత ఇనుము కేజి ఎంతకు పోతుందో కనుగొన్నాను. మార్కెట్ దరకైతే ఐదొందలు పోతుందని తేలింది. పని మనిషి వద్ద రెండు వేలు తీసుకుని ఫ్రెండ్ వద్దకు వెళ్ళి తూకం, ఇనుము దర చెప్పి ఐదొందలు అతనికిచ్చాను.

"ఆర్ యు సేటిస్ఫడ్ ?" అన్నాను

" కాదా మరి"  అంటూ డబ్బు తీసుకున్నాడు.

 అదనంగా మరో ఐదొందలొస్తే ? అన్నాను

" చాలా సంతోషం కదా మరి " అన్నాడు

మరో ఐదొందలు అతని చేతికిచ్చి అసలు విషయం చెప్పాను. దిమ్మ తిరిగి పోయి నన్ను ఎంతగానో మెచ్చుకున్నాడు.

( కవులంటే మురికి పంచ, జుబ్బా, సోడా బుడ్డి అద్దంతో సదా సర్వకాలం అనవసర పెగ్గితో,భావిలో కప్పల్లా, పేదరికంలో నలుగుతుంటారని అతని ఫీలింగ్. అందుకు భిన్నంగా నేను ప్రవర్తించడంతో ఆనందించాడు .అతనో మంచి వ్యాపారి కాబట్టి)

ఈ చిన్న సంఘఠనలో చాలా విషయాలు దాగి ఉన్నాయి.

మన పని మనం కూర్చున్న చోటే అయిపోవాలనుకుంటే మనం కొంత నష్ఠ పోవలసి వస్తుంది ( నా ఫ్రెండులా)

ఎవరి పనైనా సరే తిరిగి చేద్దామనుకుంటే కొంత లాభ పడే అవకాశం ఉంటుంది నాలా?

ఒకే వస్తువుయొక్క మతింపు మీ భావాన్ని పట్టి మారిపోతుంది. అతను తుక్కు అనుకున్నాడు. నా దృష్ఠిలో అది స్కూటర్లానే కనిపించింది.

స్క్ర్రాబ్ అంగడి అతని వద్దకు తీసుకెళ్ళి ఉంటే తుక్కు క్రిందే చూసి ఉంటాడు. మా ఇంటి పని మనిషి చూసింది కాబట్టి అది స్కూటర్లా కనిపించింది.

ఇన్ని అంశాలు అనుకూలించినా ఐదొందలు ఫ్రెండు మొఖాన పడెయ్యకుండా నిజం ఎందుకు చెప్పాలి అని మీరు ప్రశ్నించవచ్చు.

అతని స్కూటరు ఏదో రోజు రోడ్డు మీద తిరుగుతూ కనిపిస్తుంది. ఒక వేళ అతను మా పని మనిషిని/ఆమె భర్తను  ప్రశ్నించి నిజం తెలిసొస్తే అతను నా గురించి ఏమనుకుంటాడు? నేనతనిని మోసగించాననే అనుకుంటాడు. పైగా నాకు దూరమవుతాడు.పైగా నా గురించి దుష్ప్రచారం చేస్తాడు. ఇదో కోణం.

అతను ఒక సోమరి. అతని వద్దనుండి ఇటువంటి ఆఫర్లే మరిన్ని వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని నేనెందుకు పోగొట్టుకోవాలి. భవిష్యత్ లాభం కోసం వర్థమానంలో కొద్దిగా నష్ఠపోవడంలో తప్పు లేదుగా?

ఈనాటి కొత్త వ్యాపారం:

ఇందుకు కావలసింది ప్రజల దైనందిన జీవితంలో రాగల చిన్న చిన్న  సమస్యల గురించిన అవగాహణ -వాటికి పరిష్కారాలు -వాటిని అందించ గల టెక్నీషియన్స్, సమర్థులు, అనుభవజ్ణుల గ్రూపు. ( వీరు మన ఆఫీసులో పడికాపులు కాయాల్సిన పని లేదు.. మనం సమాచారం అందించినప్పుడు మన క్లెయింట్స్ వద్దకు చేరుకుని సేవలందించే వీలుకలిగి ఉంటే చాలు)

ఉ: ఇంటి తాళం పోయినప్పుడు/ ఫ్యూజు పోతే / ప్యేన్ ,ట్యూబ్ లైట్ ఫిటింగ్/ టూ వీలర్ సగం దారిలో నిలిచి పోతే/ ఇలా కో కొల్లలు సమస్యలు వస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా లిస్ట్ అవుట్ చేసుకుని వీటిని పరిష్కరించ గల ,మనకు అందుబాటులో ఉండగల సమర్థులను సమకూర్చుకోవడం. అడ్వర్టైజ్ చెయ్యడం. క్లెయింట్స్ సంపూర్ణ సంతృప్తి చెందేలా పని చేయడం,చెయ్యించడం

Sunday, 28 November 2010

సంపాదన మార్గాలు: 3

ఈ సీరియల్ మొదలు పెట్టి రెండో ఎపిసోడ్ మీద ఒక అనానిమస్ రెస్పాండ్ అవుతూ నువ్వెంత సంపాదించావని ప్రశ్నించేరు. ఈ ప్రశ్నకు సమాదానం చివరన చెబుతాను. ఇక్కడ నేను చెప్పే విషయాలు మీకే పుస్తకంలోను దొరకదు. ఇవన్నింటిని నెను కనీశం పదహారు సం.లు మరియు కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి తెలుసుకున్నవి. వాటిని మీకు పైసా ఖర్చు లేకుండా అందిస్తున్నాను. నా నిభందన గుర్తుందిగా నేను సూచించే సరి కొత్త ఆలోచనలను  ఈ సైట్ చూసి అమలు చేసేవారు, తమ విజిటింగ్ కార్డులో స్ఫూర్తి :www.sambargaadu.blogspot.com అని ముద్రించుకోవాలంతే.

సంపాదనలో మనం విఫలమ్మవడానికి అతి కీలకమైన కారణం ఒకటుంది. వ్యయ,అదాయాల్లో రెవిన్యూ,క్యేపిటల్ అంటూ రెండు ఉంటాయి.

మీకు ఇట్టే అర్థం కావడం కోసం తమాషాగా చెబుతా. మీరు కోడి కొన్నారనుకొండి అది క్యేపిటల్ వ్యయం. గుడ్డు కొన్నారనుకొండి అది రెవిన్యూ వ్యయం. మీరు కోళ్ళు పెంచుతున్నారు. కోడి అమ్మి డబ్బులొస్తే అది క్యేపిటల్ ఆదాయం. గుడ్దు అమ్మి డబ్బులొచ్చాయనుకొండి అది రెవిన్యూ ఆదాయం.

ప్రతి ఒక్కరికి పెద్ద మొత్తంలో సంపాదించాలన్న కుతకుతలు ఉంటాయి. ఆ ఉద్దేశంతో క్యేపిటల్ ఆదాయంలో నుండి ఇష్థమొచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ పోతే రెవిన్యూ ఆదాయం క్రమేనా తగ్గి  గుండు సున్నగా తయారవుతుంది. ( ఈ పొరభాటు కూడ చేసాను నా రోజు వారి ఆదాయాన్ని గొప్ప దూరదృష్ఠితో సుదూరపు కలల సాకారం కోసం వెచ్చిస్తూ వచ్చాను)

అలానే రెవిన్యూ ఆదాయంలో నుండి పైసా కూడ ఖర్చులు పెట్టుకోకుండా వాటిని క్యేపిటల్ వ్యయాలకు మళ్ళిస్తూ రావడం కూడ మంచిది కాదు. ( నేనీ పొరభాటు చేసే గతంలో సంపాదించిన సొమ్మును ఒక్క సారిగా పోగిట్టుకున్నాను - గ్లూకోజ్ వ్యాపారం చేసానోచ్- ఈ వివరాలు మరో సందర్భంలో చూద్దాం).

పెద్ద మొత్తంలో సంపాదించాలనుకోవడం తప్పు కాదు. కాని దానికని ఒక వ్యూహం రచించుకొని వన్ స్టెప్ అట్ వన్ మూవ్ మెంట్ తరహాలొ ముందుకు సాగాలి.

పైగా పె.మొ.ఆ విషయంలో ఈ రోజు అయిపోతుంది,రేపు అయిపోతుందని ఆతృత పడ కూడదు. టూ వీలర్ వేగానికి,  ఫోర్ వీలర్  వేగానికి, కంటెయినర్ వేగానికి తేడా ఉంటుందిగా? పె.మొ.ఆదాయమన్నది కంటెయినర్ వంటిది. ఏ మలుపులోనన్నా చిక్కుకు పోవచ్చు.

అది మన గుమ్మం దాక వచ్చి చేరే వరకు పస్తు ఉండాల్సిన అవసరం లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్ ఉండాలి. లేకుంటే కంటెయినర్లో సరుకును , అది చిక్కుకున్న మలుపులోనే సగం దరకే విక్రయించవలసిన పరిస్థితి వస్తుంది.

సంపాదన మాటకొస్తే ప్రతి ఒకరు జీవితంలో ఏదో సందర్భంలో సంపాదిస్తారు. కాని ఆ సందర్భం మినహాయించి అన్ని సందర్భాల్లోను ఆర్థిక అటు పోట్లతో సతమతం అవుతుంటారు. సంపాదన ప్రక్రియ అన్నది ప్రతి రోజూ కొనసాగాలి. ఆ ప్రక్రియ ప్రతి సెకను కొనసాగాలి. అదే అసలు సిసలైన సంపాదన.

పోనీ ఈ రోజుకి ఈ చిట్కా చాలనుకుంటా ఇదివరకే నెను హామి ఇచ్చినట్టుగా ఒక కొత్త వ్యాపారం గురించిన రూట్ మ్యేప్:

సిటి ఇన్ఫర్మేషన్ సెంటర్

ఇందుకు కావల్సింది ఒక ఫోను, చిన్న గది, పదహారు గంటలూ ఫోన్ అటెండ్ చెయ్యడానికి మనుషులు. వధూ వరుల సమాచారం నుండి, టు లెట్ సమాచారం దాక, ఫ్లాట్స్, ప్లాట్స్, ఇంటి స్థలం నుండి పాత కాలేజి పుస్తకాలదాక ఏ సమాచారాన్ని అయినా స్వీకరించి వర్గీకరించి వీలుంటే ఒక కంప్యూటర్లో గాని ,లెడ్జర్స్ లో గాని దాచుకోవాలి. సమాచారం ఇచ్చేవారి వద్ద ఎటువంటి ఫీజు వసూలించ రాదు.సమాచారం కోరే వారి వద్ద మాత్రమే ఫీజు వసూలు చెయ్యాలి.( మూడు నెలల దాక)

వ్యాపారం బాగా పుంజుకున్నాక సమాచారం ఇచ్చేవారి వద్ద నుండు పది, ఇరవై రూపాయలు, సమాచారం కోరేవారి వద్దనుండి యాబై రూపాయలు స్వీకరించవచ్చు. కొందరు సదా సర్వ కాలం సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, కొందరి సదా సర్వకాలం సమాచారం అవసరమవుతుంటుంది.

ఇట్లాంటి వారికోసం నెలవారి రుసుము కూడ పరిచయం చెయ్యొచ్చు

ఓకే బ్రదర్స్.. తదుపరి టపాలో మరిన్ని చిట్కాలు, మరో కొత్త సంపాదన మార్గాన్ని చూద్దాం

Saturday, 27 November 2010

సంపాదనకు మార్గాలు:2

సంపాదనకు మార్గాలు:2

(బాసూ నిజంగానే ఈ టపాలో సంపాదన మార్గం ఒకతి చూపాను - మీరు సంపాదించాలంటే మీ చుట్టూ ఉన్నవారు కూద సంపాదిస్తూ ఉండాలి. కాబత్తి పక్కనే ఉన్న ట్విటర్ బటన్ నొక్కి మీ ఫ్రెండ్స్ తో పంచుకొండి)


సంపాదనలో మనం సక్సెస్ కావాలంటే మనకు డబ్బుతో అవసరం ఉండ కూడదు.( అవసరం ఆలోచించుకోనీయదు) లేని పోని కలలు,ఊహలు ఉండ కూడదు. మీకు కావలసింది డబ్బె అన్నప్పుడు ఎటువంటి ఆందోళనకూ అవసరం లేదు.

ఎందుకంటే ప్రతి ఒకరివద్దా డబ్బుంది. అంటే అది డబ్బుగా లేక పోవచ్చు.కాని డబ్బుగా మలుచుకోగల ఏదో ఒకటుంది.అదేమని గుర్తించ గలిగితే డబ్బు సంపాదించవచ్చు. దానిని గుర్తించడానికి కొంత కాలం పడుతుంది. సహజంగా మానవుని మస్తిష్కంలోని అహం  కారణంగా చాలా సార్లు తప్పు ద్రోవ పడుతుంటాడు. మరీ టీన్ ఏజిలో ఇది సర్వ సహజం.

నేను బ్రాహ్మణేతర కులంలో పుట్టినప్పటికి నా జాతకప్రకారం నేను బ్రాహ్మణుడి వలే బ్రతకాలి ఇది నా రాత. కాని టీన్ ఏజిలో నేను చిరంజీవి అభిమానిని. చిరంజీవిలా బాడి బిల్డప్ చెయ్యాలని డాన్స్ చెయ్యాలని,డైలాగ్  చెప్పాలని ఉవ్విళ్ళూరేవాడ్ని.

టీన్ ఏజిలో సర్వదా మీ మనస్సు తప్పుడు దిక్కుకేసి లాగుతుంటుంది. (యవ్వనం, అంగ బలం,  యధార్థం తెలీక పోవడం,భవిష్యత్ పై విశ్వాసం తదితర కారణాల వలన మీ అహం ఉచ్చంలో ఉంటుంది కాబట్టి) మిమ్మల్ని ఏరంగం తీవ్రంగా ఆకర్షిస్తుందో అది మీ రంగం కాదని ఇట్టే నిర్ణయించుకోవచ్చు.

మీ రంగం ఏదో గుర్తిస్తే అదే సంపాదన ప్రయత్నంలో సగం విజయం సాదించినట్టే. 1987లో విద్య పూర్తి చేసుకున్న నాకు నా రంగం ఇదని డిసైడ్ చేసుకోవడానికి రెండు సం.లు పట్టింది.. అయినా చంచలం కారణంగా అప్పుడప్పుడు నా రంగం కాని రంగాల్లో  వేలు పెట్టి చెయ్యి కాల్చుకునే వాడ్ని.

మరీ మీకు తెల్ల కాకి అవసరమంటే టెన్షన్ పడాలే గాని డబ్బు కావాలంటే గాబరా పడాల్సిన అవసరం లేదు. డబ్బు అందరిదగ్గరా ఉంది.డబ్బుగానే ఉంది. వారికి ఎన్నో అవసరాలుంటాయి. ఎన్నో సేవలు అవసరమవుతాయి. వాటిలో ఏదో ఒకదానిని నెరవేర్చే సత్తా,  నైపుణ్యం మీకుంటే చాలు ఇట్టే డబ్బు సంపాదించవచ్చు.

నేనిదివరకే వ్రాసిన మని సీక్రెట్స్ ఏ పుస్తకంలోనో దొరికింది కాదు. శుక్రవారం బిక్షకులు షాప్ టు షాప్ ఎక్కి దిగుతూ చిల్లర డబ్బులు సేకరించినట్టు నా చుట్టూ ఉన్నవారినుండి సేకరించాను. మరీ వారి ప్రవర్తనల్లో నుండి డైరక్టుగా ఈ సీక్రెట్స్ నేర్చుకోలేదు. వారు నెగటివ్ గా ప్రవర్తించి "షెడ్" ( దివాళా తీయడం) అయి పోతే వారు నేర్చుకున్నారో లేదో నేను నేర్చుకున్నా గుణ పాఠాలు.

తొలూత నేను సైతం జీసస్ బైబుల్లో పేర్కొన్న పక్షుల్లాగే " విత్తడమో, కోయడమో" చెయ్యక బ్రతికేవాడ్ని. నాన్న ఉన్నంత కాలం ఎలాగో సర్దుకు పోయింది. నాన్న పోయాక ఒక్క సారిగా యధార్థం నెత్తి మీద పిడుగులా దిగింది.

అవసరం నన్ను సంపాదన మార్గంలోకి తోసింది. నా అవసరంతో నా చుట్టూ ఉన్నవారు సంపాదించ కలిగినారే గాని నేను నష్ఠ పోవడమే జరిగింది. ఇలా నేను నష్ఠ పోయిన సందర్భాలు కోకొల్లలు. నాకు మరీ చికాకెక్కువ. స్టీరియో టైప్ కథలు, సినిమాలంటే నాకు వళ్ళు మండుతుంది. అలాంటిది జీవితంలో ఒకే విదమైన తప్పులు ఎలా చెస్తాను? కొత్త కొత్త తప్పులు చేసాను.

నేను ఏ టాటా,బిర్లా,  అంబాని,వాడియా కుటుంభాల్లో బుల్లి మనముడిగా పుట్టి అన్ని తప్పులు చేసి ఉంటే వారి శతాబ్దకాల ఆస్తులన్ని కాలి పోయి మన దేశం ఆపరేషన్ ఇండియాతో అవసరమే లేక సంపన్న దేశమై ఉంటుంది.

నా తప్పులతో నా చుట్టూ ఉన్నవారంతా లాభపడ్డారని ఇదివరకే చెప్పానుగా

సంపాదన మార్గం: 1               " సెకండ్స్ బజారు"

ఒక సారి మీ ఇంటి అరక పైకి ఎక్కి చూడండి అందులో ఏవేవో చెత్తలుంటాయి. మీ అబ్బాయి పుట్టినప్పుడు కొన్న మస్కిటో నెట్, అతను పడుకొన్న ఊయల, తోసుకుని పరుగులు తీసిన త్రోపుడు బండి,అతను తోలిన ట్రై సైకిళ్ అన్నీ పడి ఉంటాయి. ( ఈ లిస్టు ఓటరు జాబితాకన్నా పెద్దది)

కాని మీ ఊళ్ళోనే ఎందరో పేద తల్లి తండ్రులుంటారు .వారికి వారి పాపకు మస్కిటీ నెట్ పెట్టుకోవాలనుంటుంది కాని ఆర్థక స్థోమత ఉండదు. మీ అరక మీద ఉన్నది మీకో అడ్డం, చెత్త కాని వీరికి?

ఈ పరిస్థ్తితిని దృష్ఠిలో ఉంచుకుని ఔత్సాహికులు ప్రతి ఆదివారం ఒక సెకండ్స్ బజారు నిర్వహించవచ్చు. ఇందుకు కావల్సింది ఒక ఖాళి స్థలం, ఒక షామియానా, కొంత అడ్వర్టైజ్ మెంట్. నామినల్ ఎంట్రన్స్ ఫీ పెట్టి సెకండ్స్ వస్తువులను లోనికి అనుమతించ వచ్చు. అవి సేల్ అయితే కొంత కమీషన్ టైపులో వసూలు చెయ్యొచ్చు.

ఈ సలహాను అమలు చేసి సంపాదించ దలచినవారు తమ ప్రకటనల్లో నా ఈ సైట్ పేరు  యు ఆర్ ఎల్ ముద్రిస్తే చాలు ( ఇదే ఫీజు)