క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Showing posts with label Money. Show all posts
Showing posts with label Money. Show all posts

Monday, 17 January 2011

డబ్బుతో ఏం కొంటున్నాం ? ఎందుకు?

పప్పు ,ఉప్పు,భియ్యం కొంటాం !
ఎందుకు తినకుంటే చచ్చి పోతామా ? నేను 10 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసాను. మొదటి రోజైతే భాగా ఆకలైంది. రెండో రోజునుండి ఆకలి శుద్దంగా లేదు.. మళ్ళీ ఐదో రోజో ఆరో రోజో కాస్త ఆకలైంది. పదవ రోజుదాకా ఆకలంటే ఏమో కూడ మరిచి పోయాను.

మరి ఎందుకు తింటున్నాం ? రోజూ తింటున్నాం. మూడు పూట్ల తింటున్నాం. వండి,ఉడక పెట్టి,వేంచి,తాలింపు చేసి, తింటాం.

మూడు పూటలు తింటున్నాం. ఇది చాలక స్నేక్స్,ఐస్ క్రీం . బ్రతకడానికి తింటున్నామా ? లేక తిని తిని చావడానికి తింటున్నామా ? బహుసా బతకడానికి అన్న ముసుగులో చావడానికే తింటున్నామేమో ?

మరి చావడానికేనా డబ్బు ? చావడానికేనా డబ్బు సంపాదిస్తున్నాం ?

బాడుగలు కడుతున్నాం / లేదా హవుసింగ్ లోన్ వాయిదాలు కడుతున్నాం:
ఏ మాత్రం గాలి ఆడని, సూర్య చంద్రుల వెలుతురు తొంగి చూడని , ఇళ్ళకు వేలాది రూపాయలు బాడుగలు కడుతున్నాం. కొన్ని బాడుగ ఇళ్ళల్లో అయితే గేట్ బీగాలు ఇంటి ఓనర్ వద్ద ఉంటుంది. రాత్రి పదికంతా గేట్ లాక్ చేస్తారు. మీరు ఇల్లు చేరడానికి రాత్రి పదై పోతే మీ బతుకు బస్ స్టాండే ! ఇలా ఒకటి కాదు రెండు కాదు సవా లక్షా ఉన్నాయి

ఇక స్వంత ఇల్లు నిర్మించిన వారి కథ చూస్తే జీవిత కాలపు పొదుపును దార పోసి జీవిత కాలపు అప్పులతో , అడ్డమైన పన్నులు కడుతూ ఉన్నారు, ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?

కరెంటు బిల్లులు కడుతున్నాం:
ఎప్పుడుంటుందో, ఎప్పుడు పోతుందో తెలీదు. మిక్సీలు,గ్రైండర్లు,ఎలక్ట్రిక్ కుక్కర్లు పని చెయ్యడంతో మన ఇంట్లోని స్త్ర్రీలు బొత్తిగా పని చెయ్యక స్థూల కాయులై, బి.పి, షుగర్ వ్యాదులకు గురవుతూ చచ్చు టి.వి.సీరియళ్ల మద్యలో వచ్చే అడ్వర్టైజ్ మెంట్ గ్యేపుల్లో అన్నం పెడుతుంటారు అయినా సంపాదిస్తూనే ఉన్నాం కరెంటు బిల్లులు కడ్తూనే ఉన్నాం. ఇందులో మరో మెలిక ఏమంటే ఆఖరు తేది దాటితే యాభై రూపాయల ఫైన్ తో కూడ కడుతున్నాం. ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?

మొబైల్ ఫోన్స్ కొంటున్నాం ఫోన్ బిల్లులు కడుతున్నాం:
ఆ ఫోన్ ఏం చేస్తుంది ? ఈ ప్రపంచముతో మనలను అనుసందానం చేస్తుంది ప్రకటనలు చేస్తే కొన్నాం. కేవలం పిచ్చుకలు సైతం తట్టుకోని వేవ్స్ వెదజల్లే టవర్లు వెలిసాయి. పట్టణ పరిదిలో ఒక మంచి వాడిని చూపగలరేమో గాని ఒ క్క పిచ్చుకను సైతం మీరు చూపలేరు.ఒకే.మొబైల్ ఫోన్ మనలను ప్రపంచంతో అనుసందానం చేస్తుందట. నిజంగా..నిజంగా అది అనుసందానం చేసేది ప్రపంచముతోనా ? కాదే ఎంత బిజిగా ఉండే ఏ మొబైలరునన్నా తీసుకొండి. అతనితో నిత్యం అనుసందించబడి ఉన్న కాలర్స్ ను వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు.
పోనీ ఆ అనుసందానమన్నా ఆనందాన్ని ఇస్తుందా ? లేదే..............రకరకాలైన ఇబ్బందులు
టూ వీలర్లకు పెట్రోలు కొట్టిస్తాం:
పొల్యూషన్ ..........ఏయిర్ పొల్యూషన్ ,సౌండ్ పొల్యూషన్,ప్రమాదం జరిగే ప్రమాదం
పిల్లల స్కూలు ఫీజులు , ట్యూషన్ ఫీజులు కడుతున్నాం:
పిల్లలను ఇపరీతంగా కొడుతున్నారని,మానసికంగా హింసించగా పిల్లలు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని,లైంగిక వేదింపులకు గురి చేస్తున్నారని పత్రికల్లో చదువుతూనే ఉన్నాం. పిల్లలక్ విపరీతమైన మానసిక వత్తిడినిచ్చే విద్యను వారిపై రుద్దుతున్నాం. టేప్ రెకార్డర్లు వచ్చి ఎంతో కాలమైనా పిల్లల మస్తిష్కాలను కేవలం రికార్డర్లుగా మార్చుతున్నాం
ఇలా ఒకటి కాదు రెండు సవా లక్షా ఖర్చులు పెడుతున్నాం . ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?
పొదుపు:
ఇవి చాలక మనలో చాలా మంది పొదుపు కూడ చేస్తుంటాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో అయితే సర్వీసు బెటరుగా ఉండదని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల్లొ అధిక వడ్డికి ఆశ పడి పెట్టి గోచీ సైతం ఊడిపోతుంది.
పోని నేష్నలైజ్డ్ బ్యాంకుల్లో మన డబ్బు దాచుకుంటామనుకుంటే వారు ఏ.టి.ఎం.ల ద్వారా నకిలీ నోట్లు సరఫరా చేస్తున్నారు. షేర్ మార్కెట్ లోనే పెట్టుబడి పెడితే ఎవడో బాత్ రూంలో కాలు జారి పడినా, మరి ఇంకెవడో తాగి పడిపోయినా షేర్ మార్కెట్ కుప్ప కూలి పోతుంది ఎందుకొచ్చిన గొడవా అని మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే ,ఎల్.ఐ.సి ప్రిమియం కట్టుకుంటే వారు సైతం షేర్ మార్కెట్ లో మన సొమ్ము పెట్టి మన జీవితాలను జూదం చేస్తున్నారు. మరి మన సంపాదనలు బతకడానికా చావడానికా?

ఏ రోజన్నా మన డబ్బును కేవలం మన ఆత్మ సంతృప్తి కోసం ఖర్చు పెట్టామా? లేదు.. ప్రతి రూపాయి సమాజం కోసం ఐ మీన్ సమాజం దృష్ఠిలో దిగజారి పోకుండా ఉండేందుకు ,ఇతరులు మనలను తక్కువ అంచనా వేయకుండేందుకే ఖర్చు పెడుతూ వస్తున్నాం.

మనం ఎంతకాలం ఎన్ని విదాలుగా ఖర్చు పెట్టినా ఏదో రోజు,ఏదో క్షణం మన శ్రమంతా వృధా చేసిన ఫీలింగే కలుగుతూంది. అయినా వృధా చేస్తూనే ఉన్నాం.

మరి ఆ డబ్బును ఎలా సంపాదిస్తున్నాం ఆ డబ్బేదో మనలను ఉద్దరిస్తుందని, మనలను మనవారిని సంతోష పెడుతుందని భావించి సంపాదిస్తాం. మరీ మన వ్యక్తిత్వం,ఆత్మ గౌరవం, మాతృ భూమి,మాతృ భాష ఇలా ఒకటికాదు అన్నింటిని మరిచి ,తుడిచి పెట్టి సంపాదిస్తున్నాం.

ఏదో క్షణం "తూ ..నా బతుకు" అనిపించినా మరుక్షణం అదే తంతు. ఒక్క సారి పునరాలోచిద్దాం. మన ఆలోచనలను పరిశీలిద్దాం. మన సంపాదనా మార్గాలను, సంపాదనను వెచ్చించే మార్గాలను సమీక్షిద్దాం.

ఏ డెబ్బై ఏళ్ళ వయస్సుకో - మరణ శయ్య మీదో ఆలోచించినా నిర్ణయం తీసుకున్నా క్రిమినల్ వేస్ట్..

ప్లాస్టిక్,ఎలక్ట్ర్రానిక్ చెత్తల మీద మోజుతో  గడ్డిని ,ఆ గడ్డి పై కిరణ్ ప్రభుత్వంలా వనుకుతూ కనిపించే నీటి భింధువును, దానిలో నిక్షిప్తమై ఉన్న సమస్త సృష్ఠిని ఎప్పుడు దర్శిస్తాం!

Tuesday, 16 November 2010

డబ్బును అర్థం చేసుకొండిలా.


డబ్బుకింత విలువరావడానికి కారణం - డబ్బు కోసం మానవుడు సర్వం ధారపోసి పిచ్చి వాడైపోతున్నందుకు కారణం దాని గురించిన అపోహలే.  వాటిని తొలగించాలనే  ఈ టపా.
1.డబ్బు రక్తం వంటిది . అది సమాజమనే శరీరమంతటా సర్క్యులేట్ అవుతూ ఉండాలి. లెకుంటే క్రమేణా ఆ శరీరానికి /సమాజానికి పక్షవాతం వస్తుంది. ఒక భాగం నిస్తేజమవుతుంది.
2.డబ్బు ఎటువంటి మూర్ఖుడనైనా జ్నానిగా మార్చ గల సరస్వతి ఆకు
3.డబ్బు మూగవాడిని సైతం పలికించగలదు ,గృడ్డి వాడ్ని సైతం చూసేలా చేస్తుంది. అవిటి వాడ్ని సైతం క్లాప్స్ కొట్టేలా చేస్తుంది, కుంటివాడ్ని సైతం మనకేసి పరుగు తీసేలా చేస్తుంది
4.డబ్బు ఏ బాషస్తునికైన అర్థమయ్యే విశ్వ బాష (గ్లోబల్ ల్యేంగువేజ్)
5. డబ్బు తేనె నిండిన పాత్ర వంటిది ..దాని ఎడ్జి (Edge) మీద  వాలి కొంత ఆరగిస్తే ఆకలి తీరుతుంది, ఆనందం కలుగుతుంది. దానిలోకి దూకితే రెక్కలు తడిసి అందులోనే మునిగి ఊపిరాడక చచ్చి పోతాం
6.డబ్బు మనకు ప్రాణాధారమైన  ఆక్సిజన్ కన్నా గొప్పది. ఎందుకంటే డబ్బుతో ఆక్సిజన్ న్ సైతం కొనగలం.
7.డబ్బుతో మానవుడు కాలం,దూరాన్ని గెలవగలగడం అతని అదృష్ఠం ..కొన్ని సార్లు గుండెలను కూడ గెలవ వలసి రావడం  అతని దురదృష్ఠం
8.డబ్బు ........దాని అవసరంతో ప్రయత్నించేవానికి ఎండమావి. తీరిగ్గా ప్రయత్నించేవానికి సెలయేరు
9.డబ్బు పటిష్ఠమైన ఆత్మగౌరవం గల వస్తువు..కేవలం ఆహాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం ఖర్చు పెట్టే వానిని వీడి వెళ్ళి పోతుంది.
10.డబ్బు ఆత్మ గౌరవంతో బ్రతికేలా చేస్తుంది. కాని దానిని పొందాలంటే బలి చేయవలసింది కూడ దానినే
11. డబ్బు జీవితాన్ని తేజోమయం చేసే దీపం. కొన్ని సందర్బాల్లో దానిని గుగ్గి పాలు చేసే అగ్ని కూడ అదే
12.డబ్బు బుల్లెట్ వంటిది. ట్రిగ్గర్ నొక్కాక బుల్లెట్ పై అధికారాన్ని పోగొట్టుకున్నట్టే డబ్బును వెచ్చించాక దానిపై అధికారం కోల్పోతాం. ప్రేలుతున్న తుపాకీకంటే గురిపెట్ట బడిన తుపాకీకె ఆజ్నాపించే అధికారం ఎక్కువ.
13.డబ్బు భగవంతునికన్నా గొప్పది. ఎందుకంటే మానవుడు దేవుడ్ని కొనడానికి ప్రయత్నించేది ఆ డబ్బుతోనే
14.అప్పు చేస్తే దానికి చెల్లించవలసింది కేవలం వడ్డీ మాత్రమే కాదు. వెంకటేశుడే గాని కుభేరుని వద్ద అప్పు చేసే వడ్డీ చెల్లించే కమిట్ మెంట్ లేకుండా ఉండి ఉంటే మన చచ్చు కోరికలను సైతం వింటుండే వాడూ కాదు. కానుకలు స్వీకరింఛి నెరవేర్చేవాడూ కాదు.అప్పుకు వెల మన స్వేచ్చ,స్వాతంత్రయం
15.డబ్బు బోగి మంటలు వంటిది మరీ దగ్గరకెళ్తే కాలి పోతాం. మరీ దూరమైతే పేదరికపు చలి వనికిస్తుంది.
16.డబ్బు ఎంతటి కురూపినైనా అందగత్తగా నిలబెట్టగల బ్యూటిషియన్
17.డబ్బుంటే పరాయి మనుష్యులు సైతం దగ్గరవుతారేమో కాని, స్వంత మనుష్యులు దూరమవుతారు.
18.డబ్బు బుర్రతో ఆలోచించే తెలివిని ఇస్తుంది  హృదయంతో ఆలోచించే మానవత్వాన్ని సమాధి చేస్తుంది.
19.డబ్బు విచిత్రమైంది. అదున్నప్పుడు గాని,వస్తున్నప్పుడు గాని దాని ద్యాసే ఉండదు. దాని ద్యాస ఉన్నంత వరకు డబ్బే రాదు.
20.మనిషి ప్రతిదాన్నిమరణంతో  ముడేసి ఆలోచిస్తాడు.. చీకటి, ఒంటరితనం,తిరస్కారం, ఏకాంతం,అవమానం, పేదరికం, ఆకలి,వృద్ద్దాప్యం  ఇలా ఎన్నింటినో మరణ సమానంగా దలుస్తాడు. వీటిని గెలవడానికి  డబ్బు సాయం చేస్తుందని డబ్బును ప్రాణ సమానంగా చూస్తాడు. డబ్బు మానవుడు మరణం యొక్క చాయలతో చేసే యుద్దంలో సహకరిస్తుందేమో గాని ,మరణపు ఛాయలకు సైతం వెళ్ళ లేదు.21.అందరి వద్దా డబ్బుంది. ఐ మీన్ డబ్బుగా మార్చుకోగల వస్తువు ఉంది. దానిని గుర్తించినవాడు దనవంతుడవుతాడు
22.డబ్బు కొందరి విషయంలో  జుట్లన్ని రాలిపోయాక చేతికందే  దువ్వెన
23.డబ్బు పేదరికపు చీకటిని పారద్రోలే చిరుదీపం. కొందరి విషయంలో అది తల కొరివిగానూ మారుతుంది.
24.దనం జీవనయానానికి అవసరమైన ఇందనం.
25.డబ్బు కేవలం ఒక పని ముట్టు. దానిని సమకూర్చుకోవడం  గొప్ప కాదు.దాంతో ఏం చేస్తామన్నదే గొప్ప.
26.లక్ష్య సాధనకు డబ్బు ఉపకరించ వచ్చు. కాని డభ్భే లక్ష్యం కాకూడదు.
27.మనం సంపాదించాలంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు డబ్బు సంపాదిస్తుండాలి. కనీశం సంపాదించాలన్న ఉద్దేశంతో ఉండాలి.
28.డబ్బు ఏదో రోజు వస్తుందంటే దానికి విలువ లేదు. రోజూ వస్తుందంటే పది రెట్ల విలువ.నెల నెలా వస్తుందంటే కొంత విలువ.
29. కష్ఠించి సంపాదించడం సుఖ పడటం కోసమే. అందుకని కొందరు సుఖ పడటాన్ని వాయిదా వేసుకుంటూ సంపాదిస్తూ ఉండి పోతారు. సుఖ పడటం కోసం కష్ఠపడాలి. కష్ఠ పడుతూనే సుఖ పడాలి. సుఖపడుతూనే కష్ఠ పడాలి
30.సంపాదనకు అలవాటు పడితే పర్వాలేదు గాని అది వ్యసనమై పోకూడదు.
31.డబ్బు .. సౌండ్ proof వంటిది. డబ్బుతో ఉంటే ఆకలి కేకలు వినబడవు
32. డబ్బు బి.పి టాబ్లెట్ కన్నా భాగా రక్త్ పోటును నియంత్రించగలదు
33.డబ్బుకు ఆత్మ గౌరవం ఎక్కువ. అహం దానికి బద్ద శతృవు. ఎవడైతే తన అహాన్ని బలి పెడతాడో వాడికి స్వంతమవుతుంది.
34. డబ్బు ఏ ఫారీన్  సెంట్ కన్నా గొప్పది మీ కంపును కంట్రోల్ చేస్తుంది
35.డబ్బు ఏ మౌత్ ఫ్రెష్నరుకన్నా గొప్పది. మీ మాటలకు సువాసనను జోడిస్తుంది.
36.డబ్బు ఎండిన ఎముకల మూట  వంటిది. లోకులు కుక్కలు వంటివారు. మీరు విసురుతూ పోతే  లోకుల కాటు నుండి తప్పించుకోవచ్చు.
37.డబ్బు  జస్ట్ ఒక  ముడి సరుకు వంటిది .. దానినే ప్రాడక్ట్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే .
38. పదహారడుగుల వెదురు కొయ్యవంటిది. దానిలో  పన్నెండు అంగుళాలు చాలు. ఒక పిల్లన గ్రోవి చేయించుకుని ఆనందంగా జీవించటానికి. పదహారడుగులూ కావలంటే అదే మీకు పాడె సైతం కాగలదు
39.డబ్బు మీ దగ్గర పుష్కలంగా ఉన్నంత కాలం అది లేకుండానే అన్ని పనులూ అయిపోతాయి. అదే మీ దగ్గర లేకుంటే ప్రతి క్షణం డబ్బు అవసరమవుతుంది
40.డబ్బు లెని వారుండొచ్చు. డబ్బు అవసరం లేని వారు లేరుగా? ( మేజర్ చంద్ర కాంత్)
41. డబ్బు సంజీవణి మంత్రం వంటిది చచ్చిన శవానికి సైతం ప్రాణం పొయ్యగలదు
42. అరవై శాతం డబ్బు నలబై శాతం ఇతర ప్రతిభలున్నా ఓకే. నలబై శాతం డబ్బు అరవై శాతం ఇతర ప్రతిభలున్నా విజయం మనదే..
43.సంపాదన  బ్యేటు పట్టుకుని ఆటలో కొనసాగడం.  సిక్సర్లు ,ఫోర్లు కుమ్మెయ్యడం  అప్పుడప్పుడు తఠస్తిస్తుంటాయంతే.
44. డబ్బు కన్నె పొర వంటిది. ఏ ముసలిదానినైనా కన్యగా మార్చగలదు.

Saturday, 6 March 2010

మని సీక్రెట్స్ సెమినార్ డివిడి విక్రయానికి

గత 2009 ఆగస్ట్ నెలలో చిత్తూరు జెడ్.పి మీటింగ్ హాల్ యందు పాజిటివ్ తింకర్స్ క్లబ్ ఆద్వర్యంలో ,కౄష్ణా జ్యుయెలర్స్ సౌజన్యంతో మనీ సీక్రెట్స్ మీద జరీన సెమినార్ డి.వి.డి విక్రయానికి సిద్దంగా ఉంది. 
డబ్బు లేని వారున్నాం కాని డబ్బవసరం లేని వారం ఎవరమూ లేదు. డబ్బు గురించిన మర్మాలను చేదిస్తే కాని దానిని కైవశం చేసుకోవడం కుదరదు.
డబ్బుతో మనం ఏన్ చేస్తున్నాం ( మరణం యొక్క చాయలైన వౄద్దాప్యం, ఒంటరి తనం, తిరస్కారం,చీకట్లతో యుద్దం చేస్తున్నాం )  దనం, రణం, మరణం, మథననం (సెక్స్) ఇవన్ని స్థూలంగా వేరైనా సూక్మంగా ఆలోచిస్తే ఇవన్ని ఒకటే ..ఇల ఎన్నో విప్లవాత్మక సత్యాలను ఈ డి.వి.డి ద్వారా తెలుసుకోవచ్చు.

మీ శరీరం,మనస్సు,బుద్ది,ఆత్మ,కుతుంభాలను సంపాదనకు అనుగుణంగా మలుచు కో గలిగితే సంపాదన ఎంతో సునాయాశం. అదెలా సాధ్యమో తెలుసుకోవాలంటే ఈ డి.వి.డిని తిలకించవలసిందే.  లాభాపేక్ష లేక కేవలం రూ,100 కే ఈ డి.వి.డి ని మీకందివ్వాలని నిర్ణయించాను. పది లేదా ఆపై సంఖ్యలో ఆర్డరు చేసినవారికి తగిన రాయితీ లభ్యం.

వెంటనే సంప్రదించండి 9397036815
నా బ్యాంకు ఖాతాలో జమ చేయ కోరువారు లేదా బదిలి చేయ కోరువారికి నా ఖాతా వివరాలు:
Name: Sundaresan Murugan
A/C No: 30333022274

Branch Name: GREAMSPET

Branch Code: 7083

Address: C.B.ROAD

City/State: CHITTOOR, AP

Pincode: 517002

Swift Code: N/A

RTGS : YES

ఎం.ఓ పంప దలచినవారు:
చిత్తూరు .ఎస్.మురుగేషన్ , 16-113, స్వామి మేస్త్రి వీథి, చిత్తూరు ఆ.ప్ర 517001 అనే చిరునామాకు పంపండి.
చెక్ పంప కోరువారు:
ఎస్.మురుగన్ అన్న పేరిట్ చెక్ వ్రాసి చిత్తూరు .ఎస్.మురుగేషన్ , 16-113, స్వామి మేస్త్రి వీథి, చిత్తూరు ఆ.ప్ర 517001 అనే చిరునామాకు పంపండి.

Friday, 8 January 2010

ఆర్థిక ఇబ్బందులా?

మీరు మీ జాతకం చూపనక్కర్లేదు. ఇట్టే ఓ అద్భుత పరిష్కారం చెబుతా. మీ అనుభవాలను ఇక్కడ కెమెంట్ రూపంలో అందించండి.
ఓ 9 రోజులు మౌన వ్రతం పాటించండి. ఒంటరిగా ఉన్న సమయాన కంటికి గంతలు కట్టుకొండి. ఇక చూసుకొండి ఏదో రూపంగా నాలుగు రాళ్ళు వచ్చి పడతాయి. వెంటనే ఖర్చులు పెట్టెయ్యకుండా ఏవైనా చిన్న చిన్న అప్పులు ఉంటే తీర్చటం మొదలు పెట్టండి.
చెప్పడం మరిచాను. మీకు చీటికి మాటికి పావలా అర్ద రూపాయి మాత్రలు మ్రింగే అలవాటుంటే పై 9 రోజులు దాని మానెయ్యండి. ఎవరితొణూ వాదులాడకండి. ఓకే జూట్.. (అబద్దం కాదండి ముర్రో)
మీ అనుభవాన్ని తెలిపితే మరిన్ని సలహాలు ఈ సలహా వెనుకున్న గూడ రహస్యాన్ని చెబుతాను